World Cup 2023 AUS Vs SA (Image Credit: @CricketAus)
134 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా విజయం
ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియా వరుసగా రెండో ఓటమిని ఎదుర్కొంది. దక్షిణాఫ్రికా చేతిలో ఇవాళ చిత్తుగా ఓడిపోయింది. ఆస్ట్రేలియాను దక్షిణాఫ్రికా 134 పరుగుల తేడాతో ఓడించింది. దక్షిణాఫ్రికా ఇచ్చిన 311 పరుగుల లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా మొదటి నుంచీ రాణించలేకపోయింది. ఆస్ట్రేలియా వరుసగా వికెట్లను సమర్పించుకుంటూ వచ్చింది. దక్షిణాఫ్రికా బౌలర్లధాటికి ఆసీస్ బ్యాటర్లు 40.5 ఓవర్లకే 177 పరుగుల వద్ద ఆలౌట్ అయ్యారు. ఆస్ట్రేలియా మొదటి మ్యాచులో భారత్ చేతిలో ఓడిన విషయం తెలిసిందే.
6 వికెట్లు డౌన్.. కష్టాల్లో ఆస్ట్రేలియా
టార్గెట్ ను ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా వరుసగా వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 70 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి ఎదురీదుతోంది. మాక్స్‌వెల్(3) కూడా నిరాశపరిచాడు. మార్కస్ స్టోయినిస్ 5 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. 20 ఓవర్లలో 80/6 స్కోరుతో ఆసీస్ ఆట కొనసాగిస్తోంది.
4 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా
స్వల్ప స్కోరుకే 4 వికెట్లు కోల్పోయి ఆస్ట్రేలియా కష్టాల్లో పడింది. మిచెల్ మార్ష్ 7, వార్నర్ 13, స్మిత్ 19, జోష్ ఇంగ్లిస్ 5 పరుగులు చేసి అవుటయ్యారు. 14 ఓవర్లలో 60/4 స్కోరుతో ఆసీస్ ఆట కొనసాగిస్తోంది.
Australia are in trouble of losing two back-to-back ? https://t.co/eqZrhS2trz | #AUSvSA | #CWC23 pic.twitter.com/9s8ftKSWPg
— ESPNcricinfo (@ESPNcricinfo) October 12, 2023
ఓపెనర్లు అవుట్.. ఆసీస్ కు భారీ షాక్
సౌతాఫ్రికా పెట్టిన 312 పరుగుల టార్గెట్ ను చేరుకునేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది. 27 పరుగులకే ఓపెనర్లు ఇద్దరూ అవుటయ్యారు. మిచెల్ మార్ష్ 7, వార్నర్ 13 పరుగులు చేసి అవుటయ్యారు. 8 ఓవర్లలో 36/2 స్కోరుతో ఆసీస్ ఆట కొనసాగిస్తోంది.
ఆస్ట్రేలియా టార్గెట్ 312
ఆస్ట్రేలియాకు సౌతాఫ్రికా 312 పరుగుల టార్గెట్ పెట్టింది. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 311 పరుగులు చేసింది. ఓపెనర్ డికాక్ (109) సెంచరీ చేయగా, మార్క్రామ్ హాఫ్ సెంచరీ (56)తో రాణించాడు. ఎంబా బావుమా 35, క్లాసెన్ 29, మార్కో జాన్సెన్ 26, మిల్లర్ 11 పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్, మాక్స్‌వెల్ రెండేసి వికెట్లు తీశారు. ఆడమ్ జంపా, హేజిల్‌వుడ్, కమిన్స్ తలో వికెట్ దక్కించుకున్నారు.
క్లాసెన్ అవుట్.. ఐదో వికెట్ డౌన్
267 పరుగుల వద్ద సౌతాఫ్రికా ఐదో వికెట్ నష్టపోయింది. క్లాసెన్ 29 పరుగులు చేసి అవుటయ్యాడు. దక్షిణాఫ్రికా 45 ఓవర్లలో 272/5 స్కోరుతో ఆట కొనసాగిస్తోంది.
ఐడెన్ మార్క్రామ్ హాఫ్ సెంచరీ
దక్షిణాఫ్రికా బ్యాటర్ ఐడెన్ మార్క్రామ్ హాఫ్ సెంచరీ చేశాడు. 41 బంతుల్లో 6 ఫోర్లు, సిక్సర్ తో అర్ధ శతకం పూర్తిచేసిన అతడు 56 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు. దక్షిణాఫ్రికా 44 ఓవర్లలో 267/4 స్కోరుతో ఆట కొనసాగిస్తోంది.
డి కాక్ రెండో సెంచరీ
ప్రపంచకప్ దక్షిణాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డి కాక్ వరుసగా రెండో సెంచరీ కొట్టాడు. 90 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్లతో శతకం పూర్తి చేశాడు. శ్రీలంకతో శనివారం జరిగిన మ్యాచ్ లోనూ అతడు సెంచరీ సాధించాడు. దక్షిణాఫ్రికా 31 ఓవర్లలో 177/2 స్కోరుతో ఆట కొనసాగిస్తోంది.
