Shreyas Iyer : ముంబై కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్.. కివీస్ సిరీస్‌కు ముందు అయ్య‌ర్‌కు ప‌రీక్షే..

విజ‌య్ హ‌జారే ట్రోఫీలో ముంబయి ఆడాల్సిన చివరి రెండు లీగ్ మ్యాచ్‌లకు శ్రేయ‌స్ అయ్య‌ర్‌ను(Shreyas Iyer) కెప్టెన్‌గా నియమించారు

Shreyas Iyer : ముంబై కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్.. కివీస్ సిరీస్‌కు ముందు అయ్య‌ర్‌కు ప‌రీక్షే..

Vijay Hazare Trophy Shreyas Iyer named Mumbai captain

Updated On : January 5, 2026 / 4:00 PM IST
  • విజ‌య్ హ‌జారే ట్రోఫీలో ముంబయి కెప్టెన్‌గా శ్రేయ‌స్ అయ్య‌ర్‌
  • గాయం కార‌ణంగా రెగ్యుల‌ర్ కెప్టెన్ శార్దూల్ ఠాకూర్ దూరం

Shreyas Iyer : గాయం కార‌ణంగా కొద్ది రోజులుగా ఆట‌కు దూరంగా ఉన్న శ్రేయ‌స్ అయ్య‌ర్ బ‌రిలోకి దిగ‌నున్నాడు. బెంగ‌ళూరులోని సెంట‌ర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో రిహాబ్‌ను పూర్తి చేసుకున్నాడు. దేశ‌వాళీ వ‌న్డే టోర్నీ విజ‌య్ హ‌జారే ట్రోఫ్రీలో పాల్గొన‌నున్నాడు. ముంబై త‌రుపున బ‌రిలోకి దిగ‌నున్న అత‌డు జ‌న‌వ‌రి 6న హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌తో జ‌ర‌గ‌నున్న మ్యాచ్‌లో ఆడ‌నున్నాడు.

అయితే.. ఈ మ్యాచ్‌తో పాటు 8న పంజాబ్ తో జ‌ర‌గ‌నున్న మ్యాచ్‌కు సైతం ముంబై కెప్టెన్‌గా శ్రేయ‌స్ వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు. గాయం కార‌ణంగా రెగ్యుల‌ర్ కెప్టెన్ శార్దూల్ ఠాకూర్ ఈ టోర్నీ మొత్తానికి దూరం కావ‌డంతో ముంబై క్రికెట్ అసోసియేష‌న్ (ఎంసీఏ) ఈ నిర్ణ‌యం తీసుకుంది.

IPL 2026 : బంగ్లాదేశ్ ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం.. బంగ్లాలో ఐపీఎల్‌ ప్రసారాలపై నిషేధం..

‘విజయ్ హజారే ట్రోఫీలో మిగిలిన లీగ్ మ్యాచ్‌లకు ముంబై సీనియర్ పురుషుల జట్టుకు శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్‌గా నియమితుడయ్యాడని ప్రకటించడానికి MCA సంతోషంగా ఉంది.’ అని అసోసియేషన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది.

ప్ర‌స్తుతం ముందై ఐదు మ్యాచ్‌లు ఆడ‌గా నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచింది. ఎలైట్ గ్రూప్ సిలో 16 పాయింట్ల‌తో రెండో స్థానంలో ఉంది. లీగ్ ద‌శ‌లో మ‌రో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ రెండు మ్యాచ్‌ల్లో క‌నీసం ఒక్క‌దానిలో విజ‌యం సాధించిన ముంబై నాకౌట్‌కు అర్హ‌త సాధిస్తుంది.

ముంబైకే కాదు శ్రేయ‌స్ అయ్య‌ర్‌కు ఈ మ్యాచ్‌లు కీల‌కం..

ఈ మ్యాచ్‌లు ముంబై కే కాదు శ్రేయ‌స్ అయ్య‌ర్‌కు కూడా కీల‌కం కానున్నాయి. జ‌న‌వ‌రి 11 నుంచి న్యూజిలాండ్‌తో భార‌త్ మూడు మ్యాచ్‌ల వ‌న్డే సిరీస్ ఆడ‌నుంది. ఈ సిరీస్‌కు శ్రేయ‌స్ అయ్య‌ర్ ను ఎంపిక చేశారు.

Rohit Sharma : కారులో వెళ్తుండగా.. రోహిత్ శ‌ర్మ చెయ్యిప‌ట్టుకుని లాగిన ఫ్యాన్స్‌.. హిట్ మ్యాన్ వార్నింగ్.. వీడియో

అయితే.. ఫిట్‌నెస్ నిరూపించుకుంటేనే అత‌డు కివీస్ సిరీస్‌కు అందుబాటులో ఉంటాడ‌ని జ‌ట్టును ప్ర‌క‌టించ‌న సంద‌ర్భంలో సెల‌క్ట‌ర్లు స్ప‌ష్టం చేశారు. ఈ నేప‌థ్యంలో విజ‌య్ హ‌జారే ట్రోఫీలో శ్రేయ‌స్ పాల్గొన‌నున్న రెండు మ్యాచ్‌ల్లో అత‌డి ఫిట్‌నెన్ ను సెల‌క్టర్లు గ‌మ‌నించ‌నున్నారు.