NZ : వ‌రుణుడి చేతుల్లో న్యూజిలాండ్ సెమీస్ అవకాశాలు..! కేన్ మామ టీమ్‌కు ఎన్ని క‌ష్టాల్లో..! ఆనందంలో పాకిస్థాన్..!

NZ vs SL : గ‌త‌సారి ఫైన‌ల్‌కు చేరి తృటిలో క‌ప్‌ను కోల్పోయిన న్యూజిలాండ్ ఈ సారి టైటిలే ల‌క్ష్యంగా వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో బ‌రిలోకి దిగింది.

New Zealand

గ‌త‌సారి ఫైన‌ల్‌కు చేరి తృటిలో క‌ప్‌ను కోల్పోయిన న్యూజిలాండ్ ఈ సారి టైటిలే ల‌క్ష్యంగా వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో బ‌రిలోకి దిగింది. అందుకు త‌గ్గ‌ట్లుగానే వ‌రుస‌గా నాలుగు మ్యాచుల్లో విజ‌యాలు సాధించింది. దీంతో అంద‌రి కంటే ముందుగానే కివీస్ సెమీస్ బెర్తును ఖాయం చేసుకుంటుంద‌ని భావించారు. అయితే.. ఆ త‌రువాతే క‌థ మారింది. వ‌రుస‌గా నాలుగు మ్యాచుల్లో ఓడి సెమీస్ రేసులో వెన‌క‌బ‌డి పోయింది. అవ‌కాశాల‌ను సంక్లిష్టం చేసుకుంది.

ఇప్ప‌టికే టీమ్ఇండియా, ద‌క్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జ‌ట్లు సెమీస్ బెర్తుల‌ను ఖాయం చేసుకున్నాయి. మిగిలిన ఉన్న ఒక్క స్థానం కోసం పాకిస్థాన్‌, అఫ్గానిస్థాన్‌ల‌తో పాటు న్యూజిలాండ్ పోటీ ప‌డుతున్నాయి. ఈ మూడు జ‌ట్లు కూడా పాయింట్ల ప‌ట్టిక‌లో స‌మాన పాయింట్ల‌ను క‌లిగి ఉన్నాయి. అయితే.. పాకిస్థాన్‌, అఫ్గానిస్థాన్‌ల‌తో పోల్చితే కివీస్ ర‌న్‌రేట్ కాస్త మెరుగ్గా ఉంది. ఈ మూడు జ‌ట్లు లీగ్ ద‌శ‌లో మ‌రో మ్యాచ్ ఆడాల్సి ఉంది.

కివీస్ ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లిన వ‌రుణుడు.. మ‌రోసారి..!

న్యూజిలాండ్ గ‌త మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో త‌ల‌ప‌డింది. నాలుగు వంద‌ల‌కు పైగా ప‌రుగులు సాధించింది. అయితే.. వ‌ర్షం కార‌ణంగా డ‌క్‌వ‌ర్త్ లూయిస్ ప‌ద్ద‌తిలో పాకిస్థాన్ విజ‌యం సాధించ‌డంతో కివీస్‌కు ఓట‌మి త‌ప్ప‌లేదు. ప్ర‌స్తుతం మ‌రోసారి వ‌రుణుడు న్యూజిలాండ్ పాలిట విల‌న్‌గా మారే అవ‌కాశాలు ఉన్నాయి. సెమీస్ రేసులో నిల‌వాలంటే గురువారం శ్రీలంక‌తో జ‌రిగే మ్యాచ్‌లో న్యూజిలాండ్ త‌ప్ప‌క గెల‌వాల్సి ఉంది.

Deepfake : మీ దుంప‌లు తెగ‌.. త‌మ్ముడితో ఫోటో దిగితే.. ఇలా చేస్తారా..?

అయితే.. ఈ మ్యాచ్‌కు వ‌ర్షం ముప్పు పొంచి ఉంది. ఆక్యూ వెద‌ర్ రిపోర్ట్ ప్ర‌కారం.. మ్యాచ్ ఆరంభం అయ్యే స‌మ‌యంలో ఆకాశం మేఘావృత‌మై ఉంటుంది. మ్యాచ్‌కు ప‌లుమార్లు వరుణుడు అంత‌రాయం క‌లిగించే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్న‌ట్లు స‌మాచారం. ఈ విష‌యం తెలిసిన న్యూజిలాండ్ ఆట‌గాళ్లు ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. వ‌రుణుడు క‌రుణించాలంటూ అభిమానులు ప్రార్థ‌న‌లు చేస్తున్నారు.

మ్యాచ్ ర‌ద్దు అయితే..

శ్రీలంక మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఘ‌న విజ‌యం సాధిస్తే సెమీస్ అవ‌కాశాలు మ‌రింత మెరుగు అవుతాయి. పాకిస్థాన్‌, అఫ్గాన్‌లు త‌మ చివ‌రి మ్యాచుల్లో గెలిస్తే అప్పుడు నెట్ ర‌న్‌రేట్ కీల‌కం కానుంది. ఒకవేళ ఆ రెండు జ‌ట్లు త‌మ చివ‌రి మ్యాచుల్లో ఓడితే కివీస్ ఎలాంటి స‌మీక‌ర‌ణాలు లేకుండా సెమీస్‌కు చేరుకుంటుంది. ఒక వేళ కివీస్ మ్యాచ్ ఓడిపోతే ఇంటి ముఖం ప‌ట్టాల్సిందే. అలా కాకుండా ర‌ద్దు అయితే అప్పుడు కివీస్ ఖాతాలో 9 పాయింట్లు ఉంటాయి. అఫ్గాన్‌, పాక్‌లు త‌మ చివ‌రి మ్యాచుల్లో ఓడిపోతేనే కివీస్ ముందుకు వెలుతుంది.

Glenn Maxwell : మాక్స్‌వెల్ కు బై-ర‌న్న‌ర్‌ను ఎందుకు అనుమతించ‌లేదు..? అలాగే ఎందుకు బ్యాటింగ్ చేయాల్సి వ‌చ్చింది..?

ట్రెండింగ్ వార్తలు