BCCI : బీసీసీఐతో ఏ సమాచారాన్ని పంచుకోవడం లేదు.. బీసీబీ అధ్యక్షుడు అమీనుల్ ఇస్లాం
తాము బీసీసీఐతో (BCCI) ఎలాంటి సమాచారాన్ని పంచుకోవడం లేదని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు అమీనుల్ ఇస్లాం తెలిపాడు.
We are not communicating with BCCI says Aminul Islam
BCCI : బీసీసీఐ ఆదేశాలతో ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్.. బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను జట్టు నుంచి విడుదల చేసింది. దీనిపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. భారత్‌లో టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లను ఆడేది లేదని స్పష్టం చేసింది. శ్రీలంక వేదికగా తమ జట్టు ఆడే మ్యాచ్‌లను నిర్వహించాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) ఐసీసీకి ఓ లేఖ రాసింది.
దీనిపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు అమీనుల్ ఇస్లాం మీడియాతో మాట్లాడుతూ ఐసీసీ సమాధానం తర్వాత తదుపరి కార్యాచరణ ఉంటుందని తెలిపారు.
Vaibhav Suryavanshi : వైభవ్ సూర్యవంశీ సిక్సర్ల వర్షం.. 24 బంతులు ఆడితే 10 సిక్సర్లే..
‘మేము ఐసీసీకి ఓ మెయిల్ చేశాము. అందులో మేము ఏమీ చెప్పాలని అనుకున్నామో అన్నింటిని స్పష్టంగా చెప్పాము. ఎందుకంటే మాకు భద్రత ఒక ప్రధాన ఆందోళనగా అనిపించింది. ఇక మా తదుపరి చర్య ఏమిటంటే ఐసీసీ పంపే సమాధానం పై ఆధారపడి ఉంటుంది. ఐసీసీ సమాధానం ఏంటో మాకు తెలియదు. ఏదీ ఏమైనప్పటికి మేము ఇచ్చిన నిబంధనలు MPO పరిధిలో ఉన్నాయి. ఇది (టీ20ప్రపంచకప్ )ఐసీసీ కార్యక్రమం కాబట్టి మేము వారితోనే కమ్యూనికేట్ చేస్తున్నాం. బీసీసీఐతో చేయడం లేదు.’ అని అమీనుల్ ఇస్లాం తెలిపాడు.
వాస్తవానికి టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ ప్రకారం బంగ్లాదేశ్ తమ లీగ్ మ్యాచ్‌లను భారత్‌లో ఆడాల్సి ఉంది. ఇందులో మూడు మ్యాచ్‌లు కోల్‌కతా వేదికగా ఓ మ్యాచ్ ముంబై వేదికగా ఆడనుంది. కోల్‌కతా వేదికగా ఫిబ్రవరి 7న వెస్టిండీస్‌తో, 9న ఇటలీతో, 14న ఇంగ్లాండ్‌తో, ఫిబ్రవరి 17న ముంబయిలో నేపాల్‌తో బంగ్లాదేశ్ మ్యాచ్‌లను ఆడాల్సి ఉంది.
టీ20 ప్రపంచకప్ 2026 ఫిబ్రవరి 7న ప్రారంభం కానుంది. ఈ మెగాటోర్నీకి మరో నెలరోజుల సమయమే ఉండడంతో ఇప్పటికిప్పుడు వేదికలను మార్చడం చాలా కష్టం అని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు విజ్ఞప్తి పై ఐసీసీ ఎలా స్పందిస్తుందోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
