WPL 2026 : శుక్రవారం నుంచే డబ్ల్యూపీఎల్ నాలుగో సీజన్.. మ్యాచ్‌లను ఎక్కడ చూడొచ్చొ తెలుసా?
శుక్రవారం నుంచి డబ్ల్యూపీఎల్ (WPL 2026) నాలుగో సీజన్ ప్రారంభం కానుంది.
WPL 2026 schedule and live streaming details here (pic credit@ @wplt20)
- జనవరి 9 నుంచి డబ్ల్యూపీఎల్ నాలుగో సీజన్
- తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ ఢీ
WPL 2026 : మహిళల ప్రీమియర్ లీగ్ 2026 (డబ్ల్యూపీఎల్) కు రంగం సిద్దమైంది. ఇప్పటి వరకు డబ్ల్యూపీఎల్ విజయవంతంగా మూడు సీజన్లు పూర్తి చేసుకుంది. శుక్రవారం (జనవరి 9) నుంచి నాలుగో సీజన్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ తలపడనుంది. నవీ ముంబై ఈ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తోంది. ఫిబ్రవరి 5న ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
డబ్ల్యూపీఎల్ 2026 పూర్తి షెడ్యూల్ ఇదే..
* జనవరి 9 – ముంబై ఇండియన్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (నవీ ముంబై)
* జనవరి 10 – యుపి వారియర్జ్ vs గుజరాత్ జెయింట్స్ (నవీ ముంబై)
* జనవరి 10 – ముంబై ఇండియన్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ ( నవీ ముంబై)
* జనవరి 11 – ఢిల్లీ క్యాపిటల్స్ vs గుజరాత్ జెయింట్స్ (నవీ ముంబై)
* జనవరి 12 – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs యుపి వారియర్జ్, (నవీ ముంబై)
* జనవరి 13 – ముంబై ఇండియన్స్ vs గుజరాత్ జెయింట్స్ ( నవీ ముంబై)
* జనవరి 14 – యుపి వారియర్జ్ vs ఢిల్లీ క్యాపిటల్స్ ( నవీ ముంబై)
* జనవరి 15 – ముంబై ఇండియన్స్ vs యుపి వారియర్జ్ ( నవీ ముంబై)
* జనవరి 16 – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs గుజరాత్ జెయింట్స్ ( నవీ ముంబై)
* జనవరి 17 – యుపి వారియర్జ్ vs ముంబై ఇండియన్స్ ( నవీ ముంబై)
* జనవరి 17 – ఢిల్లీ క్యాపిటల్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ( నవీ ముంబై)
* జనవరి 19 – గుజరాత్ జెయింట్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ( వడోదర)
* జనవరి 20 – ఢిల్లీ క్యాపిటల్స్ vs ముంబై ఇండియన్స్ ( వడోదర)
* జనవరి 22 – గుజరాత్ జెయింట్స్ vs యుపి వారియర్జ్ ( వడోదర)
* జనవరి 24 – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs ఢిల్లీ క్యాపిటల్స్ ( వడోదర)
* జనవరి 26 – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs ముంబై ఇండియన్స్ ( వడోదర)
* జనవరి 27 – గుజరాత్ జెయింట్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ ( వడోదర)
* జనవరి 29 – యుపి వారియర్జ్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ( వడోదర)
* జనవరి 30 – గుజరాత్ జెయింట్స్ vs ముంబై ఇండియన్స్ (వడోదర)
* ఫిబ్రవరి 1 – ఢిల్లీ క్యాపిటల్స్ vs యుపి వారియర్జ్ (వడోదర)
* ఫిబ్రవరి 3 – ఎలిమినేటర్ (వడోదర)
– ఫిబ్రవరి 5 – ఫైనల్ ( వడోదర)
మ్యాచ్‌లను ఎక్కడ చూడొచ్చంటే?
మహిళల ప్రీమియర్ లీగ్ 2026 ప్రసార హక్కులను స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ కలిగి ఉంది. దీంతో టీవీల్లో మ్యాచ్‌లు స్టార్ స్పోర్ట్స్ ఛానెల్ ప్రత్యక్షప్రసారం కానున్నాయి. ఇక ఓటీటీ విషయానికి వస్తే జియో హాట్‌స్టార్ యాప్, వెబ్‌సైట్‌లలో మ్యాచ్‌లు స్ట్రీమింగ్ కానున్నాయి.
