WTC points table 2027 update after Australia win 5th test against England pic credit (@CricCrazyJohns)
WTC points table 2027 : యాషెస్ సిరీస్‌లో భాగంగా సిడ్నీ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన చివరి టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. తద్వారా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 4-1తో కైవసం చేసుకుంది. ఈ విజయంతో ఆస్ట్రేలియా ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) 2025-27 పాయింట్ల పట్టికలో తన అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకుంది.
డబ్ల్యూటీసీ 2025-27 సైకిల్‌లో ఆస్ట్రేలియా ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో ఏడు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఓ మ్యాచ్‌లో ఓడిపోయింది. ఆ జట్టు విజయశాతం 87.50గా ఉంది. ఇక ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయిన ఇంగ్లాండ్ ఏడో స్థానంలో కొనసాగుతోంది.
WPL 2026 : డబ్ల్యూపీఎల్ 2026 ట్రోఫీతో కెప్టెన్ల ఫోజులు.. ఫోటోలు వైరల్
ప్రస్తుత సైకిల్‌లో ఇంగ్లాండ్ 10 మ్యాచ్‌లు ఆడగా మూడు మ్యాచ్‌ల్లో గెలుపొందింది. మరో 6 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఓ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఆ జట్టు విజయశాతం 31.67గా ఉంది. పాయింట్ల పట్టికలో ఇంగ్లాండ్ తరువాతి స్థానాల్లో బంగ్లాదేశ్, వెస్టిండీస్ జట్లు మాత్రమే వరుసగా ఎనిమిది, తొమ్మిది స్థానాల్లో ఉన్నాయి.
ఇక భారత జట్టు విషయానికి వస్తే.. ఇప్పటి వరకు టీమ్ఇండియా ఈ సైకిల్‌లో 9 టెస్టులు ఆడింది. ఇందులో నాలుగు మ్యాచ్‌ల్లో విజయం సాధించగా మరో నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఓ మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. విజయశాతం 48.15గా ఉంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో (WTC points table 2027) ఆరో స్థానంలో ఉంది.
Steve Smith : యాషెస్ గెలిచామన్న ఆనందాన్ని లేకుండా చేసిన స్టీవ్ స్మిత్..! ఇప్పుడెలా?
ఈ సైకిల్‌లో ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు మ్యాచ్‌లు గెలిచి మరో మ్యాచ్‌ను డ్రా చేసుకున్న న్యూజిలాండ్ జట్టు పట్టికలో రెండో స్థానంలో ఉంది. విజయ శాతం 77.78గా ఉంది. ఆ తరువాత సౌతాఫ్రికా, శ్రీలంక, పాకిస్తాన్‌లు వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నాయి.