World Cup 2023 ENG vs AFG : ఇంగ్లాండ్ పై అఫ్గానిస్థాన్ ఘ‌న విజ‌యం

భార‌త్ వేదిక‌గా జ‌రుగుతున్న వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో సంచ‌ల‌నం న‌మోదైంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్‌కు అఫ్గానిస్థాన్ జ‌ట్టు షాకిచ్చింది.

Pic @ Afghanistan Cricket Board Twitter

అఫ్గానిస్థాన్ ఘ‌న విజ‌యం

ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జ‌రిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ పై అఫ్గానిస్థాన్ జ‌ట్టు 69 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. 285 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఇంగ్లాండ్ 40.3 ఓవ‌ర్ల‌లో 215 ప‌రుగుల‌కు ఆలౌటైంది.

35 ఓవ‌ర్ల‌కు ఇంగ్లాండ్ స్కోరు173/8
ఓట‌మి దిశ‌గా ఇంగ్లాండ్ ప‌య‌నిస్తోంది. 35 ఓవ‌ర్ల‌కు ఇంగ్లాండ్ స్కోరు173/8. మార్క్ వుడ్ (4), ఆదిల్ ర‌షీద్ (7) లు ఆడుతున్నారు.

సామ్ క‌ర‌న్ ఔట్‌..
మ‌హ్మ‌ద్ న‌బీ బౌలింగ్‌లో సామ్‌క‌ర‌న్ (10) రహమత్ షా చేతికి చిక్కాడు. దీంతో ఇంగ్లాండ్ 27.1వ ఓవ‌ర్‌లో 138 ప‌రుగుల వ‌ద్ద ఆరో వికెట్ కోల్పోయింది.

హ్యారీ బ్రూక్ హాఫ్ సెంచ‌రీ
మ‌హ్మ‌ద్ న‌బీ బౌలింగ్‌లో (25.2వ ఓవ‌ర్‌) సింగిల్ తీసి 45 బంతుల్లో హ్యారీ బ్రూక్ హాఫ్ సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు.

లివింగ్ స్టోన్ ఔట్‌..
ర‌షీద్ ఖాన్ బౌలింగ్‌లో లియాన్ లివింగ్ స్టోన్ (10) ఎల్బీడ‌బ్ల్యూగా ఔట్ అయ్యాడు. దీంతో ఇంగ్లాండ్ 20.4వ ఓవ‌ర్‌లో 117 ప‌రుగుల వ‌ద్ద ఐదో వికెట్ కోల్పోయింది. అంత‌క‌ముందు న‌వీన్ ఉల్ హ‌క్ బౌలింగ్‌లో బ‌ట్ల‌ర్ (9) నాలుగో వికెట్‌గా పెవిలియ‌న్ చేరుకున్నాడు.

మ‌ల‌న్ ఔట్‌..
ఇంగ్లాండ్ మ‌రో వికెట్ కోల్పోయింది. మ‌హ్మ‌ద్ న‌బీ బౌలింగ్‌లో డేవిడ్ మ‌ల‌న్ (32; 39 బంతుల్లో 4 ఫోర్లు) ఇబ్రహీం జద్రాన్ క్యాచ్ అందుకోవ‌డంతో ఔట్ అయ్యాడు. దీంతో ఇంగ్లాండ్ 12.4వ ఓవ‌ర్‌లో 68 ప‌రుగుల వ‌ద్ద మూడో వికెట్ కోల్పోయింది.

10 ఓవ‌ర్ల‌కు ఇంగ్లాండ్ స్కోరు 52/2
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌లో మొద‌టి ప‌ది ఓవ‌ర్లు ముగిశాయి. రెండు వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ 52 ప‌రుగులు చేసింది. హ్యారీ బ్రూక్ (9), డేవిడ్ మ‌ల‌న్ (23) లు ఆడుతున్నారు.

జో రూట్ క్లీన్ బౌల్డ్‌
ఇంగ్లాండ్ మ‌రో వికెట్ కోల్పోయింది. ముజీబ్ బౌలింగ్‌లో జో రూట్ (11 17 బంతుల్లో 2 ఫోర్లు) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో ఇంగ్లాండ్ 6.5వ ఓవ‌ర్‌లో 33 ప‌రుగుల వ‌ద్ద రెండో వికెట్ కోల్పోయింది.

