Jay Shah : ఐసీసీ ఛైర్మన్‌ జై షా కామెంట్స్‌.. ఎవ‌రు ఏమ‌న్నా స‌రే.. నేను మాత్రం రోహిత్‌ను కెప్టెన్ అనే పిలుస్తా..

జై షా (Jay Shah) మాట్లాడుతూ రోహిత్ శ‌ర్మ‌ను తాను ఎప్పుడూ కూడా కెప్టెన్ అని పిలుస్తాన‌ని అన్నాడు.

Jay Shah : ఐసీసీ ఛైర్మన్‌ జై షా కామెంట్స్‌.. ఎవ‌రు ఏమ‌న్నా స‌రే.. నేను మాత్రం రోహిత్‌ను కెప్టెన్ అనే పిలుస్తా..

Jay Shah called our captain Rohit Sharma is sitting here

Updated On : January 9, 2026 / 12:25 PM IST
  • రోహిత్ శ‌ర్మ‌ను కెప్టెన్ అని పిలిచిన జైషా
  • చిరున‌వ్వులు చిందించిన హిట్‌మ్యాన్‌

Jay Shah : అంత‌ర్జాతీయ క్రికెట‌లో టెస్టులు, టీ20ల‌కు రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించిన రోహిత్ శ‌ర్మ ప్ర‌స్తుతం వ‌న్డేల‌ను మాత్ర‌మే ఆడుతున్నాడు. జ‌న‌వ‌రి 11 నుంచి న్యూజిలాండ్‌తో జ‌ర‌గ‌నున్న మూడు మ్యాచ్‌ల వ‌న్డే సిరీస్ కోసం రోహిత్ శ‌ర్మ సిద్ధం అవుతున్నాడు. కాగా.. హిట్‌మ్యాన్‌కు సంబంధించిన ఓ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఈ వీడియోలో బీసీసీఐ మాజీ కార్య‌ద‌ర్శి, ప్ర‌స్తుత ఐసీసీ అధ్య‌క్షుడు జై షా మాట్లాడుతూ రోహిత్ శ‌ర్మ‌ను తాను ఎప్పుడూ కూడా కెప్టెన్ అని పిలుస్తాన‌ని చెప్పుకొచ్చాడు. దీన్ని విన్న రోహిత్ శ‌ర్మ చిరు న‌వ్వులు చిందించాడు.

‘మా కెప్టెన్ ఇక్కడ కూర్చున్నాడు. నేను అతన్ని కెప్టెన్ అని పిలుస్తాను. ఎందుకంటే అత‌డు రెండు ఐసీసీ ట్రోఫీలు అందించాడు. 2023 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో భార‌త జ‌ట్టు వరుసగా 10 విజయాలను సాధించింది. ఫైన‌ల్ మ్యాచ్‌లో ఓడిపోయి ట్రోఫీని ముద్దాడ‌లేక‌పోయిన‌ప్ప‌టికి కూడా అభిమానుల హృద‌యాల‌ను గెలుచుకుంది. ఇక ఫిబ్ర‌వ‌రి 2024లో రాజ్‌కోట్‌లో ఓ విష‌యాన్ని రోహిత్ తో చెప్పాను. ఈ సారి మ‌నం అభిమానుల హృద‌యాల‌తో పాటు ట్రోఫీని గెలుచుకుంటాము.’ అని జైషా అన్నాడు.

Malaysia Open 2026 : గాయంతో త‌ప్పుకున్న య‌మ‌గూచి.. సెమీస్‌లో అడుగుపెట్టిన పీవీ సింధు..

జై షా తనను కెప్టెన్ అని పిలవడంతో రోహిత్ శర్మ ముఖం చిరునవ్వుతో వెలిగిపోయింది. ప్ర‌స్తుతం ఈ వీడియో వైర‌ల్‌గా మారింది.

WPL 2026 : డ‌బ్ల్యూపీఎల్ ఆరంభానికి ముందే గుజ‌రాత్ కు బిగ్ షాక్‌.. స్టార్ ప్లేయ‌ర్ దూరం.. ఆమె స్థానంలో ఎవ్వ‌రిని తీసుకోలేరు..

జనవరి 7న ముంబైలో జరిగిన యునైటెడ్ ఇన్ ట్రయంఫ్ కార్యక్ర‌మంలో జై షా ఈ మాట‌లు మాట్లాడిన‌ట్లుగా తెలుస్తోంది. ఈ కార్య‌క్ర‌మంలో భారతదేశానికి ప్రపంచ కప్ అందించిన‌ మూడు క్రికెట్ జట్లు – పురుషుల జట్టు, మహిళల జట్టు, అంధుల మహిళల జట్ల‌ను స‌త్క‌రించారు.

ప్ర‌స్తుతం భార‌త జ‌ట్టుకు రోహిత్ శ‌ర్మ కెప్టెన్ కాదు అన్న విష‌యం తెలిసిందే. ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025 విజేత‌గా భార‌త్‌ను నిలిపిన‌ప్ప‌టికి కూడా భ‌విష్య‌త్ ను దృష్టిలో ఉంచుకుని హిట్‌మ్యాన్‌ను కెప్టెన్సీ నుంచి త‌ప్పించారు. శుభ్‌మ‌న్ గిల్ కు ఆ బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించారు.