WPL 2026 : ముంబై వర్సెస్ బెంగళూరు.. పిచ్ రిపోర్టు, హెడ్-టు-హెడ్ రికార్డులు ఇవే..
డబ్ల్యూపీఎల్ 2026లో (WPL 2026) భాగంగా ఆరంభ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ లు తలపడనున్నాయి.
WPL 2026 MI W vs RCB W Match Prediction pitch report head to head records
- నేటి నుంచే డబ్ల్యూపీఎల్ నాలుగో సీజన్
- ఆర్‌సీబీ, ముంబై జట్ల మధ్య తొలి మ్యాచ్
- ఆర్‌సీబీ ముంబై ల హెడ్-టు-హెడ్ రికార్డులు
WPL 2026 : మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్ 2026) నేటి నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు నవీ ముంబైలోని డాక్టర్ డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ ఆతిథ్యం ఇవ్వనుంది.
ముంబై ఇండియన్స్ డిఫెండింగ్ ఛాంపియన్‌గా అడుగుపెడుతోంది. గతేడాది (2025) ఫైనల్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ పై విజయం సాధించి రెండో సారి ముంబై జట్టు డబ్ల్యూపీఎల్ విజేతగా నిలిచింది. హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలో హేలీ మాథ్యూస్, నాట్ స్కైవర్-బ్రంట్, అమంజోత్, సైకా ఇషాక్‌లతో కూడిన ముంబై జట్టు చాలా బలంగా ఉంది. ముచ్చటగా మూడో సారి ముంబై కప్పును ముద్దాడాలని భావిస్తోంది.
Team India : కొత్త ఏడాదిలో టీమ్ఇండియా ఫస్ట్ ట్రైనింగ్ సెషన్.. ఫోటోలు వైరల్
2024 డబ్ల్యూపీఎల్ విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు నిలిచింది. స్మృతి మంధాన నాయకత్వంలో బరిలోకి దిగుతున్న ఆర్‌సీబీ జట్టులో రిచా ఘోష్, నదిన్ డిక్లెర్క్, శ్రేయంకా పాటిల్, అరుంధతి రెడ్డి లు కీలక ప్లేయర్లుగా ఉన్నారు. ఆర్‌సీబీ రెండో సారి కప్పును ముద్దాడాలని ఆరాటపడుతోంది.
అటు ముంబై, ఇటు ఆర్‌సీబీలు కూడా తొలి మ్యాచ్‌లో విజయం సాధించి నాలుగో సీజన్‌ను విజయంతో ఆరంభించాలని భావిస్తున్నాయి.
పిచ్..
నవీ ముంబైలోని డాక్టర్ డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలోని పిచ్ సాధారణంగా బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుంది. బంతి చక్కగా బ్యాట్ పైకి వస్తుంది. రాత్రి మంచు ప్రభావం వల్ల బంతిపై బౌలర్లకు పట్టు దొరకడం కష్టం అవుతుంది. దీంతో టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకోవచ్చు. సాధారణంగా ఇక్కడ సగటు స్కోరు 150 నుంచి 160 మధ్య ఉంటుంది.
హెడ్-టు-హెడ్ రికార్డు..
ముంబై, ఆర్‌సీబీ జట్లు డబ్ల్యూపీఎల్‌లో 7 మ్యాచ్‌ల్లో ముఖాముఖిగా తలపడ్డాయి. ఇందులో 4 మ్యాచ్‌ల్లో ముంబై విజయం సాధించగా 3 మ్యాచ్‌ల్లో ఆర్‌సీబీ గెలుపొందింది.
తుది జట్లు అంచనా..
ముంబై జట్టు..
హేలీ మాథ్యూస్, నాట్ స్కివర్-బ్రంట్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), అమంజోత్ కౌర్, అమేలియా కెర్, జి కమలిని (వికెట్ కీపర్), షబ్నిమ్ ఇస్మాయిల్, సైకా ఇషాక్, సజీవన్ సజన, సంస్కృతి గుప్తా, పూనమ్ ఖేమ్నార్
Malaysia Open 2026 : గాయంతో తప్పుకున్న యమగూచి.. సెమీస్‌లో అడుగుపెట్టిన పీవీ సింధు..
ఆర్‌సీబీ జట్టు..
స్మృతి మంధాన (కెప్టెన్), నదీన్ డి క్లెర్క్, శ్రేయాంక పాటిల్, పూజా వస్త్రాకర్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), అరుంధతి రెడ్డి, రాధా యాదవ్, జార్జియా వోల్, లారెన్ బెల్, గౌతమి నాయక్, లిన్సే స్మిత్
