World Cup Craze : క్రేజ్ ఆఫ్ వరల్డ్ కప్ ఫైనల్.. పరీక్షలు వాయిదా..
World Cup final : మన దేశంలో క్రికెట్‌ను ఓ ఆటలా కాదు ఓ మతంలా భావిస్తారు. సాధారణ మ్యాచులు ఉంటేనే టీవీలకు అతుక్కుపోతుంటారు.
- Thota Vamshi Kumar
- Updated on- November 19, 2023 / 02:32 PM IST
World Cup Craze
మన దేశంలో క్రికెట్‌ను ఓ ఆటలా కాదు ఓ మతంలా భావిస్తారు. సాధారణ మ్యాచులు ఉంటేనే టీవీలకు అతుక్కుపోతుంటారు. అలాంటిది ప్రపంచకప్ లాంటి మెగాటోర్నీలో అది కూడా ఫైనల్ మ్యాచ్ అయితే ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏముంది..? ఆదివారం కూడా కలిసి రావడంతో చాలా మంది హ్యాఫీగా మ్యాచ్‌ను చూస్తూ ఎంజాయ్ చేయాలని భావిస్తున్నారు. అయితే.. ఫరీదాబాద్‌లోని డిఏవీ పాఠశాల విద్యార్థులకు ఓ కష్టం వచ్చింది.
సోమవారం రోజు యూనిట్ టెస్టు పరీక్షలు జరగనున్నాయి. ఆదివారం మ్యాచ్ చూసి సోమవారం పరీక్ష రాయాలంటే కష్టం అని భావించిన విద్యార్థుల తల్లిదండ్రలు పాఠశాల యాజమాన్యానికి ఓ విన్నపం చేశారు. పరీక్షలను వాయిదా వేయాలని కోరారు. వారి విజ్ఞప్తి పరిగణలోకి తీసుకున్న పాఠశాల యాజమాన్యం పరీక్షను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు తెలియజేసింది.
కుటుంబ సభ్యులతో కలిసి మ్యాచ్‌ను చూసి ఆనందించాలని, అన్ని వయసుల వారు క్రికెట్‌ను చూసి ఎంజాయ్ చేస్తుంటారని చెప్పింది. టీమ్ఇండియా ప్రపంచకప్‌ను అందుకోవాలని కోరుకుంటున్నట్లు సర్య్కూలర్ లో ఉంది. దీన్ని ఓ వ్యక్తి సోషల్‌మీడియాలో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది. క్రేజ్ ఆఫ్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కు నిదర్శనం ఇదే నంటూ పలువురు నెటీజన్లు కామెంట్లు చేస్తున్నారు.
