SA vs AFG : ద‌క్షిణాఫ్రికా ఘ‌న విజ‌యం.. ఇంటి బాట ప‌ట్టిన అఫ్గానిస్థాన్‌

South Africa vs Afghanistan : వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో ద‌క్షిణాఫ్రికా మ‌రో విజ‌యాన్ని సాధించింది. గ‌త మ్యాచ్‌లో భార‌త్ చేతిలో 243 ప‌రుగుల తేడాతో ఘోర ఓట‌మిని చ‌వి చూసినా వెంట‌నే పుంజుకుంది.

South Africa

వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో ద‌క్షిణాఫ్రికా మ‌రో విజ‌యాన్ని సాధించింది. గ‌త మ్యాచ్‌లో భార‌త్ చేతిలో 243 ప‌రుగుల తేడాతో ఘోర ఓట‌మిని చ‌వి చూసినా వెంట‌నే పుంజుకుంది. అహ్మ‌దాబాద్ వేదిక‌గా అఫ్గానిస్థాన్ తో జ‌రిగిన మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యాన్ని సాధించింది. ఈ ప్ర‌పంచ‌క‌ప్‌లో సౌతాఫ్రికాకు ఇది ఏడో విజ‌యం కావ‌డం విశేషం. 245 ప‌రుగుల ల‌క్ష్యాన్ని 47.3 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ద‌క్షిణాఫ్రికా బ్యాట‌ర్ల‌లో వాన్ డెర్ డస్సెన్ (76 నాటౌట్‌;  95 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌) హాఫ్ సెంచ‌రీ చేశాడు. క్వింట‌న్ డికాక్ (41; 47 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) రాణించాడు. అఫ్గానిస్థాన్ బౌల‌ర్ల‌ల‌లో మ‌హ్మ‌ద్ న‌బీ, ర‌షీద్ ఖాన్‌లు చెరో రెండు వికెట్లు తీశారు. ముజీబ్ ఉర్ రెహమాన్ ఓ వికెట్ సాధించాడు.

FACT CHECK : స‌చిన్ టెండూల్క‌ర్ కాళ్లు మొక్కిన మాక్స్‌వెల్‌..? ఆ విధ్వంస‌క‌ర డబుల్ సెంచ‌రీ త‌రువాత‌..

అంత‌క ముందు మొద‌ట బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 244 ప‌రుగుల‌కు ఆలౌటైంది. అఫ్గాన్ బ్యాట‌ర్ల‌లో అజ్మతుల్లా ఒమర్జాయ్ (97 నాటౌట్; 107 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) ఒంటి పోరాటం చేశాడు. తృటిలో శ‌త‌కాన్ని చేజార్చుకున్నాడు. మిగిలిన వారిలో ర‌హ్మాత్ షా 26, ర‌హ్మానుల్లా గుర్భాజ్ 25 పరుగులు చేశారు. మిగిలిన వారు విఫ‌లం అయ్యారు. ద‌క్షిణాఫ్రికా బౌల‌ర్ల‌లో గెరాల్డ్‌ కోయిట్జీ నాలుగు వికెట్లు ప‌డ‌గొట్టాడు. లుంగి ఎంగిడి, కేశవ్ మహరాజ్ లు చెరో రెండు వికెట్లు తీయ‌గా ఫెహ్లూక్వాయో ఓ వికెట్ సాధించాడు.

ఇంటిబాట ప‌ట్టిన అఫ్గానిస్థాన్‌..

Afghanistan

Kane Williamson : అంత గుడ్డి న‌మ్మ‌కం ప‌నికి రాదు మామ‌.. ఇప్పుడు చూడు ఏమైందో..? సిగ్గుతో త‌ల‌దించుకుంటివి..!

ఈ ప్ర‌పంచ‌క‌ప్‌లో అఫ్గానిస్థాన్ అంచ‌నాల‌ను మించి రాణించింది. మొత్తం 9 మ్యాచులు ఆడి నాలుగు మ్యాచుల్లో గెలుపొందింది. ఇంగ్లాండ్‌, పాకిస్థాన్‌, శ్రీలంక‌, నెద‌ర్లాండ్స్ జ‌ట్ల‌ను ఓడించి సెమీస్ రేసులోకి వ‌చ్చింది. అయితే ఆఖ‌రి రెండు మ్యాచులు ఆస్ట్రేలియా, ద‌క్షిణాఫ్రికా చేతుల్లో ఓడిపోవ‌డంతో అఫ్గాన్ సెమీస్ దారులు మూసుకుపోయాయి. ఆస్ట్రేలియాతో మ్యాచులో ఓ ద‌శ‌లో 91 ప‌రుగుల‌కే 7 వికెట్లు ప‌డ‌గొట్టి ఆశ‌లు రేపినా ఆ త‌రువాత ప‌ట్టు సడ‌లించి మ్యాచ్‌ను చేజార్చుకుంది. మొత్తంగా అఫ్గాన్ ఈ మెగాటోర్నీలో అద్భుత ప్ర‌ద‌ర్శ‌న చేసింద‌నే చెప్పాలి. ఈ ప్ర‌పంచ‌క‌ప్‌కు ముందు వ‌ర‌కు అఫ్గాన్ రెండు సార్లు మెగా టోర్నీలు ఆడ‌గా కేవ‌లం ఒకే ఒక్క విజ‌యాన్ని మాత్ర‌మే న‌మోదు చేసింది.

ట్రెండింగ్ వార్తలు