WPL 2026 Meg Lanning shared playful off field banter with her former teammate Jemimah Rodrigues
WPL 2026 : మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) నాలుగో సీజన్ నేటి (జనవరి 9) నుంచి ప్రారంభం కానుంది. ఈ సీజన్ కు ఒక రోజు ముందు ప్రమోషనల్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐదు జట్లకు సంబంధించిన కెప్టెన్లు పాల్గొన్నారు.
ఈ క్రమంలో యూపీ వారియర్జ్ కెప్టెన్ మెగ్ లానింగ్.. తన మాజీ సహచరురాలు, ప్రస్తుత ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ జెమీమా రోడ్రిగ్స్ గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. గతంలో జెమీమా వల్ల తనకు కలిగిన అసౌకర్యాన్ని తెలియజేస్తూనే ఇప్పుడు తనకు తెలిసి వస్తుంది అని చెప్పుకొచ్చింది. లానింగ్ చెప్పిన విషయం విన్న బెంగళూరు కెప్టెన్ స్మృతి మంధాన, ముంబై కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్‌లు పడి పడి నవ్వారు.
WPL 2026 : ముంబై వర్సెస్ బెంగళూరు.. పిచ్ రిపోర్టు, హెడ్-టు-హెడ్ రికార్డులు ఇవే..
లానింగ్ ఏమన్నదంటే?
ఈ కార్యక్రమంలో సరదాగా ట్రూత్ అండ్ డేర్ ను నిర్వహించారు. ఈ క్రమంలో హోస్ట్.. జెమిమాను స్లెడ్జ్ చేయమని లానింగ్‌కు సవాల్ విసిరారు. దీనికి అంగీకరించిన లానింగ్ అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని నవ్వించింది.
Meg was clearly a bit annoyed by Jemi dancing on the field during matches… lol🤣🤣🤣😅😅
Also the way harman reacted ..xd https://t.co/kIuqvs8Siy pic.twitter.com/Btn2nwbKZ7— Bonny 🎀💕 (@harryjeee) January 8, 2026
‘ఫీల్డర్లు కెప్టెన్ మాట వినకుండా మైదానంలో డ్యాన్స్‌లు చేస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు నీకు తెలుస్తుంది.’ అంటూ లానింగ్ అంది. దీన్ని విన్న జెమీమాతో పాటు స్మృతి మంధాన, హర్మన్ ప్రీత్ కౌర్‌లు నవ్వుకున్నారు. ముఖ్యంగా హర్మన్ అయితే తను కూర్చున్న కుర్చీలోంచి లేచి మరీ నవ్వడం విశేషం. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
గతంలో ఇద్దరూ ఒకే టీమ్..
మెగ్ లానింగ్, జెమీమా రోడ్రిగ్స్ లు గత సీజన్ వరకు ఢిల్లీ కి ప్రాతినిధ్యం వహించారు. మూడు సీజన్ల పాటు ఢిల్లీకి లానింగ్ కెప్టెన్‌గా ఉండగా ఆమె స్థారథ్యంలో జెమీమా ఆడింది. ఈ సమయంలో కొన్ని సార్లు జెమీమా.. లానింగ్ మాటలను వినకుండా మైదానంలో డ్యాన్స్ చేసేదని తాజా వ్యాఖ్యలను బట్టి అర్థం అవుతోంది.
Team India : కొత్త ఏడాదిలో టీమ్ఇండియా ఫస్ట్ ట్రైనింగ్ సెషన్.. ఫోటోలు వైరల్
లానింగ్‌ను ఢిల్లీ వేలానికి వదిలివేయగా యూపీ కొనుగోలు చేసి కెప్టెన్ ను చేసింది. మరోవైపు ఢిల్లీ తమ కెప్టెన్‌గా జెమీమాను నియమించింది.