5 ఓవ‌ర్ల‌కు ఇంగ్లాండ్ స్కోరు 22/1
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌లో 5 ఓవ‌ర్లు పూర్తి అయ్యాయి. వికెట్ న‌ష్టానికి ఇంగ్లాండ్ 22 ప‌రుగులు చేసింది. జో రూట్ (7), డేవిడ్ మ‌ల‌న్ (13) లు ఆడుతున్నారు.

బెయిర్ స్టో ఔట్‌..
ల‌క్ష్య ఛేద‌న‌కు దిగిన ఇంగ్లాండ్ జ‌ట్టుకు ఆరంభంలోనే షాక్ త‌గిలింది. ఓపెన‌ర్ జానీ బెయిర్ స్టో (2) ఫజల్హా ఫారూఖీ బౌలింగ్‌లో ఎల్బీడ‌బ్ల్యూగా ఔట్ అయ్యాడు. దీంతో ఇంగ్లాండ్ 1.1వ ఓవ‌ర్‌లో 3 ప‌రుగుల వ‌ద్ద మొద‌టి వికెట్ కోల్పోయింది.

ఇంగ్లాండ్ టార్గెట్ 285

టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ నిర్ణీత 49.5 ఓవ‌ర్ల‌లో 284 ప‌రుగుల‌కు ఆలౌటైంది. అఫ్గాన్ బ్యాట‌ర్ల‌లో రహ్మానుల్లా గుర్బాజ్ (80; 57 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స‌ర్లు) దూకుడుగా ఆడాడు. ఇక్రమ్ అలీఖిల్ (58; 66 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) హాఫ్ సెంచ‌రీ చేశాడు. ఇబ్రహీం జద్రాన్ (28), ముజీబ్ ఉర్ రహ్మాన్ (28), ర‌షీద్ ఖాన్ (23) లు రాణించారు. ఇంగ్లాండ్ బౌల‌ర్ల‌లో ఆదిల్ ర‌షీద్ మూడు వికెట్లు తీశాడు. మార్క్ వుడ్‌ రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు. లివింగ్ స్టోన్‌, రూట్‌, టాఫ్లీలు త‌లా ఓ వికెట్ తీశారు.

40 ఓవ‌ర్ల‌కు అఫ్గానిస్థాన్ స్కోరు 216/6
అఫ్గానిస్థాన్ బ్యాట‌ర్లు నిల‌క‌డ‌గా ఆడుతున్నారు. 40 ఓవ‌ర్ల‌కు అఫ్గానిస్థాన్ స్కోరు 216/6. ర‌షీద్ ఖాన్ (17), ఇక్రమ్ అలీఖిల్ (33) లు ఆడుతున్నారు.

హష్మతుల్లా షాహిదీ క్లీన్‌బౌల్డ్‌
అఫ్గానిస్థాన్ జ‌ట్టు క‌ష్టాల్లో ప‌డింది. జో రూట్ బౌలింగ్‌లో అఫ్గాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ (14) క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. దీంతో 32.1వ ఓవ‌ర్లో 174 ప‌రుగుల వ‌ద్ద అఫ్గానిస్థాన్ ఐదో వికెట్ కోల్పోయింది. అంత‌క‌ముందు లివింగ్ స్ట‌న్ బౌలింగ్‌లో(25.6వ ఓవ‌ర్‌) అజ్మతుల్లా (19) నాలుగో వికెట్‌గా పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు.

రహ్మానుల్లా గుర్బాజ్ ర‌నౌట్‌
అఫ్గానిస్థాన్ మ‌రో వికెట్ కోల్పోయింది. దూకుడుగా ఆడుతున్నరహ్మానుల్లా గుర్బాజ్(80; 57 బంతుల్లో 8 ఫోర్లు, 4సిక్స‌ర్లు) ర‌నౌట్ అయ్యాడు. దీంతో అఫ్గానిస్థాన్ 18.5వ ఓవ‌ర్‌లో 122 ప‌రుగుల వ‌ద్ద మూడో వికెట్ కోల్పోయింది.

