WPL 2026 : డబ్ల్యూపీఎల్ ఆరంభానికి ముందే గుజరాత్ కు బిగ్ షాక్.. స్టార్ ప్లేయర్ దూరం.. ఆమె స్థానంలో ఎవ్వరిని తీసుకోలేరు..
డబ్ల్యూపీఎల్ నాలుగో సీజన్ (WPL 2026) ప్రారంభానికి కొన్ని ముందే గుజరాత్ జెయింట్స్ స్టార్ ప్లేయర్ యాస్తిక భాటియా గాయం కారణంగా ఈ సీజన్ మొత్తానికే తప్పుకుంది.
Yastika Bhatia ruled out of WPL 2026 due to injury
- నేటి నుంచే డబ్ల్యూపీఎల్ నాలుగో సీజన్
- సీజన్ ప్రారంభానికి ముందే గుజరాత్ జెయింట్స్ కు బిగ్ షాక్
- గాయం కారణంగా సీజన్ మొత్తానికి యాస్తిక భాటియా దూరం
WPL 2026 : డబ్ల్యూపీఎల్ నాలుగో సీజన్ ప్రారంభానికి ముందే గుజరాత్ జెయింట్స్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ వికెట్ కీపర్ 25 ఏళ్ల యాస్తిక భాటియా గాయం కారణంగా ఈ సీజన్ మొత్తానికి దూరమైంది. ఈ విషయాన్ని గుజరాత్ టైటాన్స్ సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది.
ఇటీవల జరిగిన వేలంలో యస్తిక భాటియాను గుజరాత్ జెయింట్స్ 50 లక్షలకు కొనుగోలు చేసింది. ప్రస్తుతం భాటియా మోకాలి గాయంతో బాధపడుతోంది. దీని నుంచి ఇంకా ఆమె కోలుకోలేదు. ఈ గాయం కారణంగానే ఆమె ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్, వన్డే ప్రపంచకప్ 2025 లో కూడ ఆడలేకపోయింది. దీంతో ఆమె స్థానంలో బీసీసీఐ ఉమా చెత్రిని జాతీయ జట్టులోకి తీసుకుంది.
ఎవ్వరిని తీసుకోలేరు..
వాస్తవానికి గాయంతో బాధపడుతున్నప్పటికి కూడా గుజరాత్ యస్తికను వేలంలో కొనుగోలు చేసింది. డబ్ల్యూపీఎల్ సీజన్ నాటికి ఆమె కోలుకుంటుందని భావించింది. అయితే అలా జరగలేదు. ఇక ఇదే సమయంలో ఆమె స్థానంలో మరో ప్లేయర్‌ను తీసుకునేందుకు గుజరాత్ కు అవకాశం లేకపోయింది.
బీసీసీఐ నిబంధనల ప్రకారం వేలం సమయంలో గాయంతో ఉన్న ప్లేయర్ ను కొనుగోలు చేసినప్పుడు సదరు ప్లేయర్ సీజన్ సమయానికి కోలుకోలేక పోతే వారి స్థానంలో మరో ప్లేయర్‌ను తీసుకునే అవకాశం లేదు. ఈ క్రమంలో యస్తిక వేలం సమయానికే గాయంతో బాధపడుతుండడంతో ఆమె స్థానంలో మరో ప్లేయర్‌ను తీసుకునే అవకాశం లేదు.
She was ready to shine in orange but fate had other plans. 😔
The Gujarat Giants family sends love and strength to Yastika Bhatia, Wishing her a speedy recovery. See you soon, champ. ❤️🩹#GujaratGiants #BringItOn #Adani #TATAWPL pic.twitter.com/5nl5k6B81L
— Gujarat Giants (@Giant_Cricket) January 8, 2026
ఇక ఈ రూల్ కారణంగా పలు జట్లు ఇబ్బందులు పడొచ్చు. పూజా వస్త్రాకర్, ప్రతీకా రావల్ లు టోర్నమెంట్ ప్రారంభమయ్యే ముందు ఫిట్‌నెస్ సాధించడంలో విఫలమైతే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, యూపీ వారియర్జ్ లకు కూడా ఇలాంటి పరిస్థితే వస్తుంది.
తొలి మ్యాచ్ ఆర్‌సీబీ వర్సెస్ ముంబై
టీ20 ప్రపంచకప్ 2026, ఐపీఎల్‌కు ముందు క్రికెట్ అభిమానులను అలరించేందుకు మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2026 సిద్ధమైంది. నేటి (శుక్రవారం జనవరి 9) నుంచి డబ్ల్యూపీఎల్ నాలుగో సీజన్ ప్రారంభం కానుంది.
WPL 2026 : శుక్రవారం నుంచే డబ్ల్యూపీఎల్ నాలుగో సీజన్.. మ్యాచ్‌లను ఎక్కడ చూడొచ్చొ తెలుసా?
తొలి మ్యాచ్‌లో రెండు సార్లు ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్‌తో ఓ సారి విజేత అయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఢీ కొట్టనుంది. నవీ ముంబై వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
