Visakha : క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ చూసేందుకు విశాఖలో భారీ స్క్రీన్లు ఏర్పాటు

బీచ్ రోడ్డులో జనాల రద్ది అధికంగా ఉండే ఆవకాశం ఉండటంతో బీచ్ రోడ్డులో ఆంక్షలు విధించారు. బైక్ ర్యాలీలు విన్యాసాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు అంటున్నారు.

Visakha : క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ చూసేందుకు విశాఖలో భారీ స్క్రీన్లు ఏర్పాటు

Huge screens in Visakha

Visakha Huge Screens : క్రికెట్ వన్డే వరల్డ్ కప్ ఫైనల్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరికొద్ది గంటల్లో వన్డే వరల్డ్ కప్ గ్రాండ్ ఫినాలే ప్రారంభం కానుంది. అహ్మదాబాద్ వేదికంగా భారత్, ఆస్ట్రేలియా జట్లు ఫైనల్ ఫైట్ లో తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానుల్లో సందడి నెలకొంది. ఈ క్రమంలో విశాఖలో ఇండియా, ఆస్ట్రేలియా క్రికెట్ ఫీవర్ నెలకొంది.

వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ వీక్షీంచేందుకు భారీ స్కీన్లు ఏర్పాటు చేశారు. 20వేల మంది ఓకేసారి చూసే విధంగా ఏర్పాట్లు చేశారు. నగరంలోని బీచ్ రోడ్డులో జనాల రద్ది అధికంగా ఉండే ఆవకాశం ఉండటంతో బీచ్ రోడ్డులో ఆంక్షలు విధించారు. బైక్ ర్యాలీలు విన్యాసాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు అంటున్నారు.

విశాఖకు చేరిన ఆస్ట్రేలియా టి20 క్రికెట్ టీం..
మరోవైపు ఆస్ట్రేలియా టి20 క్రికెట్ టీం 14 మంది సభ్యులు విశాఖ ఇండిగో విమానంలో ఢిల్లీ నుంచి విశాఖ ఎయిర్పోర్టుకి చేరుకున్నారు. ఆస్ట్రేలియా క్రికెట్ టీం విశాఖ ఎయిర్ పోర్టు నుంచి రాడిసన్ బ్లూ హోటల్ కి బయలుదేరారు. నవంబర్ 23వ తేదీన విశాఖలో వైయస్ రాజశేఖర్ రెడ్డి క్రికెట్ స్టేడియంలో జరగబోయే టి20 క్రికెట్ మ్యాచ్ జరుగనుంది. ఇందుకోసం ముందస్తుగా ప్రాక్టీస్ చేసేందుకు ఆస్ట్రేలియా టీం విశాఖకు వచ్చింది.