AUS vs ENG : ‘మేం ఓడిపోయింది అందుకే..’ ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్‌స్టోక్స్ కామెంట్స్..
యాషెస్ సిరీస్ ఓటమిపై (AUS vs ENG) ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్‌స్టోక్స్ స్పందించాడు.
England captain Ben Stokes comments after Australia win Ashes series
- యాషెస్ సిరీస్ ఆస్ట్రేలియా కైవసం
- సిరీస్ ఓటమిపై ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్‌స్టోక్స్ కామెంట్స్
- ఇంకాస్త మెరుగ్గా ఆడాల్సింది
AUS vs ENG : యాషెస్ సిరీస్ ముగిసింది. ఆస్ట్రేలియా జట్టు 4-1 తేడాతో ఇంగ్లాండ్ పై విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకుంది. సిడ్నీ వేదికగా జరిగిన చివరి టెస్టు మ్యాచ్‌లోనూ ఆసీస్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్ (AUS vs ENG ) అనంతరం ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్‌స్టోక్స్ మాట్లాడుతూ బ్యాటింగ్ వైఫల్యంతోనే ఓటమి పాలు అయినట్లుగా చెప్పుకొచ్చాడు. ఐదో టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో తాము అదనంగా మరో 100 పరుగులు చేసి ఉంటే ఫలితం మరో రకంగా ఉండేదని అభిప్రాయపడ్డాడు.
తన కాలి గాయం గురించి మాట్లాడుతూ ప్రస్తుతం బాగానే ఉందన్నాడు. కొన్ని సార్లు తీవ్రమైన నొప్పి వస్తుందన్నాడు. ఇంటికి వెళ్లిన తరువాతనే గాయం పై ఓ స్పష్టత వస్తుందన్నాడు. ఇక ఐదో టెస్టు మ్యాచ్‌లో తాము ఓడిపోయినప్పటికి ఇదొక గొప్ప మ్యాచ్ అని స్టోక్స్ చెప్పాడు. ఇలాంటి మ్యాచ్‌లో భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉందన్నాడు.
T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్ కోసం న్యూజిలాండ్ జట్టు ఇదే.. వామ్మో 31 ఏళ్ల ఆటగాడికి చోటు..
ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో తాము 100 పరుగులు అదనంగా చేసి ఉండాల్సిందన్నాడు. అదే సమయంలో ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో సాధించిన స్కోరు కంటే కనీసం 100 కంటే తక్కువ పరుగులకు కట్టడి చేసి ఉంటే బాగుండేదన్నాడు. ఐదో రోజున ఈ పిచ్ పై 200 పరుగుల కంటే ఎక్కువ లక్ష్యాన్ని నిర్దేశించి ఉంటే తాము గెలిచి ఉండేవాళ్లమని చెప్పుకొచ్చాడు.
ఇక ఆస్ట్రేలియా అద్భుతమైన జట్టు అని, ఆ జట్టులో నాణ్యమైన ఆటగాళ్లు ఉన్నారన్నాడు. వారికి ఖచ్చితంగా గెలుపు క్రెడిట్ ఇవ్వాల్సిందేనని అన్నాడు. ఇక వాస్తవం చెప్పాలంటే తాము ఈ సిరీస్‌లో ఇంకాస్త మెరుగ్గా రాణించాల్సి ఉందన్నాడు. ఈ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటామన్నాడు. అయితే.. లోపాలను సమీక్షించుకోవడానికి ఇది సరైన సమయం కాదన్నాడు. దీనికి చాలా సమయం ఉందన్నాడు. మరో ఆరు నెలలు అంటే జూన్‌లోనే తాము మళ్లీ టెస్టులు ఆడనున్నామన్నాడు. అప్పటి కల్లా తప్పులను సరిదిద్దుకుంటామని చెప్పాడు.
Jemimah Rodrigues : అందాల జెమిమా.. చందమామే నిన్ను చూస్తే చిన్నబోవునమ్మా
సంక్షిప్త స్కోర్లు..
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ – 384 ఆలౌట్
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ – 567 ఆలౌట్
ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ – 342 ఆలౌట్
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ – 161/5
