WPL 2026 RCB become the first team to advance to the playoffs (Pic credit@wplt20)
WPL 2026 : మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2026లో స్మృతి మంధాన నాయకత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఈ టోర్నీలో వరుసగా ఐదో విజయాన్ని నమోదు చేసి సగర్వంగా ప్లే ఆఫ్స్‌లో తన స్థానాన్ని ఖరారు చేసుకుంది. ఈ సీజన్‌లో ప్లే ఆఫ్స్ లో అడుగుపెట్టిన మొదటి జట్టుగా నిలిచింది. సోమవారం గుజరాత్ జెయింట్స్‌ను ఓడించి ఈ ఘనతను అందుకుంది.
ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. గౌతమి నాయక్ (73; 55 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీతో చెలరేగడంతో మొదట బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 178 పరుగులు సాధించింది. మిగిలిన వారిలో కెప్టెన్ స్మతి మంధాన (26), వికెట్ కీపర్ రిచా ఘోష్ (27)లు రాణించారు. గుజరాజ్ జెయింట్స్ బౌలర్లలో కాష్వీ గౌతమ్, ఆష్లీ గార్డనర్ లు చెరో రెండు వికెట్లు తీశారు. రేణుకా సింగ్ ఠాకూర్, సోఫీ డెవిన్ లు తలా ఓ వికెట్ సాధించారు.
Saina Nehwal : బ్యాడ్మింటన్‌కు సైనా నెహ్వాల్ రిటైర్‌మెంట్.. ‘రెండేళ్ల క్రితమే ఆడడం మానేశా..’
Playoffs spot booked. 📕
— Royal Challengers Bengaluru (@RCBTweets) January 19, 2026
ఆ తరువాత ఆష్లీ గార్డనర్ (54; 43 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించినప్పటికి మిగిలిన బ్యాటర్లు ఘోరంగా విఫలం కావడంతో 179 పరుగుల లక్ష్య ఛేదనలో గుజరాత్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 117 పరుగులకే పరిమితమైంది.
దీంతో ఆర్‌సీబీ 61 పరుగులు తేడాతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఆర్‌సీబీ బౌలర్లలో సయాలీ సత్ఘరే మూడు వికెట్లు తీసింది. నాడిన్ డి క్లర్క్ రెండు వికెట్లు పడగొట్టింది. లారెన్ బెల్, రాధా యాదవ్, శ్రేయాంక పాటిల్ లు తలా ఓ వికెట్ సాధించారు.
Kohli-Rohit : రోహిత్, కోహ్లీ భారత జెర్సీలో మళ్లీ కనిపించేది అప్పుడేనా?
Emphatic and 𝙥𝙡𝙖𝙮𝙤𝙛𝙛𝙨 𝙗𝙤𝙪𝙣𝙙! ❤️
Congratulations to 2⃣0⃣2⃣4⃣ #TATAWPL champions @RCBTweets on becoming the first team to reach the playoffs 👏🔝#KhelEmotionKa | #GGvRCB pic.twitter.com/QOH99joDQ5
— Women’s Premier League (WPL) (@wplt20) January 19, 2026