AUS vs ENG : శతకాలతో చెలరేగిన స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్.. సిడ్నీ టెస్టులో పట్టుబిగించిన ఆస్ట్రేలియా..
సిడ్నీ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టు మ్యాచ్‌లో(AUS vs ENG) ఆస్ట్రేలియా పట్టు బిగించింది.
AUS vs ENG 5th Test Day 3 Stumps Australia lead by 134 runs
- శతకాలతో చెలరేగిన స్మిత్, హెడ్
- సిడ్నీ టెస్టులో పట్టుబిగించిన ఆస్ట్రేలియా
AUS vs ENG : యాషెస్ సిరీస్‌లో భాగంగా సిడ్నీ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా పట్టు బిగించింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ ఏడు వికెట్ల నష్టానికి 518 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆసీస్ 134 పరుగుల ఆధిక్యంలో ఉంది. స్టీవ్ స్మిత్ (129), బ్యూ వెబ్‌స్టర్ (42) లు క్రీజులో ఉన్నారు.
ఓవర్ నైట్ స్కోరు 166/2 తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్ ను ఆసీస్ (AUS vs ENG) కొనసాగించింది. 91 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజును ఆటను కొనసాగించిన ట్రావిస్ హెడ్ ఇంగ్లాండ్ బౌలర్లపై తన దూకుడు కొనసాగించాడు. ఈ క్రమంలో టెస్టుల్లో తన 12వ సెంచరీని నమోదు చేశాడు. ఈ యాషెస్ సిరీస్‌లో అతడికి ఇది మూడో సెంచరీ.
T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్‌ను బంగ్లాదేశ్ బహిష్కరిస్తే ఏం జరుగుతుంది?
నైట్ వాచ్‌మన్ మైఖేల్ నెసర్ (24) త్వరగానే ఔట్ అయినప్పటికి కూడా కెప్టెన్ స్టీవ్ స్మిత్ తో కలిసి హెడ్ ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈక్రమంలో 150 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. అతడు ఈజీగా డబుల్ సెంచరీ చేసేలా కనిపించినప్పటికి అతడి జోరుకు జాకెబ్ బెథెల్ బ్రేక్ వేశాడు. హెడ్‌ను ఎల్బీ డబ్ల్యూగా ఔట్ చేశాడు.
Tons for Travis Head and Steve Smith in an incredible day three 🤩#Ashes blog: https://t.co/jfYWTZcXop pic.twitter.com/aztfAziJqk
— cricket.com.au (@cricketcomau) January 6, 2026
హెడ్ పెవియన్‌కు చేరుకున్నప్పటికి కూడా ఉస్మాన్ ఖవాజా (17), అలెక్స్ కేరీ (16), కామెరూన్ గ్రీన్ (37)లతో కలిసి స్మిత్ ఇంగ్లాండ్ స్కోరును అధిమించి ఆసీస్‌కు ఆధిక్యాన్ని అందించాడు. ఇక బ్యూ వెబ్‌స్టర్ తో అభేద్యమైన ఎనిమిదో వికెట్ కు 81 పరుగులు జోడించాడు.
Sakshi Dhoni : ఎంఎస్ ధోని, సాక్షి రొమాంటిక్ పార్టీ ఫోటోలు.. వైరల్
ఇక ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 384 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.
