Virat Kohli corrects presenter mistake
Virat Kohli-Ashwin : పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ శతకంతో చెలరేగడంతో గురువారం పూణే వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఏడు వికెట్లు తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ 97 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సులతో 103 పరుగుల అజేయ ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించాడు. వన్డేల్లో కోహ్లీకి ఇది 48వ శతకం. అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
ఈ అవార్డు ప్రెజెంటేషన్ వేడుకలో వ్యాఖ్యాత చేసిన ఓ తప్పును విరాట్ కోహ్లీ సరిదిద్దాడు. 2011 వన్డే ప్రపంచకప్ గెలిచిన విషయాన్ని వ్యాఖ్యాత గుర్తు చేశాడు. ఆ ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉండి ఇప్పుడు 2023 వన్డే ప్రపంచకప్ ఆడుతున్నది మీరు(కోహ్లీ) ఒక్కరేగా అని అన్నాడు. అయితే.. 2011 వన్డే ప్రపంచకప్ గెలిచిన జట్టులో రవిచంద్రన్ అశ్విన్ ఉన్న విషయాన్ని సదరు వ్యాఖ్యాత మరిచిపోయాడు.
ODI World Cup 2023 : సెమీ ఫైనల్‌లో ఆడటానికి పాకిస్థాన్ కు నిజంగా అర్హత ఉందా..? : అక్తర్
వెంటనే అతడు అడిగిన ప్రశ్నకు కోహ్లీ ఇలా సమాధానం చెప్పాడు. లేదు.. నాతో పాటు అశ్విన్ కూడా ఉన్నాడు. అని కోహ్లీ అన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Not many people talked about how Kohli corrected that Ashwin is also a paet of this squad who won the 2011 WC. pic.twitter.com/v2fS9U3yCY
— Aditya Saha (@Adityakrsaha) October 19, 2023
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 256 పరుగులు చేసింది. బంగ్లా బ్యాటర్లలో లిట్టన్ దాస్ (66), తాంజిద్ హసన్ (51) లు అర్థశతకాలు చేశారు. భారత బౌలర్లలో జస్ ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, రవీంద్ర జడేజాలు తలా రెండు వికెట్లు పడగొట్టారు. శార్దూల్ థాకూర్, కుల్దీప్ యాదవ్ ఒక్కొ వికెట్ తీశారు. లక్ష్యాన్ని భారత్ 41.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. విరాట్ కోహ్లీ శతకంతో చెలరేగగా గిల్(53), రోహిత్ శర్మ(48) లు రాణించారు.
IND vs NZ : గతకొన్నేళ్లుగా ఐసీసీ టోర్నీల్లో భారత్ పై కివీస్ ఆధిపత్యం.. ఈ సారైనా..!