T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్ కోసం న్యూజిలాండ్ జట్టు ఇదే.. వామ్మో 31 ఏళ్ల ఆటగాడికి చోటు..
టీ20 ప్రపంచకప్ కోసం న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు (T20 World Cup 2026) తమ జట్టును ప్రకటించింది.
T20 World Cup 2026 New Zealand squad announced
T20 World Cup 2026 : ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు టీ20 ప్రపంచకప్ జరగనుంది. భారత్, శ్రీలంక దేశాలు ఈ మెగాటోర్నీకి ఆతిధ్యం ఇవ్వనున్నాయి. ఈ మెగాటోర్నీలో పాల్గొనే అన్ని దేశాల క్రికెట్ బోర్డులు తమ తమ జట్లను ప్రకటిస్తున్నాయి. తాజాగా న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. మిచెట్ సాంట్నర్ నాయకత్వంలోనే కివీస్ బరిలోకి దిగనుంది. 15 మంది సభ్యులతో కూడిన బృందంలో 31 ఏళ్ల జాకెబ్ డఫీ చోటు దక్కించుకున్నాడు.
పేసర్లు ఫెర్గూసన్, హెన్రీ భాగస్వాములు టోర్నమెంట్ సమయంలో ప్రసవించనున్నందున, వారికి స్వల్పకాలిక పితృత్వ సెలవు మంజూరు చేయబడే అవకాశం ఉన్నట్లు సెలక్టర్లు తెలియజేయారు. కైల్ జామిసన్‌ను ట్రావెలింగ్ రిజర్వ్‌గా ఎంపిక చేశారు. 15 మంది సభ్యులలో ఎవరైనా గాయపడితే అప్పుడు కైల్ కు చోటు దక్కనుంది.
Shreyas Iyer : రీఎంట్రీలో ఇరగదీసిన శ్రేయస్ అయ్యర్.. 10 ఫోర్లు, 3 సిక్సర్లు
అఫ్గానిస్తాన్, యూఏఈ, దక్షిణాఫ్రికా, కెనడాలతో పాటు న్యూజిలాండ్ గ్రూప్ డిలో ఉంది. ఇక ఈ మెగాటోర్నీలో (T20 World Cup 2026) ఫిబ్రవరి 10న కివీస్ తన తొలి మ్యాచ్‌ను అఫ్గానిస్తాన్‌తో ఆడనుంది. చెన్నై వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.
Ready for India and Sri Lanka 🫡
Your BLACKCAPS squad for next month’s ICC Men’s T20 World Cup 🏆 #T20WorldCup pic.twitter.com/RQGQfDHh7X
— BLACKCAPS (@BLACKCAPS) January 6, 2026
Vijay Hazare Trophy : విజయ్ హజారేలో డబుల్ సెంచరీ..? ఎవరీ అమన్ రావ్? అమెరికాలో పుట్టి..
టీ20 ప్రపంచ కప్ 2026 కోసం న్యూజిలాండ్ జట్టు ఇదే..
మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), ఫిన్ అలెన్, మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, జాకబ్ డఫీ, లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, డారిల్ మిచెల్, ఆడమ్ మిల్నే, జేమ్స్ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, టిమ్ సీఫెర్ట్, ఇష్ సోధి.
ట్రావెలింగ్ రిజర్వ్,. కైల్ జామిసన్
