Malaysia Open 2026 : గాయంతో తప్పుకున్న యమగూచి.. సెమీస్‌లో అడుగుపెట్టిన పీవీ సింధు..
మలేషియా ఓపెన్ సూపర్ 1000 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో (Malaysia Open 2026) భారత స్టార్ షట్లర్ పీవీ సింధు సెమీ ఫైనల్‌కు చేరుకుంది
Malaysia Open 2026 PV Sindhu reaches semifinal
- మలేషియా ఓపెన్‌లో సెమీస్‌కు పీవీ సింధు
- క్వార్టర్ ఫైనల్‌లో గాయం కారణంగా తప్పుకున్న యమగూచి
Malaysia Open 2026 : మలేషియా ఓపెన్ సూపర్ 1000 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు సెమీ ఫైనల్‌కు చేరుకుంది. కౌలాలంపూర్ వేదికగా ఈ టోర్నీ జరుగుతోంది. ఈ టోర్నీలో భాగంగా శుక్రవారం క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో జపాన్‌కు చెందిన అకానే యమగుచి, పీవీ సింధు లు తలపడ్డారు. అయితే.. యమగూచి గాయం కారణంగా తప్పుకోవడంతో పీవీ సింధు సెమీఫైనల్‌కు చేరుకుంది.
రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత అయిన సింధు గాయం కారణంగా చాలా కాలం ఆటకు దూరంగా ఉంది. గాయం నుంచి కోలుకున్న తరువాత ఆమె ఆడుతున్న తొలి టోర్నీ ఇదే. ఇక యమగూచి గాయం కారణంగా తప్పుకోవడానికి ముందు సింధు 21-11 తో ఆరంభ గేమ్‌ను గెలుచుకుంది.
🚨 PV SINDHU STORMS INTO SEMIS FOLKS! 💥
She won the first game 21-11 against the Reigning World Champion Akane Yamaguchi of Japan 🇯🇵, Later Akane had to retire due to injury concern!
ALL THE BEST FOR SEMIS, SINDHU! 🇮🇳💙 pic.twitter.com/G0riVSbr0M
— The Khel India (@TheKhelIndia) January 9, 2026
ఇక ఈ విజయంతో యమగూచి పై సింధు తన రికార్డును 15-12తో మరింత మెరుగుపరచుకుంది. ఎనిమిదేళ్ల తర్వాత సింధు మలేషియా ఓపెన్ సెమీఫైనల్‌కు చేరుకోవడం గమనార్హం.
ఇక సింధు సెమీఫైనల్ లో ఇండోనేషియాకు చెందిన ఆరో సీడ్ పుత్రి కుసుమా వార్దానీ లేదా రెండవ సీడ్ చైనీస్ వాంగ్ ఝీ యితో తలపడనుంది. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో పుత్రి కుసుమా వార్దానీ, వాంగ్ ఝీ యి లు తలపడనున్నారు. వీరిలో గెలిచిన వారితో సెమీఫైనల్‌లో సింధు పోటీపడనుంది.
