Vaibhav Suryavanshi : బుడ్డోడా ఏం బాదురా అయ్యా.. తొలి 15 ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీల్లో 6 వైభవ్ సూర్యవంశీవే..
యూత్ వన్డేల్లో వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు.
Fastest half centurys in Youth odis vaibhav suryavanshi sets record
- యూత్ వన్డేల్లో అదరగొడుతున్న వైభవ్ సూర్యవంశీ
- బౌలర్లకు నిద్రలేని రాత్రుళ్లు..
- తొలి 15 ఫాస్టెస్ట్ హాప్ సెంచరీల్లో 6 మనోడివే
Vaibhav Suryavanshi : టీమ్ఇండియా నయా సంచలనం వైభవ్ సూర్యవంశీ అదరగొడుతున్నాడు. యూత్ వన్డేల్లో తన విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగుతున్నాడు. బెనోనిలోని విల్లోమూర్ పార్క్‌లో దక్షిణాఫ్రికా అండర్-19తో సోమవారం జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో కేవలం 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదేశాడు. యూత్ వన్డేల్లో ఇది ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీల్లో నాలుగోది కావడం విశేషం.
ఈ మ్యాచ్‌లో అతడు మొత్తంగా 24 బంతులు ఎదుర్కొని 10 సిక్సర్లు ఓ ఫోర్ సాయంతో 68 పరుగులు చేశాడు. అతడు ఈ మ్యాచ్‌లో సాధించిన మొత్తం పరుగుల్లో బౌండరీల రూపంలోనే 60 పరుగులు రావడం గమనార్హం.
Sakshi Dhoni : ఎంఎస్ ధోని, సాక్షి రొమాంటిక్ పార్టీ ఫోటోలు.. వైరల్
యూత్ వన్డేల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డు సౌతాఫ్రికాకు చెందిన స్టీవ్ స్టాల్క్ పేరిట ఉంది. అతడు 2024 జనవరి 27న స్కాట్లాండ్ అండర్-19 మ్యాచ్‌లో 13 బంతుల్లో హాఫ్ సెంచరీ బాదాడు. రెండో స్థానంలో టీమ్ఇండియా స్టార్ ఆటగాడు రిషబ్ పంత్ ఉన్నాడు. అతడు నేపాల్ అండర్-19 జట్టు పై 2016 ఫిబ్రవరి 1న 18 బంతుల్లో 52 పరుగులు చేశాడు.
ఇక అఫ్గానిస్తాన్ ఆటగాడు అజ్మతుల్లా ఒమర్జాయ్ మూడో స్థానంలో ఉన్నాడు. 2018 జనవరి 25న న్యూజిలాండ్ అండర్-19 జట్టు పై 19 బంతుల్లో 54 పరుగులు చేశాడు.
తొలి 15 ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీల్లో 6..
మొత్తంగా యూత్ వన్డేల్లో తొలి 15 ఫాస్టెస్ట్ సెంచరీ జాబితాలో 6 వైభవ్ సూర్యవంశీ పేరు మీదనే ఉన్నాయి. సోమవారం సౌతాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో 19 బంతుల్లో హాఫ్ సెంచరీ బాదగా.. గతంలో 20, 24, 25, 30 బంతుల్లోనే వైభవ్ సూర్యవంశీ హాఫ్ సెంచరీలు బాదాడు.
