ODI World Cup 2023 : ల‌క్నో స్టేడియంలో ఆస్ట్రేలియా అభిమాని.. గణపతి బప్పా మోరియా, భారత్ మాతా కీ జై.. వీడియో వైర‌ల్‌

వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో ఆస్ట్రేలియా ఎట్ట‌కేల‌కు గెలుపు రుచి చూసింది. సోమ‌వారం ల‌క్నో వేదిక‌గా జ‌రిగిన మ్యాచ్‌లో శ్రీలంక పై 5 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. అయితే.. మ్యాచ్ జ‌రుగుతున్న స‌మ‌యంలో ఓ ఆస్ట్రేలియా అభిమాని చేసిన ప‌ని ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Australian Fan Chant

ODI World Cup : వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో ఆస్ట్రేలియా ఎట్ట‌కేల‌కు గెలుపు రుచి చూసింది. సోమ‌వారం ల‌క్నో వేదిక‌గా జ‌రిగిన మ్యాచ్‌లో శ్రీలంక పై 5 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. అయితే.. మ్యాచ్ జ‌రుగుతున్న స‌మ‌యంలో ఓ ఆస్ట్రేలియా అభిమాని చేసిన ప‌ని ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. గ‌ణ‌ప‌తి బ‌ప్పా మోరియా అంటూ ఆ అభిమాని స్టాండ్స్‌లో నినాదాలు చేశాడు. ఓ విదేశీయుడు ఇలా గ‌ణ‌ప‌తి నినాదాలు చేయ‌డంతో ఈ వీడియో నెట్టింట హ‌ల్ చ‌ల్ చేస్తోంది.

వీడియోలో ఏం ఉందంటే..?

ఓ ఆస్ట్రేలియా అభిమాని ‘గణపతి బప్పా మోరియా’ అని నినాదాలు చేస్తూ కనిపించాడు. దీంతో అత‌డితో పాటు చుట్టు ప‌క్కల ఉన్నవారు సైతం లేచి అత‌డికి స‌పోర్ట్ చేస్తూ నినాదాలు చేశారు. అంతేనా అత‌డు ‘భారత్ మాతా కీ జై’, ‘వందేమాతరం’ అనే నినాదాలు సైతం చేశాడు. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజ‌యం సాధించ‌డంతో స‌ద‌రు అభిమాని ఆనందానికి అంతు లేకుండా పోయింది. దీనిపై నెటీజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. విఘ్నేశ్వ‌రుడిని ప్రార్థించ‌డంతో ఆస్ట్రేలియా గెలిచిందని ఓ నెటీజ‌న్ కామెంట్ చేశాడు.

Rahul Dravid : ఇదే క‌దా ద్ర‌విడ్ అంటే.. క్రికెట‌ర్ల‌తో పాటు సిబ్బంది అంద‌రూ విశ్రాంతి తీసుకుంటే..

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. మొద‌ట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 43.3 ఓవర్లలో 209 పరుగులకు ఆలౌటైంది. లంక బ్యాట‌ర్ల‌లో ఓపెన‌ర్లు పాతుమ్ నిస్సాంక (61; 67 బంతుల్లో 8 ఫోర్లు), కుశాల్ పెరీరా(78; 82 బంతుల్లో 12 ఫోర్లు) లు అర్థ‌శ‌త‌కాల‌తో రాణించారు. కెప్టెన్ కుశాల్ మెండిస్ (9), స‌దీర స‌మ‌ర‌విక్ర‌మ (8), ధ‌నుంజ‌య డిసిల్వా (7), క‌రుణ‌ర‌త్నే (2) లు విఫ‌లం కావ‌డంతో శ్రీలంక ఓ మోస్త‌రు స్కోరుకే ప‌రిమిత‌మైంది. ఆస్ట్రేలియా బౌలర్లలో ఆడమ్ జంపా 4 వికెట్లతో లంక ప‌త‌నాన్ని శాసించాడు. మిచెల్ స్టార్క్, పాట్ క‌మిన్స్‌ రెండేసి వికెట్లు తీశారు. గ్లెన్ మాక్స్‌వెల్ ఓ వికెట్ ప‌డ‌గొట్టాడు.

అనంత‌రం 210 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఆస్ట్రేలియా 35.2 ఓవ‌ర్ల‌లో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. మిచెల్ మార్ష్ (52; 51 బంతుల్లో 9 ఫోర్లు), జోష్ ఇంగ్లిస్ (58; 59 బంతుల్లో 5 ఫోర్లు, 1సిక్స్‌) లు హాఫ్ సెంచ‌రీలు బాదారు. మార్న‌స్ ల‌బుషేన్ (40), మాక్స్‌వెల్ (31 నాటౌట్‌)లు రాణించారు. శ్రీలంక బౌల‌ర్ల‌లో మధుశంక మూడు వికెట్లు తీశాడు. దునిత్ వెల్లలాగే ఓ వికెట్ ప‌డ‌గొట్టాడు.

ODI World Cup : నీకు ఎలా ఆడాలో మీ నాన్న నేర్పించ‌లేదా..? మార్ష్‌ను ప్రశ్నించిన గవాస్కర్..

ట్రెండింగ్ వార్తలు