Wtc Final 2023 India Vs Australia (@BCCI)
WTC Final – Aus Vs Ind: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ చివరిరోజు భారత్ రాణించలేకపోయింది. ఆస్ట్రేలియా (Australia ) తొలి ఇన్నింగ్స్‌లో 469 పరుగులకు, టీమిండియా 296 పరుగులకు ఆలౌట్ అయిన విషయం తెలిసిందే.
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 270/8 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ స్కోరు 164/3గా ఉంది. భారత్ ఇవాళ 280 పరుగులు చేస్తే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ గెలిచే అవకాశాలు ఉన్నాయి. అయితే, భారత బ్యాటర్లు క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. 209 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది.
WTC Final 2023: వివాదాస్పద క్యాచ్‌పై స్పందించిన కామెరూన్ గ్రీన్.. కీలక వ్యాఖ్యలు చేసిన రికీ పాంటింగ్
టీమిండియా 209 పరుగుల తేడాతో ఘౌరంగా ఓడిపోయింది. చివరిరోజు ఆస్ట్రేలియా బౌలర్లను టీమిండియా బ్యాటర్లు ఎదుర్కోలేకపోయారు.
టీమిండియా తొమ్మిదో వికెట్ కోల్పోయింది. కేఎస్ భరత్ 23 పరుగులకు ఔటయ్యాడు. స్కోరు 224/9 (62 ఓవర్లకు)గా ఉంది.
టీమిండియా ఎనిమిదవ వికెట్ కోల్పోయింది. ఉమేశ్ యాదవ్ ఒక్క పరుగుకే ఔట్ అయ్యాడు. టీమిండియా స్కోరు 220/8 (60.3)గా ఉంది.
శార్దూల్ ఠాకూర్ డకౌట్ అయ్యాడు. టీమిండియా స్కోరు 213/7 (57.4)గా ఉంది.
నిలకడగా ఆడిన రహానె కూడా ఔటయ్యాడు. 46 పరుగులు చేసి మిచెల్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. టీమిండియా స్కోరు 57 ఓవర్లకు 213/6 గా ఉంది. విజయం కోసం 231 పరుగులు చేయాలి.
భారత్ స్కోరు 200 దాటింది. క్రీజులో రహానె 36, భరత్ 15 పరుగులతో ఉన్నారు. స్కోరు 201/5 (53 ఓవర్లకు)గా ఉంది. విజయానికి మరో 243 పరుగులు చేయాల్సి ఉంది.
కోహ్లీ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన జడేజా కూడా ఔట్ అయ్యాడు. స్కాట్ బౌలింగ్ లో జడేజా డకౌట్ గా వెనుదిరిగాడు. టీమిండియా స్కోరు 183/5 (47 ఓవర్లకు)గా ఉంది.
విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ మిస్ అయ్యాడు. 77 బంతుల్లో ఏడు ఫోర్లతో 49 పరుగులు చేశాడు. స్కాట్ బౌలింగ్ లో స్మిత్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. క్రీజులో రహానె 30 పరుగులతో ఉన్నాడు. మొదటి ఇన్నింగ్స్ లోనూ రహానె 89 పరుగులు చేసి టీమిండియాను ఆదుకున్న విషయం తెలిసిందే.
క్రీజులో కోహ్లీ 44, రహానె 20 పరుగులతో ఉన్నారు. టీమిండియా స్కోరు 41 ఓవర్ల నాటికి 165/3గా ఉంది.