Tokyo Olympics 2020: పతకం వైపు మరో అడుగు.. పీవీ సింధు విజయం
టోక్యో ఒలింపిక్స్‌లో భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు గొప్ప ప్రదర్శన కనబరుస్తున్నారు. మరో సులభమైన విజయంతో ప్రీ-క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు సింధు.
- vamsi
- Published On : July 28, 2021 / 08:48 AM IST
Pv Sindu
PV Sindhu: టోక్యో ఒలింపిక్స్‌లో భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు గొప్ప ప్రదర్శన కనబరుస్తున్నారు. మరో సులభమైన విజయంతో ప్రీ-క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు సింధు.. 21-9, 21-16తో హాంకాంగ్ ప్లేయర్ చేంగ్ న్గాన్‌ను వరుస గేమ్‌లలో ఓడించి, సిరీస్‌లో మరో అడుగు ముందుకు వేసింది. టోక్యో ఒలింపిక్స్‌లో భారత పతకాల ఆశలను సజీవంగా ఉంచుతూ అప్రతిహత విజయాలతో దూసుకుని పోతుంది పీవీ సింధూ.
గ్రూప్ జేలో ఉన్న సింధు.. ఆదివారం మహిళల సింగిల్స్‌లో తొలి మ్యాచ్‌లో ఇజ్రాయెల్ షట్లర్‌తో తలపడిన సింధు.. కేవలం 28 నిమిషాల్లో మ్యాచ్ ముగించి, ఫస్ట్ మ్యాచ్‌లో సత్తా చాటింది. పీవీ సింధు 21-7, 21-10తో వరుస సెట్లలో సునాయాసంగా గెలిచింది. ఇప్పుడు రెండో గేమ్‌లో కూడా సునాయాశంగా గెలిచింది. ఈ విజయంతో ఆమె మహిళల సింగిల్స్‌లో ప్రీ క్వార్టర్స్‌కు చేరుకుంది. ఈ మ్యాచ్‌లో సింధు మొదటి నుంచి ఆధిపత్యం చెలాయించింది.
