Ambati Rayudu becomes father Thrid Time
Ambati Rayudu : టీమ్ఇండియా మాజీ క్రికెటర్, తెలుగు తేజం అంబటి రాయుడు మరోసారి తండ్రి అయ్యాడు. ఆయన సతీమణి విద్య సోమవారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా స్వయంగా అంబటి రాయుడు తెలియజేశాడు. తన భార్య, కొడుకుతో తీసుకున్న సెల్ఫీ ఫోటోను అభిమానులతో పంచుకున్నాడు.
కొడుకు పుట్టాడు సంతోషంగా ఉందని ఆ ఫోటోకు రాయుడు (Ambati Rayudu) క్యాప్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్‌గా మారగా.. విషయం తెలుసుకున్న సహచర ఆటగాళ్లు, నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
2009లో అంబటి రాయుడు, విద్యకు పెళ్లైంది. ఈ దంపతులకు 2020 జూలైలో తొలి సంతానంగా ఆడపిల్ల పుట్టింది. ఆ పాపకు వివియా అనే పేరు పెట్టారు. ఇక 2023లో రెండో సారి కూడా కూతురే జన్మనించింది. ఇక తాజాగా 40 ఏళ్ల వయసులో రాయుడు మూడోసారి తండ్రి అయ్యాడు.
2013లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన రాయుడు టీమ్ఇండియా తరుపున 55 వన్డేలు, 6 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. చివరి సారిగా అతడు 2019లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఇక 2023లో అన్ని ఫార్మాట్లకు రిటైర్‌మెంట్ ప్రకటించాడు. భారత్ తరుపున వన్డేల్లో 47.1 సగటుతో 1694 పరుగులు చేశాడు. ఇందులో 3 శతకాలు, 10 అర్థశతకాలు ఉన్నాయి. ఇక టీ20ల్లో 42 పరుగులు సాధించాడు. ఇక ఐపీఎల్‌లో 204 మ్యాచ్‌లు ఆడాడు. 28.2 సగటుతో 4348 పరుగులు సాధించాడు. ఇందులో ఓ సెంచరీ 22 అర్థశతకాలు ఉన్నాయి.
Sneh Rana : టీమ్ఇండియా ప్లేయర్‌కు ముద్దు పెడుతున్న బాలీవుడ్ నటి.. ఫోటోలు వైరల్..
ఇక క్రికెట్ కు వీడ్కోలు పలికిన తరువాత కామెంటేటర్ అవతారం ఎత్తాడు.