Ambati Rayudu : ముచ్చటగా మూడోసారి తండ్రైన అంబటి రాయుడు.. 40 ఏళ్ల వయసులో
టీమ్ఇండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు (Ambati Rayudu) ముచ్చటగా మూడోసారి తండ్రి అయ్యాడు
Ambati Rayudu becomes father Thrid Time
- మరోసారి తండ్రైన అంబటి రాయుడు
- పండంటి బాబుకు జన్మనిచ్చిన రాయుడు భార్య విద్య
- ఆనందంలో రాయుడి కుటుంబం
Ambati Rayudu : టీమ్ఇండియా మాజీ క్రికెటర్, తెలుగు తేజం అంబటి రాయుడు మరోసారి తండ్రి అయ్యాడు. ఆయన సతీమణి విద్య సోమవారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా స్వయంగా అంబటి రాయుడు తెలియజేశాడు. తన భార్య, కొడుకుతో తీసుకున్న సెల్ఫీ ఫోటోను అభిమానులతో పంచుకున్నాడు.
కొడుకు పుట్టాడు సంతోషంగా ఉందని ఆ ఫోటోకు రాయుడు (Ambati Rayudu) క్యాప్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్‌గా మారగా.. విషయం తెలుసుకున్న సహచర ఆటగాళ్లు, నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
2009లో అంబటి రాయుడు, విద్యకు పెళ్లైంది. ఈ దంపతులకు 2020 జూలైలో తొలి సంతానంగా ఆడపిల్ల పుట్టింది. ఆ పాపకు వివియా అనే పేరు పెట్టారు. ఇక 2023లో రెండో సారి కూడా కూతురే జన్మనించింది. ఇక తాజాగా 40 ఏళ్ల వయసులో రాయుడు మూడోసారి తండ్రి అయ్యాడు.
View this post on Instagram
2013లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన రాయుడు టీమ్ఇండియా తరుపున 55 వన్డేలు, 6 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. చివరి సారిగా అతడు 2019లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఇక 2023లో అన్ని ఫార్మాట్లకు రిటైర్‌మెంట్ ప్రకటించాడు. భారత్ తరుపున వన్డేల్లో 47.1 సగటుతో 1694 పరుగులు చేశాడు. ఇందులో 3 శతకాలు, 10 అర్థశతకాలు ఉన్నాయి. ఇక టీ20ల్లో 42 పరుగులు సాధించాడు. ఇక ఐపీఎల్‌లో 204 మ్యాచ్‌లు ఆడాడు. 28.2 సగటుతో 4348 పరుగులు సాధించాడు. ఇందులో ఓ సెంచరీ 22 అర్థశతకాలు ఉన్నాయి.
Sneh Rana : టీమ్ఇండియా ప్లేయర్‌కు ముద్దు పెడుతున్న బాలీవుడ్ నటి.. ఫోటోలు వైరల్..
ఇక క్రికెట్ కు వీడ్కోలు పలికిన తరువాత కామెంటేటర్ అవతారం ఎత్తాడు.
