WTC Final: కుటుంబాలతో సహా ఇంగ్లాండ్‌కు భారత ఆటగాళ్లు

ఇంగ్లాండ్‌లో మరికొన్ని రోజుల్లో న్యూజిలాండ్‌తో జరిగే ఐసిసి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్ మ్యాచ్ ఆడనుంది భారత్. ఈ క్రమంలో ఇంగ్లాండ్ బయలుదేరే ముందు ఆటగాళ్లకు BCCI పెద్ద ఉపశమనం ఇచ్చింది.

ICC World Test Championship: ఇంగ్లాండ్‌లో మరికొన్ని రోజుల్లో న్యూజిలాండ్‌తో జరిగే ఐసిసి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్ మ్యాచ్ ఆడనుంది భారత్. ఈ క్రమంలో ఇంగ్లాండ్ బయలుదేరే ముందు ఆటగాళ్లకు BCCI పెద్ద ఉపశమనం ఇచ్చింది. ఇంగ్లండ్ పర్యటన కోసం కుటుంబాన్ని వెంట తీసుకెళ్లడానికి భారత జట్టులోని ఆటగాళ్ళు, కోచింగ్ సిబ్బంది, సహాయక సిబ్బందికి ఆమోదం లభించింది.

భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటన మూడు నెలలకు పైగా కొనసాగుతుంది. భారత క్రికెట్ జట్టు న్యూజిలాండ్‌తో జరిగే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ చివరి మ్యాచ్ మరియు ఆగస్టు-సెప్టెంబర్‌లో ఇంగ్లాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. సమయం చాలా ఎక్కువగా ఉండడంతో.. ఈ మొత్తం ట్రిప్‌లో కుటుంబాలను తమతో ఉంచుకోవడానికి బీసీసీఐ అనుమతి ఇచ్చింది.

ఆటగాళ్ల కుటుంబాలు ఉండాలని అనుకున్నంత కాలం వారు వారితోనే ఉండగలరు. పర్యటన మొత్తం ఉండాలనుకున్నా కూడా వారు ఉండగలరు. భారత క్రికెటర్లు వారం రోజులు భారత్‌లో క్వారంటైన్‌లో ఉన్నప్పటికీ, ఇంగ్లాండ్‌లో అడుగు పెట్టిన తరువాత కూడా మూడురోజులు క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుంది. అంతేకాదు, ప్రతీఒక్కరు ఆర్టీపీసీఆర్ నెగెటివ్ సర్టిఫికెట్‌ను అధికారులకు అందజేయాల్సి ఉంటుంది. కుటుంబాలతో సహా వారి దేశానికి ఆటగాళ్లు రావడానికి UK ప్రభుత్వం ఇప్పటికే అనుమతి ఇచ్చింది.

జూన్ 22వ తేదీన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ ముగిసిన తరువాత.. ఇంగ్లాండ్‌తో తొలి టెస్ట్ స్టార్ట్ అవ్వడానికి మధ్య 42 రోజుల పాటు భారత జట్టు ఇంగ్లాండ్‌లో ఖాళీగా ఉంటుంది. ఆగస్టు 4వ తేదీన నాటింగ్‌హామ్‌లోని ట్రెంట్‌బ్రిడ్జ్‌లో మ్యాచ్‌లు స్టార్ట్ అయ్యి.. సెప్టెంబర్ 14వ తేదీన చివరి టెస్ట్ ముగుస్తుంది.

ట్రెండింగ్ వార్తలు