WTC points table 2027 : యాషెస్ సిరీస్ ఆస్ట్రేలియా కైవసం.. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్ పరిస్థితి ఏంటో తెలుసా?
ఇంగ్లాండ్ పై ఐదో టెస్టులో విజయం తరువాత డబ్ల్యూటీసీ 2027 పాయింట్ల పట్టికలో (WTC points table 2027) ఆస్ట్రేలియా అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకుంది.
WTC points table 2027 update after Australia win 5th test against England pic credit (@CricCrazyJohns)
- యాషెస్ సిరీస్ గెలిచిన ఆస్ట్రేలియా
- డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఆసీస్ అగ్రస్థానం మరింత పదిలం
- ఏడో స్థానంలో ఇంగ్లాండ్
WTC points table 2027 : యాషెస్ సిరీస్‌లో భాగంగా సిడ్నీ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన చివరి టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. తద్వారా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 4-1తో కైవసం చేసుకుంది. ఈ విజయంతో ఆస్ట్రేలియా ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) 2025-27 పాయింట్ల పట్టికలో తన అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకుంది.
డబ్ల్యూటీసీ 2025-27 సైకిల్‌లో ఆస్ట్రేలియా ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో ఏడు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఓ మ్యాచ్‌లో ఓడిపోయింది. ఆ జట్టు విజయశాతం 87.50గా ఉంది. ఇక ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయిన ఇంగ్లాండ్ ఏడో స్థానంలో కొనసాగుతోంది.
WPL 2026 : డబ్ల్యూపీఎల్ 2026 ట్రోఫీతో కెప్టెన్ల ఫోజులు.. ఫోటోలు వైరల్
ప్రస్తుత సైకిల్‌లో ఇంగ్లాండ్ 10 మ్యాచ్‌లు ఆడగా మూడు మ్యాచ్‌ల్లో గెలుపొందింది. మరో 6 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఓ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఆ జట్టు విజయశాతం 31.67గా ఉంది. పాయింట్ల పట్టికలో ఇంగ్లాండ్ తరువాతి స్థానాల్లో బంగ్లాదేశ్, వెస్టిండీస్ జట్లు మాత్రమే వరుసగా ఎనిమిది, తొమ్మిది స్థానాల్లో ఉన్నాయి.

ఇక భారత జట్టు విషయానికి వస్తే.. ఇప్పటి వరకు టీమ్ఇండియా ఈ సైకిల్‌లో 9 టెస్టులు ఆడింది. ఇందులో నాలుగు మ్యాచ్‌ల్లో విజయం సాధించగా మరో నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఓ మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. విజయశాతం 48.15గా ఉంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో (WTC points table 2027) ఆరో స్థానంలో ఉంది.
Steve Smith : యాషెస్ గెలిచామన్న ఆనందాన్ని లేకుండా చేసిన స్టీవ్ స్మిత్..! ఇప్పుడెలా?
ఈ సైకిల్‌లో ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు మ్యాచ్‌లు గెలిచి మరో మ్యాచ్‌ను డ్రా చేసుకున్న న్యూజిలాండ్ జట్టు పట్టికలో రెండో స్థానంలో ఉంది. విజయ శాతం 77.78గా ఉంది. ఆ తరువాత సౌతాఫ్రికా, శ్రీలంక, పాకిస్తాన్‌లు వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నాయి.
