World Cup 2023 IND vs BAN: 7 వికెట్ల తేడాతో ఇండియా విజ‌యం

పూణె వేదిక‌గా బంగ్లాదేశ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో టీమ్ఇండియా 7 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది.

IND vs BAN (pic @bcci twitter)

ఇండియా గెలుపు
257 ప‌రుగుల ల‌క్ష్యాన్ని భార‌త్ 41.3 ఓవ‌ర్ల‌లో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. విరాట్ కోహ్లీ (103 నాటౌట్‌; 97 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సులు) శ‌త‌క్కొట్టాడు. శుభ్‌మ‌న్ గిల్ (53; 55 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్ సెంచ‌రీతో రాణించాడు.

శ్రేయ‌స్ అయ్య‌ర్ ఔట్‌
భార‌త్ మ‌రో వికెట్ కోల్పోయింది. మెహిదీ హసన్ మిరాజ్ బౌలింగ్‌లో మహ్మదుల్లా చేతికి చిక్క‌డంతో శ్రేయ‌స్ అయ్య‌ర్ (19; 25 బంతుల్లో 2ఫోర్లు) పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు. దీంతో 29.1వ ఓవ‌ర్‌లో 178 ప‌రుగుల వ‌ద్ద భార‌త్ మూడో వికెట్ కోల్పోయింది.

విరాట్ కోహ్లీ హాఫ్ సెంచ‌రీ
హసన్ మహమూద్ బౌలింగ్‌లో(26.6వ ఓవ‌ర్‌) సింగిల్ తీసి 48 బంతుల్లో కోహ్లీ అర్థ‌శ‌త‌కాన్ని పూర్తి చేసుకున్నాడు.

శుభ్‌మ‌న్ గిల్ ఔట్‌
మెహిదీ హసన్ మిరాజ్ బౌలింగ్‌లో మహ్మదుల్లా క్యాచ్ అందుకోవ‌డంతో శుభ్‌మ‌న్ గిల్ (53; 55 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఔట్ అయ్యాడు. దీంతో భార‌త్ 19.2వ ఓవ‌ర్‌లో 132 ప‌రుగుల వ‌ద్ద రెండో వికెట్ కోల్పోయింది. 20 ఓవ‌ర్ల‌కు భార‌త స్కోరు 142/2. విరాట్ కోహ్లీ (34), శ్రేయ‌స్ అయ్య‌ర్ (5)లు ఆడుతున్నారు.

శుభ్‌మ‌న్ గిల్ అర్థ‌శ‌త‌కం..
షారిఫుల్ ఇస్లాం బౌలింగ్‌లో(18.1వ ఓవ‌ర్‌) సింగిల్ తీసి శుభ్‌మ‌న్ గిల్ 52 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌ల‌తో హాఫ్ సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు.

రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ మిస్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 2 పరుగుల తేడాతో హాఫ్ సెంచరీ మిస్ అయ్యాడు. 12.4 ఓవర్ లో 88 పరుగుల వద్ద తొలి వికెట్ గా అవుటయ్యాడు. 40 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 48 పరుగులు చేశాడు. 15 ఓవర్లలో 111/1 స్కోరుతో భారత్ ఆట కొనసాగిస్తోంది.

10 ఓవర్లలో ఇండియా స్కోరు 63/0
టీమిండియా తొలి 10 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 63 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 37, శుభ్‌మన్ గిల్ 26 పరుగులతో ఆడుతున్నారు.

5 ఓవర్లలో ఇండియా స్కోరు 33/0
257 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన టీమిండియా తొలి 5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 33 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 27, శుభ్‌మన్ గిల్ 6 పరుగులతో ఆడుతున్నారు.

టీమిండియా టార్గెట్ 257
టీమిండియాకు బంగ్లాదేశ్ 257 పరుగుల టార్గెట్ పెట్టింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 256 పరుగులు చేసింది. లిట్టన్ దాస్ (66), తాంజిద్ హసన్(51) హాఫ్ సెంచరీలతో రాణించారు. మహ్మదుల్లా 46, ముష్ఫికర్ రహీమ్ 38 పరుగులు చేశారు. భారత బౌలర్లలో బుమ్రా, సిరాజ్, జడేజా రెండేసి వికెట్లు పడగొట్టారు. శార్దూల్ థాకూర్, కుల్దీప్ యాదవ్ చెరో వికెట్ దక్కించుకున్నారు.

