T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్‌ను బంగ్లాదేశ్ బహిష్కరిస్తే ఏం జరుగుతుంది?
టీ20 ప్రపంచకప్‌ను బంగ్లాదేశ్ బహిష్కరిస్తే ఏం జరుగుతుంది (T20 World Cup 2026) అన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది.
What will happen if Bangladesh pull out of T20 World Cup 2026
- భారత్‌లో టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లను ఆడం అని చెప్పిన బంగ్లాదేశ్
- ఐసీసీ నిర్ణయం పై సర్వత్రా ఉత్కంఠ
- నిర్ణయం అనుకూలంగా రాకుంటే టీ20 ప్రపంచకప్2026 బంగ్లాదేశ్ బహిష్కరిస్తుందా?
T20 World Cup 2026 : భద్రతా కారణాల దృష్ట్యా టీ20 ప్రపంచకప్2026లో తమ దేశం ఆడే మ్యాచ్‌లను భారత్ నుంచి శ్రీలంకకు తరలించాలని ఐసీసీని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కోరింది. బంగ్లా పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను ఐపీఎల్‌లో ఆడించకూడదని బీసీసీఐ నిర్ణయం తీసుకున్న ఒక రోజు తరువాత ఈ మేరకు బంగ్లాదేశ్ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఇక ఇప్పుడు అందరి దృష్టి ఐసీసీ ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుందా అన్న దానిపైనే ఉంది.
బంగ్లాకు అనుకూలంగా ఐసీసీ నిర్ణయం తీసుకుంటే..?
ఒకవేళ ఐసీసీ బంగ్లాదేశ్ కు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే అప్పుడు చాలా సవాళ్లు ఎదురు అవుతాయని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా లాజిస్టికల్ సవాళ్లు ఎదురవుతాయన్నారు. అదే సమయంలో టీ20 ప్రపంచకప్ షెడ్యూల్‌లో గంగరగోళం ఏర్పడుతుందన్నారు. ఇప్పటికే టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల కావడంతో అభిమానులు, ఆటగాళ్ల ప్రయాణాలకు సంబంధించిన టికెట్లను ఇప్పటికే బుక్ చేసుకుని ఉంటారు.
Rohit Sharma : సోమవారమే మొదలెట్టిన రోహిత్ శర్మ.. న్యూజిలాండ్‌కు ఇక దబిడి దిబిడే..
షెడ్యూల్ ప్రకారం బంగ్లాదేశ్ లీగ్ మ్యాచ్‌లను భారత్‌లో ఆడాల్సి ఉంది. కోల్‌కతాలో మూడు మ్యాచ్‌లు, ముంబైలో ఓ మ్యాచ్ ఆడనుంది.
బంగ్లాదేశ్ ప్రపంచ కప్‌ను బహిష్కరించగలదా?
ఒకవేళ బంగ్లాదేశ్ విజ్ఞప్తిని ఐసీసీ తిరస్కరిస్తే అప్పుడు ఏం జరుగుతుంది అన్న దానిపైనే సర్వత్రా ఆసక్తి ఉంది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు టీ20 ప్రపంచకప్ ను బహిష్కరించవచ్చు. అయితే.. అది అంత సులభం కాదని అంటున్నారు. అప్పుడు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చాలా పరిణామాలను ఎదుర్కొనాల్సి ఉంటుందని అంటున్నారు.
దాదాపు నెల రోజుల సమయం మాత్రమే ఉన్న సమయంలో బంగ్లా వైదొలిగితే అప్పుడు ఐసీసీ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు పై భారీ అంక్షలు విధించే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ టోర్నీ నుంచి వచ్చే ఆదాయాన్ని బంగ్లాదేశ్ కోల్పోతుంది.
ఒకవేళ బంగ్లాదేశ్ టోర్నీ నుంచి వైదొలిగితే.. అప్పుడు ఐసీసీ కొత్త జట్టుతో బంగ్లా స్థానాన్ని భర్తీ చేయవచ్చు. లేదంటే బంగ్లా ఆడాల్సిన మ్యాచ్‌ల్లో ప్రత్యర్థి జట్లను విజేతలుగా ప్రకటించవచ్చు.
కాగా.. కొత్త జట్టుతో భర్తీ చేయడం కాస్త కష్టంతో కూడుకున్న పని. ఎందుకంటే ఇప్పటికిప్పుడు కొత్త జట్టును ఎలా ఎంపిక చేయాలన్నది అతి పెద్ద అంశం. ఈసారి జట్లు తమ తమ ప్రాంతీయ క్వాలిఫయర్స్ ఆడిన తర్వాత టీ20 ప్రపంచకప్‌కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే.
