×
Ad

Team India : వెస్టిండీస్ పై తొలి టెస్టులో ఘ‌న విజ‌యం.. అయినాగానీ.. డ‌బ్ల్యూటీసీలో భార‌త్‌కు త‌ప్ప‌ని నిరాశ‌

తొలి టెస్టులో వెస్టిండీస్ పై ఘ‌న విజ‌యం సాధించినా కూడా డ‌బ్ల్యూటీసీ పాయింట్ల ప‌ట్టిక‌లో భార‌త (Team India) స్థానం మెరుగుప‌డ‌లేదు.

World Test Championship 2027 Points Table After Team India Beat West Indies in first test

Team India : వెస్టిండీస్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భార‌త్ ఘ‌నంగా బోణీ కొట్టింది. అహ్మ‌దాబాద్ వేదిక‌గా జ‌రిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 140 ప‌రుగుల తేడాతో భార‌త్ (Team India) గెలుపొందింది. అయితే.. ఈ అద్భుత‌మైన విజ‌యం సాధించిన‌ప్ప‌టికి కూడా ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్ 2025-27 పాయింట్ల ప‌ట్టిక‌లో భార‌త స్థానం మెరుగుప‌డ‌లేదు.

తాజాగా వెస్టిండీస్‌తో మ్యాచ్‌తో క‌లిపి డ‌బ్ల్యూటీసీ 2025-27 సైకిలో భార‌త్ ఇప్ప‌టి వ‌ర‌కు ఆరు మ్యాచ్‌లు ఆడింది. ఇందులో మూడు మ్యాచ్‌ల్లో విజ‌యం సాధించింది. రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోగా మ‌రో మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. భార‌త ఖాతాలో 40 పాయింట్లు ఉండ‌గా, విజ‌య‌శాతం 55.56గా ఉంది.

Ravindra Jadeja : ర‌వీంద్ర జ‌డేజా వ‌న్డే కెరీర్ ఇక ముగిసిన‌ట్లేనా..! అజిత్ అగార్క‌ర్ కామెంట్స్ వైర‌ల్..

విండీస్‌తో తొలి టెస్టుకు ముందు భార‌త విజ‌య‌శాతం 46.67 ఉండ‌గా ఉంది. తొలి టెస్టు విజ‌యం త‌రువాత 55.56 శాతానికి పెరిగినా కూడా భార‌త్ మూడో స్థానంలోనే కొన‌సాగుతుంది.

డ‌బ్ల్యూటీసీ 2025-27 పాయింట్ల ప‌ట్టిక‌లో ఆస్ట్రేలియా, శ్రీలంక జ‌ట్లు మొద‌టి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో గెలిచిన ఆసీస్ 100 విజ‌య శాతంతో అగ్ర‌స్థానంలో కొన‌సాగుతోంది. మ‌రోవైపు లంక జ‌ట్టు ఇప్ప‌టి వ‌ర‌కు రెండు మ్యాచ్‌లు ఆడ‌గా ఓ మ్యాచ్‌లో గెలిచి మ‌రో మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. 66.67 విజ‌య‌శాతంతో రెండో స్థానంలో ఉంది.

Ajit Agarkar : అందుకే రోహిత్ శ‌ర్మ‌ను కెప్టెన్సీ నుంచి త‌ప్పించాం.. అజిత్ అగార్క‌ర్ కామెంట్స్‌..

భార‌త్ మూడో స్థానంలో ఉండ‌గా, ఇంగ్లాండ్‌, బంగ్లాదేశ్‌, వెస్టిండీస్ జ‌ట్లు వ‌రుస‌గా నాలుగు, ఐదు, ఆరో స్థానాల్లో ఉన్నాయి. ఇక న్యూజిలాండ్‌, పాకిస్తాన్, ద‌క్షిణాఫ్రికాలు ఇంత వ‌ర‌కు ఈ కొత్త సైకిల్‌లో ఒక్క మ్యాచ్‌ను కూడా ఆడ‌లేదు.