Vijay Hazare Trophy : విజయ్ హజారేలో డబుల్ సెంచరీ..? ఎవరీ అమన్ రావ్? అమెరికాలో పుట్టి..
విజయ్ హజారే ట్రోఫీలో బెంగాల్‌తో మ్యాచ్‌లో హైదరాబాదీ బ్యాటర్ అమన్ రావ్ (Vijay Hazare Trophy) డబుల్ సెంచరీతో దుమ్ములేపాడు.
Who is Aman Rao USA born Hyderabad cricketer smashes Vijay Hazare 200 with six (pic credit Jiohotstar Screengrab)
- విజయ్ హజారేలో డబుల్ సెంచరీ చేసిన అమన్ రావ్
- చివరి బంతి సిక్స్ కొట్టి
- లిస్ట్ ఏ క్రికెట్‌లో ద్విశతకం బాదిన తొలి హైదరాబాదీ ఆటగాడు
Vijay Hazare Trophy : విజయ్ హజారే ట్రోఫీలో బెంగాల్‌తో మ్యాచ్‌లో హైదరాబాదీ బ్యాటర్ అమన్ రావ్ డబుల్ సెంచరీతో దుమ్ములేపాడు. మహ్మద్ షమీ, ఆకాశ్ దీప్ వంటి అంతర్జాతీయ పేసర్లను సైతం అలవోకగా ఎదుర్కొంటూ అజేయ ద్విశతకంతో సత్తా చాటాడు. ఈ క్రమంలో అతడు హైదరాబాద్ తరుపున లిస్ట్ ఏ క్రికెట్‌లో డబుల్ సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు. ఇక ఓవరాల్ గా తొమ్మిదో ప్లేయర్‌గా నిలిచాడు. ఇక లిస్ట్ ఏ క్రికెట్‌లో అమన్ రావ్‌కు ఇదే తొలిసారి సెంచరీ కాగా.. అతడి కెరీర్‌లో మూడో మ్యాచ్‌లోనే దీన్ని అందుకోవడం విశేషం.
విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా మంగళవారం హైదరాబాద్, బెంగాల్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన హైదరాబాద్ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లు అమన్ రావ్ (200 నాటౌట్ ; 154 బంతుల్లో 12 ఫోర్లు, 13 సిక్సర్లు) అజేయ ద్విశతకం బాదగా గహ్లోత్ రాహుల్ సింగ్ (65 ; 54 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్ల), కెప్టెన్ తిలక్ వర్మ (34) రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 352 పరుగులు చేసింది. బెంగాల్ బౌలర్లలో షమీ మూడు వికెట్లు తీశాడు.
Mustafizur Rahman : రూ.9.20 కోట్ల మొత్తంలో ముస్తాఫిజుర్ రెహమాన్‌కు ఎంత వస్తుందో తెలుసా?
🚨 21-YEAR-OLD AMAN RAO SMASHED 200* RUNS FROM JUST 154 BALLS IN VIJAY HAZARE TROPHY 🚨
– Rajasthan Royals got Aman for just 30 Lakhs in the auction. pic.twitter.com/vET7iQOtHD
— Johns. (@CricCrazyJohns) January 6, 2026
అమెరికాలో పుట్టి హైదరాబాద్‌లో పెరిగిన అమన్ రావు బెంగాల్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. షమీ, ముకేశ్ కుమార్, ఆకాశ్ దీప్ బౌలింగ్‌లో ఎనిమిది సిక్సర్లతో సహా 120 పరుగులు చేశాడు. 65 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా, 108 బంతుల్లో తన మొదటి సెంచరీని అందుకున్నాడు. ఆ తరువాత అతడు మరింత చెలరేగాడు. ఇంకో 46 బంతుల్లో అతడు డబుల్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అతడు ఇన్నింగ్స్ ఆఖరి బంతికి సిక్స్ కొట్టి డబుల్ సెంచరీని అందుకోవడం విశేషం.
T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్‌ను బంగ్లాదేశ్ బహిష్కరిస్తే ఏం జరుగుతుంది?
ఐపీఎల్లో రాజస్థాన్‌కు..
ఇటీవల ముగిసిన ఐపీఎల్ మినీ వేలంలో అమన్ రావ్‌ను రాజస్థాన్ రాయల్స్ రూ.30లక్షలకు అతడిని సొంతం చేసుకుంది. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో హార్డ్ హిట్టర్‌గా పేరున్న అమన్‌రావ్ ఐపీఎల్ 2026 సీజన్‌లో ఎంతటి విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడతాడో వేచి చూడాల్సిందే.
