Rohit Sharma : కారులో వెళ్తుండగా.. రోహిత్ శర్మ చెయ్యిపట్టుకుని లాగిన ఫ్యాన్స్.. హిట్ మ్యాన్ వార్నింగ్.. వీడియో
టీమ్ఇండియా సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మకు (Rohit Sharma,) సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Young fans misbehave with Rohit Sharma video viral
Rohit Sharma : టీమ్ఇండియా స్టార్ ఆటగాడు రోహిత్ శర్మకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానుల అతి కారణంగా ఇబ్బంది పడిన రోహిత్ శర్మ వారికి చిన్నపాటి వార్నింగ్ ఇచ్చాడు.
వీడియోలో ఏం ఉందంటే..?
రోహిత్ శర్మ (Rohit Sharma) కారులో ప్రయాణిస్తున్నాడు. కారులోంచి చేతిని బయట పెట్టి అభిమానులకు అభివాదం చేస్తున్నాడు. ఈ క్రమంలో కొందరు అభిమానులు అతడి చేతి పట్టుకుంటూ సెల్ఫీలు దిగుతున్నారు. ఈ క్రమంలో ఇద్దరు యువ అభిమానులు కాస్త అతిగా ప్రవర్తించారు. రోహిత్ శర్మ చేతిని లాగుతూ సెల్పీ దిగేందుకు ప్రయత్నించారు. దీంతో రోహిత్ కాస్త ఇబ్బందికి గురి అయ్యాడు. వెంటనే వారిని హెచ్చరించి కారు డోర్ అద్దాలను మూసి వేశాడు.
విజయ్ హజారే ట్రోఫీలో అదరగొట్టిన రోహిత్ శర్మ
టెస్టులు, టీ20లకు రిటైర్‌మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ ప్రస్తుతం వన్డేలు మాత్రమే ఆడుతున్నాడు. 2027 వన్డే ప్రపంచకప్ లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు లేని సమయంలో ఆటగాళ్లు అందరూ కూడా దేశవాళీ క్రికెట్ ఆడాలని బీసీసీఐ ఆదేశించిన నేపథ్యంలో రోహిత్ శర్మ ఇటీవల విజయ్ హజారే ట్రోఫీలో బరిలోకి దిగాడు. సిక్కింపై భారీ శతకం (155)తో చెలరేగాడు. ఆ తరువాత ఉత్తరాఖండ్ పై మాత్రం డకౌట్ అయ్యాడు.
కివీస్‌తో సిరీస్‌లో
జనవరి 11 నుంచి భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో పాల్గొనే భారత జట్టులో రోహిత్ శర్మ చోటు దక్కించుకున్నాడు. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న హిట్‌మ్యాన్ అదే జోష్‌ను ఈ ఏడాదిలోనూ కొనసాగించాలని ఆరాటపడుతున్నాడు.
Ambati Rayudu : ముచ్చటగా మూడోసారి తండ్రైన అంబటి రాయుడు.. 40 ఏళ్ల వయసులో
Rohit Sharma is the greatest player of india and misbehaving with him like this is totally inappropriate👍
— Gillfied⁷ (@Gill_Iss) January 4, 2026
2025లో 14 ఇన్నింగ్స్‌ల్లో 50 కిపైగా సగటు 100కు పైగా స్ట్రైక్‌రేటుతో 650 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, నాలుగు అర్థశతకాలు ఉన్నాయి.
