Steve Smith : యాషెస్ గెలిచామ‌న్న ఆనందాన్ని లేకుండా చేసిన‌ స్టీవ్ స్మిత్‌..! ఇప్పుడెలా?

త‌న రిటైర్‌మెంట్ పై స్టీవ్ స్మిత్ (Steve Smith) హింట్ ఇచ్చాడు.

Steve Smith : యాషెస్ గెలిచామ‌న్న ఆనందాన్ని లేకుండా చేసిన‌ స్టీవ్ స్మిత్‌..! ఇప్పుడెలా?

Steve Smith makes big RETIREMENT (pic credit @CricCrazyJohns)

Updated On : January 8, 2026 / 2:21 PM IST
  • యాషెస్ సిరీస్ ఆస్ట్రేలియా కైవ‌సం
  • రిటైర్‌మెంట్ పై స్టీవ్ స్మిత్ హింట్
  • ఆందోళ‌నలో ఫ్యాన్స్‌

Steve Smith : యాషెస్ సిరీస్‌ను ఆస్ట్రేలియా కైవ‌సం చేసుకుంది. ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఇంగ్లాండ్ పై 4-1 తేడాతో ఆస్ట్రేలియా గెలుపొందింది. సిడ్నీ వేదిక‌గా జ‌రిగిన ఐదో టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లాండ్ పై 5 వికెట్ల తేడాతో విజ‌యం సాధించిన అనంత‌రం ఆసీస్ ఆట‌గాళ్ల సంబురాలు అంబ‌రాన్ని అంటాయి. ఆసీస్ ఫ్యాన్స్ పండ‌గ చేసుకుంటున్నారు. స‌రిగ్గా ఇదే స‌మ‌యంలో ఆస్ట్రేలియా స్టార్ ఆట‌గాడు స్టీవ్ స్మిత్ (Steve Smith) చేసిన వ్యాఖ్య‌లతో అభిమానులు షాక్ కు గురి అయ్యారు.

త‌న టెస్టు క్రికెట్ భ‌విష్య‌త్తుపై స్మిత్ సంచల‌న వ్యాఖ్య‌లు చేశాడు. స్వ‌దేశంలో యాషెస్ సిరీస్ గెలిచినందుకు ఎంతో సంతోషంగా ఉంద‌ని చెప్పాడు. అయితే.. ఇదే యాషెస్ సిరీస్‌ను ఇంగ్లాండ్‌లో గెల‌వ‌లేక‌పోవ‌డం త‌న కెరీర్‌లో లోటుగా ఉంటుంద‌న్నాడు. ఈ ఒక్క‌టి సాధించాల‌ని ఉంద‌న్నాడు. వ‌చ్చే ఏడాది (2027లో)ఇంగ్లాండ్ వేదిక‌గా జ‌రిగే యాషెస్ సిరీస్‌లో తాను ఆడ‌తానో లేదో తెలియ‌దు అంటూ ప‌రోక్షంగా త‌న రిటైర్‌మెంట్ పై సంకేతాలు ఇచ్చాడు.

AUS vs ENG : ‘మేం ఓడిపోయింది అందుకే..’ ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్‌స్టోక్స్ కామెంట్స్‌.. లోపాల‌ను ఇప్ప‌ట్లో స‌రిచేసుకోం.. మ‌రో ఆరు నెల‌లు..

2027లో ఇంగ్లాండ్‌లో త‌దుప‌రి యాషెస్ సిరీస్ ప్రారంభం అయ్యే స‌మ‌యానికి స్టీవ్ స్మిత్‌కు 38 సంవ‌త్స‌రాలు నిండుతాయి. అప్ప‌టికి అత‌డి శ‌రీరం స‌హ‌క‌రిస్తుందో లేదో అనే విష‌యంలో స్మిత్ ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది.

‘అందరూ అక్కడికి (ఇంగ్లాండ్‌) వెళ్లి యాషెస్ గెలవడానికి ఉత్సాహంగా ఉన్నారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. అయితే.. అక్క‌డ నేను ఉంటానో లేదో తెలియ‌దు. గత నాలుగు లేదా ఐదు సంవత్సరాలుగా మా జట్టు అద్భుతంగా ఉంది. ఇంకా మేము మెరుగుప‌డుతూనే ఉంటాము.’ అని స్టీవ్ స్మిత్ ఫాక్స్ క్రికెట్ తో మాట్లాడుతూ చెప్పాడు.

స్టీవ్‌ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం ఆస్ట్రేలియా క్రికెట్ లో దుమారం రేపుతున్నాయి. ఆసీస్ ఫ్యాన్స్ ఆందోళ‌న చెందుతున్నారు. ఈ విష‌యం తెలిసిన త‌రువాత యాషెస్ విజ‌యాన్ని ఇప్పుడు పూర్తిగా ఆస్వాదించ‌లేక‌పోతున్నామ‌ని వారు కామెంట్లు చేస్తున్నారు.

T20 World Cup 2026 : టీ20 ప్ర‌పంచ‌క‌ప్ కోసం న్యూజిలాండ్ జ‌ట్టు ఇదే.. వామ్మో 31 ఏళ్ల ఆట‌గాడికి చోటు..

అంద‌ని ద్రాక్షే..

స్టీవ్ స్మిత్ త‌న కెరీర్‌లో ఇంగ్లాండ్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు నాలుగు సార్లు యాషెస్ సిరీస్ లు ఆడాడు. 2013, 2015, 2019, 2023ల‌లో ఆడిన‌ప్ప‌టికి అక్క‌డ అత‌డు యాషెస్ సిరీస్ విజ‌యాన్ని అందుకోలేదు. 2019 యాషెస్ సిరీస్‌లో స్మిత్ ఎంతో గొప్ప‌గా రాణించాడు. 110 కంటే ఎక్కువ స‌గ‌టుతో 774 ప‌రుగులు చేశాడు.