Ben Austin : క్రికెట్ ప్ర‌పంచంలో తీవ్ర విషాదం.. ఫిల్ హ్యూస్ త‌ర‌హాలోనే.. మెడ‌కు బంతి త‌గిలి 17 ఏళ్ల యువ క్రికెట‌ర్ మృతి

ఆస్ట్రేలియాకు చెందిన ఓ యువ క్రికెట‌ర్ (Ben Austin )మృతి చెందాడు.

Ben Austin : క్రికెట్ ప్ర‌పంచంలో తీవ్ర విషాదం.. ఫిల్ హ్యూస్ త‌ర‌హాలోనే.. మెడ‌కు బంతి త‌గిలి 17 ఏళ్ల యువ క్రికెట‌ర్ మృతి

Young Australian Cricketer Ben Austin Dies After Being Hit By Ball Before T20 Match

Updated On : October 30, 2025 / 2:29 PM IST

Ben Austin : క్రికెట్ ప్ర‌పంచంలో విషాదం చోటు చేసుకుంది. ఆస్ట్రేలియాకు చెందిన ఓ యువ క్రికెట‌ర్ మృతి చెందాడు. ప‌ద‌కొండు ఏళ్ల క్రితం ఆసీస్ ఆట‌గాడు ఫిల్ హ్యూస్ ఎలాగైతే ప్రాణాలు కోల్పోయాడో ఈ యువ ఆట‌గాడు కూడా అలాగే చ‌నిపోవ‌డం విచార‌క‌రం.

మెల్‌బోర్న్‌కు చెందిన 17 ఏళ్ల బెన్ ఆస్టిన్ ఓ స్థానిక టీ20 మ్యాచ్ కోసం సిద్ధం అవుతున్నాడు. మంగ‌ళ‌వారం నెట్స్‌లో హెల్మెట్ ధ‌రించి ఆలోమేటిక్ బౌలింగ్ మెషీన్ నుంచి వ‌చ్చే బంతుల‌తో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. అయితే.. ఓ బంతి అత‌డి త‌ల‌, మెడకు మ‌ధ్య ప్రాంతంలో బ‌లంగా త‌గిలింది. వెంట‌నే అత‌డు అక్క‌డిక‌క్క‌డే కుప్ప‌కూలిపోయాడు.

IND W vs AUS W : అదే జరిగితే టీమ్ఇండియా ఖేల్ ఖ‌తం.. హ‌ర్మ‌న్ ప్రీత్ సేన‌కు మ‌రో టెన్ష‌న్‌..!

స‌హ‌చ‌ర ఆట‌గాళ్లు అత‌డిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ అత‌డు గురువారం ఉద‌యం ప్రాణాలు విడిచాడు.

‘బెన్ ఆక‌స్మిక మరణం మ‌మ్మ‌ల్ని కుంగదీసింది. అత‌డి మృతి మా క్రికెట్ క‌మ్యూనిటీపై ప్ర‌భావం చూపిస్తుంది. ఈ స‌మ‌యంలో బెన్ కుటుంబ గోప్య‌త‌కు భంగం క‌లిగించ‌వ‌ద్ద‌ని కోరుకుతున్నాం.’ అని ఫెర్న్‌ట్రీ గల్లీ క్రికెట్ క్లబ్ ఓ ప్రకటనలో తెలిపింది.

Shreyas Iyer : ప్రాణాంత‌క గాయంపై తొలిసారి స్పందించిన శ్రేయ‌స్ అయ్య‌ర్‌.. ‘రోజు రోజుకు నేను.. ‘

2014లో ఫిల్ హ్యూస్‌..
2014లో ఆసీస్ టెస్టు స్టార్ బ్యాట‌ర్ ఫిల్ హ్యూస్ దేశీయ షెఫీల్డ్ షీల్డ్ మ్యాచ్ సంద‌ర్భంగా బ్యాటింగ్ చేస్తూ మెడ‌కు బంతి త‌గిలి అక్క‌డిక‌క్క‌డే కుప్ప‌కూలిపోయి ప్రాణాలు కోల్పోయాడు. అతని మరణం ఆస్ట్రేలియా, క్రికెట్ ప్ర‌పంచాన్ని తీవ్ర‌ దిగ్భ్రాంతికి గురిచేసింది, ఈ ఘ‌ట‌న త‌రువాత ఐసీసీ కంక‌ష‌న్ రూల్స్ తీసుకువ‌చ్చింది.