Joe Root : టెస్టుల్లో అత్యధిక పరుగుల రికార్డు.. సచిన్ కు చేరువగా రూట్.. అంతరం 2 వేల కంటే తక్కువే..
ఇంగ్లాండ్ సీనియర్ ఆటగాడు జో రూట్ (Joe Root) టెస్టు క్రికెట్‌లో అత్యధిక పరుగుల రికార్డుకు చేరువ అవుతున్నాడు.
Most runs in Tests Can Joe Root break Sachin Tendulkar record Gap down under 2000 runs
Joe Root : ఇంగ్లాండ్ సీనియర్ ఆటగాడు జో రూట్ టెస్టు క్రికెట్‌లో అత్యధిక పరుగుల రికార్డుకు చేరువ అవుతున్నాడు. టెస్టు క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు ప్రస్తుతం టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు జోరూట్ పేరిట ఉంది. ఈ జాబితాలో రూట్ ప్రస్తుతం రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.
యాషెస్ సిరీస్‌లో భాగంగా సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదో టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో రూట్ భారీ శతకాన్ని సాధించాడు. 160 పరుగులు చేశాడు. దీంతో టెస్టు క్రికెట్‌లో అత్యధిక పరుగుల రికార్డుకు చేరుకునేందుకు రూట్ కు 2 వేల కన్నా తక్కువ పరుగులే అవసరం.
ఐదో టెస్ట్ ఆరంభానికి ముందు రూట్ 162 టెస్ట్ మ్యాచ్‌ల్లో 13777 పరుగులు సాధించాడు. టెండూల్కర్ కంటే 2144 పరుగులు వెనుకబడి ఉన్నాడు. అయితే.. చివరి యాషెస్ టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో రూట్ 160 పరుగులు చేసి టెండూల్కర్‌కు మధ్య వ్యత్యాసాన్ని 1984 పరుగులకు తగ్గించాడు.
సచిన్ టెండూల్కర్ 200 టెస్టులు ఆడాడు. 329 ఇన్నింగ్స్‌ల్లో 53.78 సగటుతో 15921 పరుగులు సాధించాడు. ఇందులో 51 శతకాలు, 68 అర్ధశతకాలు ఉన్నాయి. తాజా మ్యాచ్‌తో కలిపి (రెండో ఇన్నింగ్స్ కాకుండా ) రూట్ 163 మ్యాచ్‌లు ఆడాడు. 51.23 సగటుతో 13937 పరుగులు చేశాడు. ఇందులో 41 శతకాలు, 66 సెంచరీలు ఉన్నాయి.
టెండూల్కర్ రికార్డును రూట్ అందుకుంటాడా?
టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టే ఏకైక వ్యక్తి అని రూట్ అని క్రికెట్ పండితులు విశ్లేషణలు చేస్తున్నారు. గత ఆరేడు సంవత్సరాలుగా అతడు టెస్టుల్లో భీకర ఫామ్‌లో ఉండడమే అందుకు కారణం. ప్రస్తుతం అతడి వయసు 35 సంవత్సరాలు కాగా.. అతడి ఫామ్, ఫిట్‌నెస్‌ను పరిగణలోకి తీసుకుంటే మరో రెండు ఏళ్లు ఈజీగా టెస్టులను ఆడగలడు.
Shreyas Iyer : ముంబై కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్.. కివీస్ సిరీస్‌కు ముందు అయ్యర్‌కు పరీక్షే..
2021 నుండి సంవత్సరం వారీగా టెస్టుల్లో రూట్ పరుగులు
* 2021లో 29 ఇన్నింగ్స్‌లలో 1708 పరుగులు
* 2022లో 27 ఇన్నింగ్స్‌లలో 1098 పరుగులు
* 2023లో 14 ఇన్నింగ్స్‌లలో 787 పరుగులు
* 2024లో 31 ఇన్నింగ్స్‌లలో 1556 పరుగులు
* 2025లో 18 ఇన్నింగ్స్‌లలో 805 పరుగులు
* 2026లో 1 ఇన్నింగ్స్‌లో 160 పరుగులు
సచిన్‌ను దాటడానికి రూట్‌కి ఎంత సమయం పట్టవచ్చు?
రూట్ తన చివరి 2000 టెస్ట్ పరుగులను 22 మ్యాచ్‌ల్లోనే చేశాడు. ఈ లెక్కన అతడు మరో 22 టెస్ట్‌లలో టెండూల్కర్‌ను రికార్డును బ్రేక్ చేయవచ్చు. రూట్ ప్రస్తుత టెస్ట్ సగటు 51.23. అతను ఈ సగటును కొనసాగిస్తే తదుపరి 39 ఇన్నింగ్స్‌లలో అతడు టెండూల్కర్ రికార్డును అధిగమిస్తాడు.
