Rohit Sharma : సోమ‌వార‌మే మొద‌లెట్టిన రోహిత్ శ‌ర్మ‌.. న్యూజిలాండ్‌కు ఇక దబిడి దిబిడే..

టీమ్ఇండియా మాజీ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ (Rohit Sharma) ప్రాక్టీస్ మొద‌లెట్టాడు.

Rohit Sharma : సోమ‌వార‌మే మొద‌లెట్టిన రోహిత్ శ‌ర్మ‌.. న్యూజిలాండ్‌కు ఇక దబిడి దిబిడే..

Rohit Sharma sweats it out in nets ahead of New Zealand series

Updated On : January 6, 2026 / 11:44 AM IST
  • జన‌వ‌రి 11 నుంచి భార‌త్, న్యూజిలాండ్ వ‌న్డే సిరీస్‌
  • కివీస్‌తో సిరీస్‌కు ప్రాక్టీస్ మొద‌లెట్టిన రోహిత్ శ‌ర్మ‌
  • నెట్స్‌లో చెమ‌టోడ్చుతున్న హిట్‌మ్యాన్‌

Rohit Sharma : జ‌న‌వ‌రి 11 నుంచి భార‌త్, న్యూజిలాండ్ జ‌ట్ల మ‌ధ్య మూడు మ్యాచ్‌ల వ‌న్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ నేప‌థ్యంలో ఈ సిరీస్ కోసం టీమ్ఇండియా సీనియ‌ర్ ఆట‌గాడు రోహిత్ శ‌ర్మ త‌న స‌న్నాహ‌కాల‌ను మొద‌లుపెట్టాడు. కివీస్‌తో సిరీస్‌లో రాణించేందుకు నెట్స్‌లో తీవ్రంగా చెమ‌టోడ్చుతున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోను హిట్‌మ్యాన్ త‌న ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో అభిమానుల‌తో పంచుకున్నాడు.

అంత‌ర్జాతీయ క్రికెట్‌లో టెస్టులు, టీ20ల‌కు వీడ్కోలు ప‌లికిన రోహిత్ శ‌ర్మ (Rohit Sharma) ప్ర‌స్తుతం వ‌న్డేల‌ను మాత్ర‌మే ఆడుతున్న సంగ‌తి తెలిసిందే. 2027 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ ఆడ‌డ‌మే ల‌క్ష్యంగా అత‌డు ముందుకు సాగుతున్నాడు.

Vaibhav Suryavanshi : బుడ్డోడా ఏం బాదురా అయ్యా.. తొలి 15 ఫాస్టెస్ట్ హాఫ్ సెంచ‌రీల్లో 6 వైభ‌వ్ సూర్య‌వంశీవే..

ఈ క్ర‌మంలో గతేడాది వ‌న్డేల్లో అద్భుత విజ‌యాల‌ను అందుకున్నాడు. ఐసీసీ వ‌న్డే బ్యాట‌ర్ల‌ల ర్యాంకింగ్స్‌లో న‌వంబ‌ర్ 1 స్థానాన్ని కైవ‌సం చేసుకున్నాడు. ఇక ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ ఫైన‌ల్ మ్యాచ్‌లో 76 ప‌రుగులు సాధించి భార‌త్ విజేత‌గా నిల‌వ‌డంలో కీల‌క పాత్ర పోషించాడు.

Sakshi Dhoni : ఎంఎస్ ధోని, సాక్షి రొమాంటిక్ పార్టీ ఫోటోలు.. వైర‌ల్‌

14 వన్డే ఇన్నింగ్స్‌ల్లో 100కు పైగా స్ట్రైక్‌ రేట్ 50 కి పైగా స‌గ‌టుతో 650 పరుగులు సాధించాడు. ఇందులో రెండు శతకాలు, నాలుగు అర్ధ శతకాలున్నాయి. ఈ ఏడాది కూడా ఇదే ఫామ్‌ను కంటిన్యూ చేయాల‌ని హిట్‌మ్యాన్ ఆశిస్తున్నాడు.