KL Rahul : కేఎల్ రాహుల్ కామెంట్స్‌.. అస్స‌లు ఊహించ‌లేదు.. అయ్య‌ర్ క‌నీసం రెండు ఓవ‌ర్లు అన్నా..

మ్యాచ్ అనంత‌రం విరాట్ కోహ్లీతో జ‌రిగిన సంభాష‌ణ‌లో టీమ్ఇండియా ఇంత త్వ‌ర‌గా మూడు వికెట్లు కోల్పోతుంద‌ని తాను అస్స‌లు ఊహించ‌లేద‌ని కేఎల్ రాహుల్ తెలిపాడు.

pic @Bcci twitter

KL Rahul-Virat Kohli : వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2023 మొద‌టి మ్యాచ్‌లో భార‌త్ విజ‌యంతో బోణీ కొట్టింది. చెన్నై వేదిక‌గా ఆస్ట్రేలియాతో జ‌రిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. 200 ప‌రుగుల ల‌క్ష్య ఛేద‌న‌లో ఓపెన‌ర్లు రోహిత్ శ‌ర్మ‌, ఇషాన్ కిష‌న్ ల‌తో పాటు శ్రేయాస్ అయ్య‌ర్‌లు డ‌కౌట్ లు అయ్యారు. అయితే.. కేఎల్ రాహుల్ (97 నాటౌట్‌), విరాట్ కోహ్లీ (85) లు కీల‌క భాగ‌స్వామ్యంతో ఆసీస్ ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లారు. మ్యాచ్ అనంత‌రం విరాట్ కోహ్లీతో జ‌రిగిన సంభాష‌ణ‌లో టీమ్ఇండియా ఇంత త్వ‌ర‌గా మూడు వికెట్లు కోల్పోతుంద‌ని తాను అస్స‌లు ఊహించ‌లేద‌ని కేఎల్ రాహుల్ తెలిపాడు.

ఈ మ్యాచ్ త‌రువాత తాను చాలా అల‌సిపోయాన‌ని రాహుల్ చెప్పాడు. అవును అల‌సిపోయాను. ‘నేను అబ‌ద్దం చెప్ప‌ను. భాగ‌స్వామ్యం 50-70 ప‌రుగుల త‌రువాత మ‌నం మాట్లాడుకున్నాం. శ‌క్తిని కాపాడుకోవాల‌ని, రెండు ప‌రుగులు తీయ‌కూడ‌ద‌ని అనుకున్నాం. బంతిని గ్యాప్‌లో కొట్టిన త‌రువాత ప్ర‌త్య‌ర్థి ఆట‌గాళ్లు బంతిని అందుకునే స‌మ‌యంలో ప‌రుగును తీశాము. ప్ర‌పంచ‌క‌ప్ ను విజ‌యంతో ఆరంభించ‌డం ఎంతో న‌చ్చింది.’ అని రాహుల్ అన్నాడు.

అయ్య‌ర్ రెండు ఓవ‌ర్లు అయినా..

రెండు ఓవ‌ర్లు పూర్తి కాకుండానే మూడు వికెట్లు కోల్పోతామ‌ని తాను అస్స‌లు ఊహించ‌లేద‌ని రాహుల్ చెప్పాడు. శ్రేయ‌స్ అయ్య‌ర్ క్రీజులో వెళ్లిన త‌రువాత క‌నీసం రెండు మూడు ఓవ‌ర్లు అన్నా ఆడ‌తాడు అని భావించ‌న‌ట్లు తెలిపాడు. ఇలా జ‌రుగుతుంద‌ని నేను ఎప్పుడు ఊహించ‌లేదు. బంతి ఏదో మాయ చేస్తున్న‌ప్పుడు రెండు వికెట్లు త్వ‌ర‌గా కోల్పోవ‌చ్చు. ఇందుకు నాలుగు లేదా ఐదు ఓవ‌ర్లు ప‌డుతుంది. అయితే.. 1.5 లేదా రెండు ఓవ‌ర్లు కూడా పూర్తి కాలేదు. అప్పుడే నేను ష‌వ‌ర్ చేసి బ‌య‌ట‌కు వచ్చాను. ఇషాన్ ఔట్ అయ్యాడు. వెంట‌నే నేను టేప్ వేసుకోవ‌డానికి, ప్యాడ్‌లు ధ‌రించ‌డానికి ప‌రిగెత్తాను. ఆ ప‌ని చేస్తుండ‌గానే రోహిత్ తో పాటుశ్రేయాస్ కూడా ఔట్ అయ్యారు. వాస్త‌వానికి శ్రేయ‌స్ అయ్య‌ర్ రెండు లేదా మూడు ఓవ‌ర్లు అయినా ఆడ‌తాడు అని అనుకున్నా. అయితే.. అయ్య‌ర్ మొద‌టి లేదా రెండ‌వ బంతికే ఔట్ అయ్యాడు అని రాహుల్ చెప్పాడు.

ODI World Cup 2023: ఒక్క బాల్‌కు 13 పరుగులు సాధ్యమా? కివీస్ బ్యాటర్ ఎలా కొట్టాడో ఈ వీడియో చూడండి ..

మా భాగ‌స్వామ్యంలో ముఖ్యమైన అంశం ఏంటంటే.. మేము బంతిని మైదానం న‌లుపువైలా కొట్టాము. ప‌రుగులు తీశాము. అయితే.. ఇంకా ఎన్ని ప‌రుగులు కొట్టాలి, ఎన్ని బంతులు ఉన్నాయి అన్న విష‌యాల‌ను ప‌ట్టించుకోలేదు. శారీర‌క స‌వాళ్ల‌తో పోరాడుతూ ప‌రుగులు సాధించాము. పెద్ద భాగ‌స్వామ్యం నిర్మించ‌డంలో స్ట్రైక్ రొటేట్ చేయ‌డం స‌హాయ‌ప‌డింద‌ని భావిస్తున్న‌ట్లు తెలిపాడు.

మొదటి పది ఓవర్లను టెస్ట్ క్రికెట్ లాగా..

క్రీజులోకి అడుగుపెట్ట‌గానే మొదటి పది ఓవర్లను టెస్టు క్రికెట్ లాగా ఆడాల‌ని ప్లాన్ చేసుకున్నా. బంతి స్వింగ్ అవుతుండ‌డంతో నాకు టెస్టుల్లో ఓపెనింగ్ చేసిన అనుభ‌వం ఉండ‌డం, అలాంటి ప‌రిస్థితుల్లో ఆడిన అనుభ‌వం ఉండ‌డంతో ఆస్ట్రేలియా జోరును అడ్డుకోవాల‌ని త‌న‌కు తాను అనుకున్న‌ట్లు కేఎల్ రాహుల్ చెప్పాడు.

ట్రెండింగ్ వార్తలు