Glenn Maxwell Wife Vini Raman: తనపై వస్తున్న ట్రోల్స్‌కు సమాధానం ఇచ్చిన గ్లెన్ మాక్స్‌వెల్ భార్య.. క్లారిటీగా చెప్పేసింది

ఆస్ట్రేలియా ప్లేయర్ మాక్స్‌వెల్ భార్య విని రామన్ తనపై వస్తున్న ట్రోల్స్‌కు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా సమాధానం ఇచ్చారు.

Glenn Maxwell Wife

World Cup 2023 Final : భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్ లో భారత్ పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా ఆరోసారి విశ్వవిజేతగా నిలిచింది. ఆ జట్టు ప్లేయర్ మాక్స్‌వెల్ ప్రపంచ కప్ చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీ, డబుల్ సెంచరీ చేశాడు. దీంతో ఈ మెగా టోర్నీలో మాక్స్‌వెల్ 400 పరుగులకుతోడు ఆరు వికెట్లు తీసుకున్నాడు. అయితే, మాక్స్‌వెల్ భార్య విని రామన్ ట్రోల్స్ గురయ్యారు. భారతీయ మూలాలున్న మీరు ఆస్ట్రేలియాకు మద్దతునివ్వటం ఏమిటంటూ కొందరు ట్రోల్స్ చేశారు.

Also Read : World Cup 2023 : వరల్డ్ కప్ ఓడిపోవడంతో.. టాలీవుడ్ సెలబ్రిటీస్ ఎమోషనల్ ట్వీట్స్..

వరల్డ్ కప్ 2023లో ఆస్ట్రేలియా విజయం తరువాత తనపై వస్తున్న ట్రోల్స్‌కు విని రామన్ కౌంటర్ ఇచ్చారు. ఇన్ స్టాగ్రామ్‌లో మాక్స్‌వెల్‌తో ఉన్న ఆరు ఫొటోలను పోస్టు చేశారు. దానికి క్యాప్షన్‌గా మెల్బోర్ – సింగపూర్ – ఢిల్లీ – ధర్మశాల – అహ్మదాబాద్ – ముంబై – పూణె – కోల్ కతా – అహ్మదాబాద్ – సింగపూర్ – మెల్బోర్న్ .. ఇలా మా ప్రయాణం సాగుతుంది. జీవితంలో మరపురాని పర్యటన ఇది. ఇందులో అన్ని ఫొటోలను చూడండి అని పేర్కొంది. చివరిలో ఆమెపై వస్తున్న ట్రోల్స్‌కు సమాధానం ఇచ్చింది.

 

నేను భారతీయ మూలాలు కలిగిన వ్యక్తిని అయ్యి ఉండోచ్చు. కానీ, నేను పుట్టింది, పెరిగిన దేశం ఆస్ట్రేలియా. ముఖ్యంగా నా భర్త, నా బిడ్డకు తండ్రి ఆడుతున్న జట్టు ఆస్ట్రేలియా. ఆ జట్టుకు మద్దతునివ్వడంలో ఎలాంటి ఆలోచన చేయాల్సిన పనిలేదని విని రామన్ పేర్కొంది. దేశాల మధ్య బేధాలను మామీద రుద్దకండి అంటూ విని రామన్ ఆమెపై ట్రోల్స్ చేస్తున్న వారికి కౌంటర్ ఇచ్చారు.

 

 

 

ట్రెండింగ్ వార్తలు