Back to back centuries for Quinton de Kock in #CWC23 ?@mastercardindia Milestones ?#CWC23 #AUSvSA pic.twitter.com/UuAV57DhP4
— ICC Cricket World Cup (@cricketworldcup) October 12, 2023
25 ఓవర్లలో దక్షిణాఫ్రికా స్కోరు 136/1
దక్షిణాఫ్రికా 25 ఓవర్లలో వికెట్ నష్టపోయి 136 పరుగులు చేసింది. ఎంబా బావుమా 35 పరుగులు చేసి తొలి వికెట్ గా అవుటయ్యాడు. క్వింటన్ డి కాక్ 84, వాన్ డెర్ డస్సెన్ 11 పరుగులతో ఆడుతున్నారు.
ఎంబా బావుమా అవుట్.. ఫస్ట్ వికెట్ డౌన్
దక్షిణాఫ్రికా మొదటి వికెట్ నష్టపోయింది. 19.4 ఓవర్లో ఎంబా బావుమా(35) గ్లెన్ మాక్స్‌వెల్ బౌలింగ్ లో అవుటయ్యాడు. దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 108/1 స్కోరుతో ఆట కొనసాగిస్తోంది.
డి కాక్ హాఫ్ సెంచరీ
దక్షిణాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డి కాక్ హాఫ్ సెంచరీ సాధించాడు. 51 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో అర్ధశతకం పూర్తి చేశాడు. దక్షిణాఫ్రికా 16 ఓవర్లలో 88/0 స్కోరుతో ఆట కొనసాగుతోంది. 2019 వరల్డ్ కప్ లో మాంచెస్టర్ లో ఆసీస్ తో జరిగిన మ్యాచ్ లో డి కాక్ 52 పరుగులు చేశాడు.
◾ 100 vs SL
◾ 50* vs AUSQuinton de Kock is having an outstanding start to his World Cup ? https://t.co/eqZrhS2trz | #AUSvSA | #CWC23 pic.twitter.com/mwYCqs9E7w
— ESPNcricinfo (@ESPNcricinfo) October 12, 2023
10 ఓవర్లలో దక్షిణాఫ్రికా స్కోరు 53/0
దక్షిణాఫ్రికా 10 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 53 పరుగులు చేసింది. ఎంబా బావుమా 17, క్వింటన్ డి కాక్ 30 పరుగులతో ఆడుతున్నారు.
దక్షిణాఫ్రికా 5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 19 పరుగులు చేసింది. ఎంబా బావుమా 5, క్వింటన్ డి కాక్ 14 పరుగులతో ఆడుతున్నారు.
బ్యాటింగ్ ప్రారంభించిన సౌతాఫ్రికా
టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకోవడంతో సౌతాఫ్రికా ముందుగా బ్యాటింగ్ ప్రారంభించింది. ఎంబా బావుమా, క్వింటన్ డి కాక్ ఓపెనర్లుగా వచ్చారు.
టాస్ గెలిచిన ఆస్ట్రేలియా
ఆస్ట్రేలియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దక్షిణాఫ్రికా ముందుగా బ్యాటింగ్ చేయనుంది. శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో రికార్డుస్థాయిలో స్కోరు నమోదు చేసిన సౌతాఫ్రికా ఈ రోజు ఎలా ఆడుతుందో చూడాలని క్రికెట్ లవర్స్ వెయిట్ చేస్తున్నారు.
Australia captain Pat Cummins wins the toss and elects to field in the crucial #CWC23 clash against South Africa in Lucknow.
Details ?#AUSvSAhttps://t.co/e4fuhRRltl pic.twitter.com/mME2L2fpLY
— ICC Cricket World Cup (@cricketworldcup) October 12, 2023
ఐసీసీ వన్డే ప్రపంచకప్ లో గురువారం జరగనున్న 10వ మ్యాచ్ లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి. లక్నోలోని ఎకానా స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. శ్రీలంకతో జరిగిన తమ మ్యాచ్‌లో ఘన విజయాన్ని అందుకున్న సఫారీ టీమ్ జోష్ లో ఉంది. ఇదే జోరును కొనసాగించాలని భావిస్తోంది. మరోవైపు టీమిండియాతో జరిగిన మ్యాచ్ లో ఓటమిపాలైన ఆసీస్ టీమ్ ఈ మ్యాచ్ తో బోణి కొట్టాలని బరిలోకి దిగుతోంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో సౌతాఫ్రికా 4వ స్థానంలో ఉండగా, ఆస్ట్రేలియా ఏడో ప్లేస్ లో ఉంది. కాగా, ఈరోజు మ్యాచ్ కు టీమిండియా మాజీ క్రికెటర్ జవగల్ శ్రీనాథ్ మ్యాచ్ రిఫరీగా వ్యవహరిస్తున్నాడు.
తుది జట్లు
ఆస్ట్రేలియా
పాట్ కమిన్స్(కెప్టెన్), డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, మార్నస్ లాబుషాగ్నే, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్
దక్షిణాఫ్రికా
ఎంబా బావుమా (కెప్టెన్), క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), రాస్సీ వాన్ డెర్ డస్సెన్, ఐడెన్ మర్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహారాజ్, లుంగి ఎన్గిడి, కగిసో రబడ, తబ్రైజ్ షమ్సీ