6,6,6,4,6,6.. ఐపీఎల్‌లో అన్‌సోల్డ్.. కట్ చేస్తే.. జానీ బెయిర్ స్టో ఊచకోత..
సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో కేశవ్ మహరాజ్ (Jonny Bairstow) బౌలింగ్‌లో ఒకే ఓవర్‌లో 34 పరుగులను పిండుకున్నాడు జానీ బెయిర్ స్టో
SA20 Jonny Bairstow smashes Maharaj for 34 runs in an over
- ఐపీఎల్‌లో అన్‌సోల్ట్
- సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో జానీ బెయిర్ స్టో విధ్వంసం
- కేశవ్ మహరాజ్ బౌలింగ్‌లో ఒకే ఓవర్‌లో 34 పరుగులు
Jonny Bairstow : సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఇంగ్లాండ్ వెటరన్ ఆటగాడు జానీ బెయిర్ స్టో దుమ్ములేపుతున్నాడు. సన్‌రైజర్స్ ఈస్ట్రన్‌కేప్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్ ప్రిటోరియా క్యాపిటల్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో బౌలర్ల పై విరుచుకుపడ్డాడు. కేవలం 45 బంతుల్లోనే 8 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 85 పరుగులతో అజేయంగా నిలిచాడు.
ఒకే ఓవర్‌లో 34 పరుగులు..
సన్‌రైజర్స్ ఈస్ట్రన్‌కేప్ ఇన్నింగ్స్ 12వ ఓవర్‌లో జానీ బెయిర్ స్టో (Jonny Bairstow ) పూనకం వచ్చినట్లు చెలరేగిపోయాడు. స్పిన్నర్ కేశవ్ మహరాజ్ ఈ ఓవర్‌ను వేశాడు. తొలి బంతికి సిక్స్ కొట్టి హాప్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు జానీ బెయిర్ స్టో. ఆ తరువాత మరో రెండు సిక్సర్లు బాదాడు. నాలుగో బంతికి ఫోర్ కొట్టగా.. చివరి రెండు బంతులను సిక్సర్లుగా మలిచాడు. దీంతో ఈ ఓవర్‌లో (6,6,6,4,6,6) మొత్తం 34 పరుగులు వచ్చాయి.
BCCI : బీసీసీఐతో ఏ సమాచారాన్ని పంచుకోవడం లేదు.. బీసీబీ అధ్యక్షుడు అమీనుల్ ఇస్లాం
ఇదిలా ఉంటే.. బెయిర్ స్టోను ఐపీఎల్ 2026 మినీ వేలంలో ఎవ్వరూ తీసుకోలేదు. రూ కోటీ బేస్ ప్రైస్‌తో వేలంలో అడుగుపెట్టిన అతడి కోసం ఏ ఫ్రాంఛైజీ ఆసక్తి చూపించలేదు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో ప్రిటోరియా క్యాపిటల్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. ప్రిటోరియా బ్యాటర్లలో కానర్ ఎస్టర్‌హుయిజెన్ (52), షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ (47నాటౌట్) రాణించారు. సన్‌రైజర్స్ బౌలర్లలో అన్రిచ్ నార్ట్జే మూడు వికెట్లు తీశాడు. ఆడమ్ మిల్నే రెండు వికెట్లు పడగొట్టాడు.
Vaibhav Suryavanshi : వైభవ్ సూర్యవంశీ సిక్సర్ల వర్షం.. 24 బంతులు ఆడితే 10 సిక్సర్లే..
ఆ తరువాత క్వింటన్ డికాక్ (79 నాటౌట్; 41 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లు), జానీ బెయిర్ స్టో (85 నాటౌట్; 45 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లు) హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో 177 పరుగుల లక్ష్యాన్ని సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ 14.2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా ఛేదించింది.
