ODI World Cup 2023 : వరల్డ్ కప్ చరిత్రలో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును ఎవరెవరు గెలుచుకున్నారో తెలుసా?

వన్డే ప్రపంచ కప్ చరిత్రలో 1992 నుంచి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును అందిస్తుంది. టోర్నమెంట్ లో అసాధారణ ప్రతిభ కనబర్చిన ప్లేయర్ ను ఎంపిక చేసి ఈ అవార్డును అందిస్తారు.

ODI World Cup 2023 : వరల్డ్ కప్ చరిత్రలో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును ఎవరెవరు గెలుచుకున్నారో తెలుసా?

ODI World Cup 2023

ODI World Cup Player of Tournament list: వన్డే ప్రపంచ కప్ చరిత్రలో 1992 నుంచి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును అందిస్తుంది. టోర్నమెంట్ లో అసాధారణ ప్రతిభ కనబర్చిన ప్లేయర్ ను ఎంపిక చేసి ఈ అవార్డును అందిస్తారు. ఈ అవార్డు అందుకున్న తొలి ప్లేయర్ న్యూజిలాండ్ కెప్టెన్ మార్టిన్ క్రోవ్. 1992లో న్యూజిలాండ్ ఆటగాడు మార్టిన్ క్రోవ్ తొమ్మిది ఇన్నింగ్స్ లలో 456 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. దీంతో ఐసీసీ క్రోవ్ కు తొలి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు అందించింది. 1996లో శ్రీలంక ప్లేయర్ సనత్ జయసూర్య ఈ అవార్డు అందుకున్నాడు. 221 పరుగులు చేసి ఏడు వికెట్లు తీసి అద్భుత ప్రతిభ కనబర్చిన ప్లేయర్ గా జయసూర్య నిలిచాడు. ఈ జాబితాలో లాన్స్ క్లూసెనర్, జయసూర్య, సచిన్ టెండూల్కర్, గ్లేన్ మెక్ గ్రాత్, మిచెల్ స్టార్ కేన్ విలియమ్సన్ లు అందుకున్నారు.

Also Read : Visakha : క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ చూసేందుకు విశాఖలో భారీ స్క్రీన్లు ఏర్పాటు

ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ విజేతలు వీరే..

1992 మార్టిన్ క్రో (న్యూజిలాండ్ 456 పరుగులు, తొమ్మిది ఇన్నింగ్స్‌లు)
1996 సనత్ జయసూర్య ( శ్రీలంక 221 పరుగులు, 7 వికెట్లు)
1999 లాన్స్ క్లూసెనర్ ( సౌతాఫ్రికా 281 పరుగులు, 17 వికెట్లు)
2003 సచిన్ టెండూల్కర్ ( భారత్ 673 పరుగులు, 11 ఇన్నింగ్స్)
2007 గ్లెన్ మెక్‌గ్రాత్ ( ఆస్ట్రేలియా 26 వికెట్లు, 11 మ్యాచ్‌లు)
2011 యువరాజ్ సింగ్ ( భారత్ 362 పరుగులు, 15 వికెట్లు, 9 మ్యాచ్‌లు)
2015 మిచెల్ స్టార్క్ ( ఆస్ట్రేలియా 22 వికెట్లు, 8 మ్యాచ్‌లు)
2019 కేన్ విలియమ్సన్ ( న్యూజిలాండ్ 578 పరుగులు, 11 మ్యాచ్‌లు)