World Archery Championships : ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో చ‌రిత్ర సృష్టించిన భార‌త మ‌హిళా ఆర్చ‌ర్లు

ప్ర‌పంచ ఆర్చ‌రీ ఛాంపియన్‌షిప్‌(World Archery Championship) 2023లో భార‌త మ‌హిళ‌లు చరిత్ర సృష్టించారు. బెర్లిన్ వేదిక‌గా జ‌రిగిన‌ పోటీల్లో వెన్నం జ్యోతి సురేఖ, పర్నీత్‌ కౌర్‌, అదితీ గోపీచంద్ స్వామిల‌ తో కూడిన ఆర్చ‌రీ బృందం స్వ‌ర్ణ ప‌త‌కాన్ని సొంతం చేసుకుంది.

Indian Women Archers Team

World Archery Championships 2023: ప్ర‌పంచ ఆర్చ‌రీ ఛాంపియన్‌షిప్‌(World Archery Championship) 2023లో భార‌త మ‌హిళ‌లు చరిత్ర సృష్టించారు. బెర్లిన్ వేదిక‌గా జ‌రిగిన‌ పోటీల్లో వెన్నం జ్యోతి సురేఖ, పర్నీత్‌ కౌర్‌, అదితీ గోపీచంద్ స్వామిల‌ తో కూడిన ఆర్చ‌రీ బృందం స్వ‌ర్ణ ప‌త‌కాన్ని సొంతం చేసుకుంది. ఫైన‌ల్‌లో మెక్సికోకు చెందిన డఫ్నే క్విన్‌టెరో, అనా సోఫా హెర్నాండెజ్‌, అండ్రే బెసెర్రా త్ర‌యాన్ని 235-229 తేడాతో ఓడించారు. త‌ద్వారా వ‌ర‌ల్డ్ ఆర్చ‌రీ ఛాంపియ‌న్ షిప్‌లో భార‌త్ కు మొద‌టి స్వ‌ర్ణ ప‌తకాన్ని అందించిన ఆర్చ‌ర్లుగా రికార్డుల‌కు ఎక్కారు.

IND vs IRE : భార‌త్‌తో త‌ల‌ప‌డే ఐర్లాండ్ జ‌ట్టు ఇదే.. కెప్టెన్ ఎవ‌రంటే..?

భార‌త మ‌హిళా ఆర్చ‌ర్ల‌కు మొద‌టి రౌండ్‌లోనే బై ల‌భించింది. రెండో మ్యాచులో ట‌ర్కీపై 230-228 గెలిచి క్వార్ట‌ర్స్‌లో అడుగుపెట్టింది. అక్క‌డ‌ చైనీస్ తైపీపై 228-226 తేడాతో విజ‌యం సాధించి సెమీస్‌కు చేరుకుంది. సెమీస్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ కొలంబియాను 220-216 తో మట్టికరిపించి ఫైన‌ల్‌కు చేరుకున్నారు. ఫైన‌ల్‌లోనూ త‌మ‌దైన హ‌వా కొన‌సాగిస్తూ మెక్సికోను ఓడించి గోల్డ్ మెడ‌ల్‌ను సొంతం చేసుకున్నారు.

gukesh surpasses anand : ఇండియా టాప్ చెస్ క్రీడాకారుడిగా గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేష్…విశ్వనాథన్ ఆనంద్ రికార్డు బద్దలు

ఈ సంద‌ర్భంగా అదితీ మాట్లాడుతూ.. ఈ పోటీల్లో దేశానికి తొలి ప‌త‌కం అందించ‌డం ఎంతో సంతోషంగా ఉంద‌ని చెప్పింది. టోర్నీ ఆరంభం నుంచి ఫైన‌ల్ వ‌ర‌కు జైత్ర‌యాత్ర కొన‌సాగించ‌డం ఆనందంగా ఉంది. ప‌సిడి గెలుస్తామ‌నే ల‌క్ష్యంతోనే బ‌రిలోకి దిగిన‌ట్లు వెల్ల‌డించింది.