Wrestlers protest: ఆసియన్ గేమ్స్‌‌లో ఆడనున్న భజరంగ్ పునియా, వినేశ్ ఫొగట్!

వారు ప్రాక్టీసులో పాల్గొనకపోయినప్పటికీ నేరుగా..

Wrestlers Bajrang Punia and Vinesh Phogat

Wrestlers protest – Bajrang Punia: బీజేపీ ఎంపీ, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ (Brij Bhushan Sharan Singh) లైంగిక వేధింపులపై పోరాటం చేసిన రెజ్లర్లు ఆసియన్ గేమ్స్‌(Asian Games)లో పాల్గొంటారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆందోళనలో పాల్గొన్న రెజ్లర్లు ప్రాక్టీసుకి దూరమయ్యారు. దీంతో వారిని ఆసియన్ గేమ్స్‌ కు పంపేందుకు నిబంధనలు ఒప్పుకుంటాయా? అన్న సందిగ్ధత నెలకొంది.

ఆసియన్స్ గేమ్స్ లో రెజ్లర్లు భజరంగ్ పునియా, వినేశ్ ఫొగట్ పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. వారు ప్రాక్టీసులో పాల్గొనకపోయినప్పటికీ నేరుగా ఆసియన్ గేమ్స్ లో పాల్గొనేందుకు అడ్ హక్ కమిటీ మినహాయింపు ఇచ్చింది. దీంతో వారు ఆసియన్ గేమ్స్ లో పాల్గొననున్నట్లు తెలుస్తోంది.

కాగా, రెజ్లర్ల ఆందోళనపై కొన్ని రోజుల క్రితం సాక్షి మాలిక్ మీడియాతో మాట్లాడుతూ… తమసమస్యలు తీరితేనే ఆసియన్ గేమ్స్‌ లో ఆడతామని చెప్పిన విషయం తెలిసిందే. తాము ప్రతిరోజు మానసికంగా చాలా క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నామని చెప్పింది. ఆసియా గేమ్స్ ఈ ఏడాది సెప్టెంబరు 19 నుంచి అక్టోబరు 8 వరకు చైనాలో జరుగుతాయి.

Virat Kohli: కోహ్లీ పేరు ఇంతలా మార్మోగిపోతోందేంటీ? స్పెయిన్‌ యువ సంచలనం అల్కరాజ్‌ వల్ల ఇప్పుడు ఈ వీడియో..