×
Ad

WPL 2026 Auction: భారత ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మ రికార్డ్.. భారీ ధరకు కొన్న యూపీ వారియర్స్.. ఆ సమయంలో ఆసక్తికర ఘటన

అమేలియా కెర్‌ను ముంబయి ఇండియన్స్ రూ.3 కోట్లకు కొనుగోలు చేసింది.

Deepti Sharma

WPL 2026 Auction: డబ్ల్యూపీఎల్ వేలం 2026 ఇవాళ జరుగుతోంది. భారత ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మను యూపీ వారియర్స్ రూ.3.20 కోట్లకు కొనుగోలు చేసింది. ఆమె కనీస ధర రూ.50 లక్షలు మాత్రమే.

ఆమెను ఆ ధరకు కొనడానికి ఢిల్లీ క్యాపిటల్స్‌ పోటీపడగా, యూపీ వారియర్స్‌ ఆర్‌టీఎమ్‌ కార్డును వాడింది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్‌ బిడ్‌ను రూ.3.20 కోట్లకు పెంచింది. అయినాసరే యూపీ అందుకు ఒప్పుకుని తీసుకుంది. ఇటీవల మహిళల ప్రపంచకప్‌లో దీప్తి శర్మ అద్భుతంగా ఆడింది. దీంతో ఆమెకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. (WPL 2026 Auction)

దీంతో డబ్ల్యూపీఎల్‌ చరిత్రలో ఇప్పటివరకు రెండో అత్యధిక ధరకు అమ్ముపోయిన క్రీడాకారిణిగా దీప్తి నిలిచింది. స్మృతి మంధాన గతంలో బెంగళూరు జట్టుకు రూ.3.4కోట్లకు అమ్ముడుపోయింది.

Also Read: డబ్ల్యూపీఎల్ 2026 షెడ్యూల్ వచ్చేసింది.. ఎప్పటినుంచి ఎప్పటివరకంటే?

అధిక ధరకు అమ్ముడుపోయింది వీళ్లే..

  • దీప్తి శర్మను రూ.3.20 కోట్లకు కొనుగోలు చేసిన యూపీ వారియర్స్
  • అమేలియా కెర్‌ను రూ.3 కోట్లకు కొనుగోలు చేసిన ముంబయి ఇండియన్స్
  • ప్లేయర్ సోఫీ డివైన్‌ను రూ.2 కోట్లకు కొనుగోలు చేసిన గుజరాత్‌
  • మెగ్ లానింగ్‌ను రూ.1.90 కోట్లకు కొనుగోలు చేసిన యూపీ వారియర్స్