రహమత్ షా స్టంపౌట్‌
అఫ్గానిస్థాన్ జ‌ట్టు మ‌రో వికెట్ కోల్పోయింది. ఆదిల్ ర‌షీద్ బౌలింగ్‌లో రహమత్ షా (3) స్టంపౌట్ అయ్యాడు. దీంతో అఫ్గాన్ 18.4వ ఓవ‌ర్‌లో 122 ప‌రుగుల వ‌ద్ద రెండో వికెట్ కోల్పోయింది.

ఇబ్రహీం జద్రాన్ ఔట్‌..
ఎట్ట‌కేల‌కు ఇంగ్లాండ్ బౌల‌ర్లు వికెట్ ప‌డ‌గొట్టారు. ఆదిల్ ర‌షీద్ బౌలింగ్‌లో ఇబ్రహీం జద్రాన్ (28; 48 బంతుల్లో 3 ఫోర్లు) జో రూట్ క్యాచ్ అందుకోవ‌డంతో ఔట్ అయ్యాడు. దీంతో అఫ్గాన్ 16.4వ ఓవ‌ర్‌లో 114 ప‌రుగుల వ‌ద్ద మొద‌టి వికెట్ కోల్పోయింది.

15 ఓవ‌ర్ల‌కు అఫ్గానిస్థాన్ స్కోరు 106/0
అఫ్గాన్ ఇన్నింగ్స్‌లో మొదటి 15 ఓవ‌ర్లు పూర్తి అయ్యాయి. వికెట్ న‌ష్ట‌పోకుండా అఫ్గానిస్థాన్ 106 ప‌రుగులు చేసింది. రహ్మానుల్లా గుర్బాజ్(69), ఇబ్రహీం జద్రాన్ (26) లు ఆడుతున్నారు.

రహ్మానుల్లా గుర్బాజ్ హాఫ్ సెంచ‌రీ
ఆదిల్ ర‌షీద్ బౌలింగ్‌లో (10.2వ ఓవ‌ర్‌) ఫోర్ కొట్టిన రహ్మానుల్లా గుర్బాజ్ 33 బంతుల్లో హాఫ్ సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు. 11 ఓవ‌ర్ల‌కు అఫ్గానిస్థాన్ స్కోరు 86/0. రహ్మానుల్లా గుర్బాజ్(52), ఇబ్రహీం జద్రాన్ (23) లు ఆడుతున్నారు.

5 ఓవ‌ర్ల‌కు అఫ్గానిస్థాన్ స్కోరు 35/0
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగింది అఫ్గానిస్థాన్‌. ఓపెన‌ర్ రహ్మానుల్లా గుర్బాజ్ దూకుడుగా ఆడుతున్నాడు. 5 ఓవ‌ర్ల‌కు అఫ్గానిస్థాన్ స్కోరు 35/0. రహ్మానుల్లా గుర్బాజ్(20), ఇబ్రహీం జద్రాన్ (7) లు ఆడుతున్నారు.

అఫ్గానిస్తాన్ తుది జ‌ట్టు : రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీప‌ర్‌), ఇబ్రహీం జద్రాన్, రహమత్ షా, హష్మతుల్లా షాహిదీ(కెప్టెన్‌), మహ్మద్ నబీ, ఇక్రమ్ అలీఖిల్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రహ్మాన్, నవీన్ ఉల్ హక్, ఫజల్హా

ఇంగ్లాండ్ తుది జ‌ట్టు : జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలన్, జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్(కెప్టెన్‌), లియామ్ లివింగ్‌స్టోన్, సామ్ క‌ర‌న్‌, క్రిస్ వోక్స్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్, రీస్ టాప్లీ

World Cup 2023 ENG vs AFG : వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఇంగ్లాండ్‌, అఫ్గానిస్థాన్ జ‌ట్లు త‌ల‌ప‌డుతున్నాయి. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో అఫ్గాన్ మొద‌ట బ్యాటింగ్ చేయ‌నుంది.