 

నుసుమ్ అవుట్.. ఏడో వికెట్ డౌన్
46.5 ఓవర్ లో 233 పరుగుల వద్ద బంగ్లాదేశ్ ఏడో వికెట్ నష్టపోయింది. నుసుమ్ అహ్మద్ 14 పరుగులు చేసి సిరాజ్ బౌలింగ్ లో అవుటయ్యాడు. 48 ఓవర్లలో 238/7 స్కోరుతో బంగ్లాదేశ్ ఆట కొనసాగిస్తోంది.

200 దాటిన బంగ్లాదేశ్ స్కోరు
46 ఓవర్లలో 225/6 స్కోరుతో బంగ్లాదేశ్ ఆట కొనసాగిస్తోంది. ముష్ఫికర్ రహీమ్ 38 పరుగులు చేసి ఆరో వికెట్ గా అవుటయ్యాడు.

ఐదో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్
37.2 ఓవర్ లో 179 పరుగుల వద్ద బంగ్లాదేశ్ ఐదో వికెట్ నష్టపోయింది. తౌహిద్ హృదయ్ 16 పరుగులు చేసి శార్దూల్ థాకూర్ బౌలింగ్ లో అవుటయ్యాడు. 39 ఓవర్లలో 186/5 స్కోరుతో బంగ్లాదేశ్ ఆట కొనసాగిస్తోంది.

లిట్టన్ దాస్ అవుట్.. ఫోర్త్ వికెట్ డౌన్
హాఫ్ సెంచరీతో రాణించిన ఓపెనర్ లిట్టన్ దాస్ నాలుగో వికెట్ గా అవుటయ్యాడు. 82 బంతుల్లో 7 ఫోర్లతో 66 పరుగులు చేశాడు. 28 ఓవర్లలో 138/4 స్కోరుతో బంగ్లాదేశ్ ఆట కొనసాగిస్తోంది.

మూడో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్
24.1 ఓవర్ లో 129 పరుగుల వద్ద బంగ్లాదేశ్ మూడో వికెట్ నష్టపోయింది. మెహిదీ హసన్ మిరాజ్ 3 పరుగులు చేసి సిరాజ్ బౌలింగ్ లో అవుటయ్యాడు. 26 ఓవర్లలో 133/3 స్కోరుతో బంగ్లాదేశ్ ఆట కొనసాగిస్తోంది.

నజ్ముల్ అవుట్.. రెండో వికెట్ డౌన్
20 ఓవర్ లో 110 పరుగుల వద్ద బంగ్లాదేశ్ రెండో వికెట్ కోల్పోయింది. నజ్ముల్ హుస్సేన్ శాంటో 8 పరుగులు చేసి అవుటయ్యాడు. మరోవైపు లిట్టన్ దాస్ 65 బంతుల్లో 5 ఫోర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 23 ఓవర్లలో 118/2 స్కోరుతో బంగ్లాదేశ్ ఆట కొనసాగిస్తోంది.

హసన్ అవుట్.. ఫస్ట్ వికెట్ డౌన్
93 పరుగుల వద్ద బంగ్లాదేశ్ తొలి వికెట్ కోల్పోయింది. తాంజిద్ హసన్(51)ను కుల్దీప్ యాదవ్ అవుట్ చేశాడు. 16 ఓవర్లలో 96/1 స్కోరుతో బంగ్లాదేశ్ ఆట కొనసాగిస్తోంది.

తాంజిద్ హసన్ హాఫ్ సెంచరీ
బంగ్లాదేశ్ ఓపెనర్ తాంజిద్ హసన్ హాఫ్ సెంచరీ చేశాడు. 41 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో అర్ధశతకం పూర్తిచేశాడు. 14 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 90 పరుగులు చేసింది. లిట్టన్ దాస్ 37 పరుగులతో ఆడుతున్నాడు.

హార్దిక్ పాండ్యాకు గాయం.. కోహ్లి బౌలింగ్
8వ ఓవర్ లో మూడు బంతులు వేసిన తర్వాత హార్దిక్ పాండ్యా గాయంతో మైదానం వీడాడు. దీంతో మిగతా బంతులను విరాట్ కోహ్లి వేశాడు. మూడు బంతుల్లో కోహ్లి 2 పరుగులు ఇచ్చాడు. బంగ్లాదేశ్ 10 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 63 పరుగులు చేసింది. మొదటి 5 ఓవర్లలో 10 పరుగులు మాత్రమే చేసిన బంగ్లా ఓపెనర్లు తర్వాత గేర్ మార్చారు. దీంతో స్కోరు పరిగెత్తింది.

