Saina Nehwal : బ్యాడ్మింటన్‌కు సైనా నెహ్వాల్ రిటైర్‌మెంట్..

భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ (Saina Nehwal ) ఆట‌కు వీడ్కోలు ప‌లికింది.

Saina Nehwal : బ్యాడ్మింటన్‌కు సైనా నెహ్వాల్ రిటైర్‌మెంట్..

Saina Nehwal announces retirement from badminton

Updated On : January 20, 2026 / 11:29 AM IST
  • బ్యాడ్మింటన్‌కు సైనా నెహ్వాల్ రిటైర్‌మెంట్
  • రెండేళ్ల నుంచే ఆట‌కు దూరంగా ఉంటూ వ‌స్తున్న సైనా
  • మోకాళ్ల స‌మ‌స్యే కార‌ణం

Saina Nehwal : భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ఆట‌కు వీడ్కోలు ప‌లికింది. గ‌త రెండేళ్లుగా బ్యాడ్మింట‌న్‌కు దూరంగానే ఉంటూ వ‌స్తున్న ఈ హైద‌రాబాదీ స్టార్ ప్లేయ‌ర్ సోమ‌వారం త‌న రిటైర్‌మెంట్ నిర్ణ‌యాన్ని తెలిపింది. దీర్ఘకాలిక మోకాలి నొప్పే త‌న నిర్ణ‌యానికి కార‌ణం అని చెప్పుకొచ్చింది. 2012 లండన్ ఒలింపిక్ కాంస్య పతక విజేత అయిన సైనా.. చివరిసారిగా 2023లో సింగపూర్ ఓపెన్‌లో పోటీలో పాల్గొంది.

తాను రిటైర్ అవుతున్నట్లు లాంఛనంగా ప్రకటించడం అవసరం లేద‌ని భావించ‌డంతోనే ఇన్నాళ్లు ఈ నిర్ణ‌యాన్ని బ‌య‌ట‌కు వెల్ల‌డించ‌లేద‌ని అంది. భారత మహిళల బ్యాడ్మింటన్‌లో ఎన్నో అత్యుత్తమ విజయాలు సాధించి, ఎంద‌రికో మార్గదర్శిగా నిలిచిన సైనా.. ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ ఈ విష‌యాన్ని తెలిపింది.

Dhanashree Verma : గ్రీన్ క‌ల‌ర్ డ్రెస్‌లో చ‌హ‌ల్ మాజీ భార్య అందాల విందు.. ఫోటోలు

‘నేను రెండు ఏళ్ల క్రిత‌మే ఆడ‌డం మానేశాను. నా అంత‌ట నేను ఆట‌లోకి వ‌చ్చాను. నా అంత‌ట నేను నిష్ర్క‌మిస్తున్నా. అందుక‌నే వీడ్కోలు నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించాల్సిన అవ‌రం లేద‌ని అనిపించింది. ఆడ‌గ‌లిగే సామ‌ర్థ్యం లేక‌పోతే క‌థ ముగిసిన‌ట్లే.’ అని సైనా అంది.

 

View this post on Instagram

 

A post shared by Subhojit Ghosh (@subhojitghosh25)


‘ఆర్థరైటిస్ వచ్చింది, కార్టిలేజ్ పూర్తిగా డ్యామేజ్ అయింది. పూర్తి స్థాయిలో ఆడలేనని నా తల్లిదండ్రులు, కోచ్‌లకు చెప్పాల్సి వచ్చింది. మ‌రేం ప‌ర‌వాలేదు. అభిమానులు కూడా సైనా ఆడ‌డం లేద‌ని క్ర‌మంగా అర్థం చేసుకుంటారు.’ అని అంది.

Shubman Gill : రోహిత్ శ‌ర్మ ఫామ్ పై శుభ్‌మ‌న్ గిల్ కామెంట్స్‌..

ఇంత‌క‌ముందు రోజుకు 8 నుంచి 9 గంట‌ల పాటు శిక్ష‌ణ తీసుకునేదాన్ని అని తెలిపింది. అయితే.. ఇప్పుడు తేలిక పాటి శిక్ష‌ణ‌కు కూడా మోకాళ్లు స‌హ‌క‌రించ‌డం లేద‌ని అంది. గంట‌, రెండు ప్రాక్టీస్ చేస్తేనే మోకాలు వాపు వ‌స్తోంద‌ని తెలిపింది. అందుక‌నే ఆడ‌లేను అని సైనా తెలిపింది.

కెరీర్‌ను దెబ్బ‌తీసిన గాయం..
2016 రియో ఒలింపిక్స్‌లో మోకాలి గాయం సైనా కెరీర్‌ను తీవ్ర ప్ర‌భావితం చేసింది. అయిన‌ప్ప‌టికి కూడా 2017లో ప్ర‌పంచ ఛాంపియ‌న్ షిప్‌లో కాంస్యం, 2018లో కామ‌న్వెల్త్ గేమ్స్‌లో స్వ‌ర్ణంతో బలమైన పునరాగమనం చేసినప్పటికీ గాయాలు ఆమెను వెంటాడాయి.