Mustafizur Rahman : రూ.9.20 కోట్ల మొత్తంలో ముస్తాఫిజుర్ రెహమాన్‌కు ఎంత వస్తుందో తెలుసా?
కేకేఆర్ తమ జట్టు నుంచి ముస్తాఫిజుర్‌ను (Mustafizur Rahman ) విడుదల చేయడంతో అతడికి ఎంత నగదు వస్తుంది అన్న దానిపై సర్వత్రా ఆసక్తి ఉంది.
Mustafizur Rahman is unlikely to receive any financial compensation after being released by KKR
- జట్టు నుంచి రిలీవ్ చేసిన కేకేఆర్
- వేలంలో 9.20 మొత్తానికి కొనుగోలు
- ముస్తాఫిజుర్‌కు ఇప్పుడు ఎంత వస్తుంది?
Mustafizur Rahman : బంగ్లాదేశ్‌లో ఇటీవల రాజకీయ అనిశ్చితి నెలకొంది. ఈ క్రమంలో ఆ దేశంలో హిందువులపై దాడులు జరుగుతున్నాయి. ఈ దాడుల్లో పలువురు హిందువులు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌లో బంగ్లాదేశ్ ప్లేయర్లను నిషేదించాలనే డిమాండ్లు వస్తున్నాయి.
ఇక కోల్‌కతా నైట్‌రైడర్స్ బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్ (Mustafizur Rahman ) ను ఐపీఎల్ 2026 మినీ వేలంలో 9.20 కోట్లకు కొనుగోలు చేయగా.. నిషేదం విధించాలనే డిమాండ్ల నేపథ్యంలో అతడిని రిలీజ్ చేయమని కేకేఆర్ జట్టును బీసీసీఐ ఆదేశించింది. బీసీసీఐ ఆదేశాల నేపథ్యంలో కేకేఆర్ జట్టు ముస్తాఫిజుర్ ను విడుదల చేసింది.
ఈ నిర్ణయం పై బంగ్లాదేశ్ ప్రభుత్వం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. తమ దేశంలో ఐపీఎల్ ప్రసారాలను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అదే సమయంలో భద్రతా కారణాల రీత్యా భారత్‌లో తమ జట్టు ఆడాల్సిన టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లను శ్రీలంకకు తరలించాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఐసీసీని కోరింది.
ముస్తాఫిజుర్‌కు ఎంత వస్తుంది?
ఇక ఇప్పుడు అందరి దృష్టి ముస్తాఫిజుర్‌కు ఎంత నగదు వస్తుంది అన్న దానిపైనే ఉంది. వేలంలో అతడిని కేకేఆర్ 9.20 కోట్లకు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే.. అతడు క్రికెట్‌కు సంబంధం లేని కారణంగా ఐపీఎల్‌కు దూరం కావడంతో అతడికి ఎలాంటి పరిహారం పొందే ఛాన్స్ లేదని తెలుస్తోంది.
T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్‌ను బంగ్లాదేశ్ బహిష్కరిస్తే ఏం జరుగుతుంది?
వాస్తవానికి ఐపీఎల్‌లో ఆటగాళ్లు పొందే జీతాలకు బీమా ఉంటుంది. విదేశీ ఆటగాళ్లు ఫ్రాంచైజీ శిబిరంలో చేరిన తరువాత లేదంటే టోర్నీ జరిగే సమయంలో గాయపడితే అప్పుడు ఫ్రాంఛైజీ పరిహరం ఇస్తుంది. సాధారణంగా 50 శాతం వరకు బీమా నుంచి చెల్లిస్తారు.
ముస్తాఫిజుర్ పరిస్థితి ‘ఫోర్స్ మేజ్యూర్’ కిందకు వస్తుంది. దీని ప్రకారం అదుపులో లేని అసాధారణ పరిస్థితులు ఎదురైనప్పుడు ఒప్పంద బాధ్యతల నుంచి మినహాయింపు లభిస్తుంది. బీసీసీఐ ఆదేశాల మేరకే ముస్తాఫిజుర్ తప్పుకుంటున్నందున, అతని పట్ల ఒప్పంద బాధ్యతలను నెరవేర్చాల్సిన అవసరం నైట్ రైడర్స్ యాజమాన్యానికి ఉండదు. అంటే కేకేఆర్ ఒక్క రూపాయి కూడా అతడికి ఇవ్వదు. అటు బీమా సంస్థ కూడా ఎలాంటి నగదు ఇవ్వదు.
ఇక ముస్తాఫిజుర్‌కు ఉన్న ఏకైక మార్గం చట్ట పరంగా నష్టపరిహారం కోరడం. అయితే.. అతడు న్యాయ స్థానాన్ని ఆశ్రయించే అవకాశాలు తక్కువ. అతడి వయసు ప్రస్తుతం 30 సంవత్సరాలు మాత్రమే. అతడు మరో నాలుగు లేదా ఐదేళ్ల పాటు క్రికెట్ ఆడే అవకాశం ఉంది. ఈ సారి కోల్పోయిన ఆదాయాన్ని వచ్చే ఏడాది ఐపీఎల్ ద్వారా పొందే అవకాశం ఉంది. అలా కాకుండా న్యాయ పరంగా అతడు ముందుకు వెళితే అది అతడికి ఐపీఎల్ కెరీర్‌కు నష్టంగా మారొచ్చునని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