 

కట్టుదిట్టంగా బౌలింగ్
భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో బంగ్లాదేశ్ తొలి 5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 10 పరుగులు మాత్రమే చేసింది. లిట్టన్ దాస్ 13 బంతుల తర్వాత పరుగుల ఖాతా తెరిచాడు. 14 బంతులు ఆడి ఒక పరుగు సాధించాడు. తాంజిద్ హసన్ 9 పరుగులు చేశాడు. సిరాజ్ 2 ఓవర్లలో 5, బుమ్రా 3 ఓవర్లలో 5 పరుగులు ఇచ్చారు.

బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లాదేశ్
టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ఫస్ట్ బ్యాటింగ్ కు దిగింది. లిట్టన్ దాస్, తాంజిద్ హసన్ ఓపెనర్లుగా వచ్చారు. తొలి ఓవర్ జస్‌ప్రీత్ బుమ్రా, రెండో మహ్మద్ సిరాజ్ వేశారు.

టాస్ గెలిచిన బంగ్లాదేశ్
బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఎంచుకోవడంతో టీమిండియా ముందుగా బౌలింగ్ చేయనుంది. కాగా, టాస్ గెలిస్తే తాను ఫీల్డింగ్ తీసుకునేవాడినని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు. తమ జట్టులో ఎలాంటి మార్పులేదని తెలిపాడు. గాయం కారణంగా బంగ్లాదేశ్ కెప్టెన్ షకీల్ ఈ మ్యాచ్ కు దూరమయ్యాడు. అతడి స్థానంలో నసుమ్ అహ్మద్ జట్టులోకి వచ్చాడు. నజ్ముల్ హుస్సేన్ శాంటో కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు.

 

తుది జట్లు
భారత్ :
రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్

బంగ్లాదేశ్: లిట్టన్ దాస్, తాంజిద్ హసన్, నజ్ముల్ హుస్సేన్ శాంటో(సి), మెహిదీ హసన్ మిరాజ్, తౌహిద్ హృదయ్, ముష్ఫికర్ రహీమ్(వికెట్ కీపర్), మహ్మదుల్లా, నసుమ్ అహ్మద్, హసన్ మహమూద్, ముస్తాఫిజుర్ రహ్మాన్, షోరీఫుల్ ఇస్లాం

IND vs BAN: వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో భాగంగా నేడు జరగనున్న 17వ మ్యాచ్ లో భారత్, బంగ్లాదేశ్ జట్లు తలపడనున్నాయి. పుణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇప్పటివరకు మూడు మ్యాచ్ లు ఆడిన రోహిత్ సేన మూడింటిలోనూ గెలిచి జోరు మీద ఉంది. బంగ్లాదేశ్ మూడు మ్యాచ్ లు ఆడి ఒక మ్యాచ్ లో మాత్రమే గెలిచింది. టీమిండియా జోరు కొనసాగించాలని భావిస్తుండగా.. భారత్ కు షాక్ ఇవ్వాలని బంగ్లాదేశ్ పట్టుదలగా ఉంది. గత 12 నెలల కాలంలో ఈ రెండు జట్ల మధ్య 4 వన్డే మ్యాచ్ లు జరగ్గా.. మూడింటిలో ఇండియా గెలిచింది. ఒక మ్యాచ్ లో బంగ్లాదేశ్ విజయం సాధించింది.

 

జోష్ లో రోహిత్ శర్మ
అఫ్గానిస్థాన్ పై సెంచరీ(131)తో పాటు పాకిస్థాన్ తో జరిగి మ్యాచ్ లో హాఫ్ సెంచరీ (86)తో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ జోష్ లో ఉన్నాడు. ఈ మ్యాచ్ లోనూ హిట్ మాన్ జోరు కొనసాగించాలని టీమిండియా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. గత మ్యాచ్ లో విఫలమైన యువ క్రికెటర్ శుభ్‌మ‌న్ గిల్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఎలా ఆడతారో చూడాలని క్రికెట్ లవర్స్ వెయిట్ చేస్తున్నారు. టీమిండియాకు ఫస్ట్ బ్యాటింగ్ వస్తే భారీ స్కోరు చేయాలని కోరుకుంటున్నారు.