Mohammed Shami
Mohammed Shami- Anil Kumble : వన్డే ప్రపంచకప్‌లో భారత సీనియర్ పేసర్ మహ్మద్ షమీ అరుదైన ఘనత సాధించాడు. ధర్మశాల వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అనిల్ కుంబ్లే రికార్డును మహ్మద్ షమీ బ్రేక్ చేశాడు. టీమ్ఇండియా తరుపున ప్రపంచకప్‌లలో అనిల్ కుంబ్లే 31 వికెట్లు తీశాడు. కాగా.. ఈ మ్యాచ్‌లో విల్ యంగ్ వికెట్ తీసిన షమీ 32 వికెట్లతో కుంబ్లే రికార్డును బద్దలు కొట్టాడు. ఈ జాబితాలో జహీర్ ఖాన్, జవగల్ శ్రీనాథ్ మొదటి స్థానంలో ఉన్నారు. జహీర్, శ్రీనాథ్‌లు వన్డే ప్రపంచకప్‌లలో భారత్ తరుపున 44 వికెట్లు పడగొట్టారు.
ప్రపంచకప్‌లలో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు జాబితా..
జహీర్ ఖాన్ – 44
జవగల్ శ్రీనాథ్ – 44
మహ్మద్ షమీ – 32*
అనిల్ కుంబ్లే – 31
జస్‌ప్రీత్ బుమ్రా – 28*
Cricketers Favourite Food : ఈ క్రికెటర్లకు ఇష్టమైన ఫుడ్ ఏంటో తెలుసా? విరాట్ కోహ్లీ.. రోహిత్ శర్మ..
మ్యాచ్ విషయానికి వస్తే.. టీమ్ఇండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. కివీస్ మొదట బ్యాటింగ్ చేస్తోంది. 15 ఓవర్లకు ముగిసే సరికి రెండు వికెట్లు కోల్పోయి 61 పరుగులు చేసింది. డారిల్ మిచెల్ (14), రచిన్ రవీంద్ర (26) లు క్రీజులో ఉన్నారు.
Mohammed Shami – an underrated player for India in the ICC events. pic.twitter.com/QNbqK6RX5U
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 22, 2023