ILT20 : ఇంటర్నేషనల్ లీగ్ T20 ఫైనల్ మ్యాచ్‌లో ఉద్రిక్తత.. నసీమ్ షా, కీరన్ పొలార్డ్‌ల మధ్య మాటల యుద్ధం..
ఆదివారం జరిగిన ఇంటర్నేషనల్ లీగ్ T20 ఫైనల్ మ్యాచ్‌లో ఉద్రిక్త వాతావరణం (ILT20) చోటు చేసుకుంది
ILT20 Final Kieron Pollard Charges At Pakistan Naseem Shah
- డెసర్ట్ వైపర్స్, ఎంఐ ఎమిరేట్స్ మధ్య ఇంటర్నేషనల్ లీగ్ T20 ఫైనల్ మ్యాచ్
- మ్యాచ్ మధ్యలో కీరన్ పొలార్డ్, నసీమ్ షాల మధ్య మాటల యుద్ధం..
ILT20 : దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఇంటర్నేషనల్ లీగ్ T20 ఫైనల్ మ్యాచ్‌లో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పాకిస్తాన్ పేస్ సంచలన నసీమ్ షా, వెస్టిండీస్ మాజీ ఆటగాడు కీరన్ పొలార్డ్‌ల మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. పరిస్థితి చేయి దాటిపోతుండడంతో అంపైర్లు, తోటి ఆటగాళ్లు జోక్యం చేసుకున్నారు.
ఆదివారం ఇంటర్నేషన్ లీగ్ టీ20 ఫైనల్ మ్యాచ్‌లో డెసర్ట్ వైపర్స్, ఎంఐ ఎమిరేట్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో డెసర్ట్ వైపర్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. డెసర్ట్ వైపర్స్ బ్యాటర్లలో సామ్ కరన్ (74 నాటౌట్; 51 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేశాడు. మాక్స్ హోల్డెన్ (41; 32 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. ఎంఐ బౌలర్లలో ఫజల్హాక్ ఫరూఖీ రెండు వికెట్లు తీశాడు.
Shreyas Iyer : ముంబై కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్.. కివీస్ సిరీస్‌కు ముందు అయ్యర్‌కు పరీక్షే..
అనంతరం 183 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు ఎంఐ బరిలోకి దిగింది. ఎంఐ ఇన్నింగ్స్ 11 ఓవర్‌లో ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఓవర్‌ను నసీమ్ షా వేశాడు. ఈ ఓవర్ లోని ఆఖరి బంతికి పొలార్డ్ షాట్ ఆడాలని ప్రయత్నించగా బంతి అతడి బ్యాట్ తాకుతూ ప్యాడ్లను తాకింది. ఈ సమయంలో పొలార్డ్ ను ఉద్దేశిస్తూ నసీమ్ షా ఏదో అన్నట్లుగా కనిపించింది.
ఏ మాత్రం తగ్గని పొలార్డ్ అతడికి గట్టిగానే బదులు ఇచ్చాడు. ఈ క్రమంలో వీరి మధ్య మాటల యుద్దం చోటు చేసుకుంది. పరిస్థితి చేయిదాటకముందే అంపైర్లు, తోటి ఆటగాళ్లు ఇద్దరి పక్కకు తీసుకువెళ్లారు.
పొలార్డ్ ను ఔట్ చేసి..
ఈ ఓవర్ తరువాత మళ్లీ ఇన్నింగ్స్ 17వ ఓవర్‌ను నసీమ్ షా వేశాడు. ఈ ఓవర్‌లోని తొలి బంతికి పొలార్డ్ షాట్ ఆడగా క్యాచ్ ఔట్ అయ్యాడు. ఇక ఈ మ్యాచ్‌లో కీలక పొలార్డ్‌ను ఔట్ చేయడమే కాకుండా తన నాలుగు ఓవర్ల స్పెల్‌లో మొత్తంగా 18 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు తీశాడు నసీమ్. ఈ క్రమంలో ఎంఐ జట్టు 18.3 ఓవర్లలో 136 పరుగులకే కుప్పకూలింది. దీంతో డెసర్ట్ వైపర్స్ 46 పరుగుల తేడాతో విజయం సాధించి తొలి సారి కప్పును ముద్దాడింది.
IPL 2026 : బంగ్లాదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. బంగ్లాలో ఐపీఎల్ ప్రసారాలపై నిషేధం..
HEATED MOMENT BETWEEN NASEEM SHAH & POLLARD IN ILT20 FINAL 🔥pic.twitter.com/dUuXWLkt5g
— junaiz (@dhillow_) January 4, 2026
