WTC Points Table 2027 update after India win over West Indies in second Test
WTC Points Table 2027 : ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) 2025-27లో భారత్ దూసుకుపోతుంది. ఈ సైకిల్‌లో భారత్ నాలుగో విజయాన్ని నమోదు చేసింది. ఢిల్లీ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో (WTC Points Table 2027) భారత్ తన మూడో స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది. పాయింట్ల పర్సంటేజీని 61.9కి పెంచుకుంది.
డబ్ల్యూటీసీ 2025-27 పాయింట్ల పట్టికలో ప్రస్తుతం ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉంది. ఇప్పటి వరకు ఆసీస్ ఈ సైకిల్‌లో మూడు మ్యాచ్‌లు ఆడగా మూడింటిలోనూ విజయం సాధించింది. తద్వారా 100 శాతం పాయింట్ల పర్సంటేజీతో తొలి స్థానంలో నిలిచింది. ఇక రెండో స్థానంలో శ్రీలంక ఉంది. లంక జట్టు రెండు మ్యాచ్‌లు ఆడగా ఓ మ్యాచ్‌లో గెలిచింది. మరో మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. లంక జట్టు 66.67 పాయింట్ల పర్సంటేజీని కలిగి ఉంది.
IND vs WI : వెస్టిండీస్ పై రెండో టెస్టులో భారత్ ఘన విజయం.. సిరీస్ క్లీన్‌స్వీప్..
ఇక నాలుగో స్థానంలో ఇంగ్లాండ్ నిలిచింది. ఇప్పటి వరకు ఇంగ్లాండ్ ఐదు మ్యాచ్‌లు ఆడగా రెండు మ్యాచ్‌ల్లో గెలిచింది. మరో రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఓ మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. 43.33 పాయింట్ల పర్సంటేజీని కలిగి ఉంది. ఐదో స్థానంలో బంగ్లాదేశ్ నిలిచింది. రెండు మ్యాచ్‌లు ఆడగా ఓ మ్యాచ్‌లో ఓడిపోగా మరో మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. 16.67 పాయింట్ల పర్సంటేజీని కలిగి ఉంది.
ఇక భారత్ చేతిలో సిరీస్ క్లీన్‌స్వీప్‌కు గురైన వెస్టిండీస్ ఆరో స్థానంలో నిలిచింది. విండీస్ ఈ సైకిల్‌లో 5 మ్యాచ్‌లు ఆడగా ఒక్క మ్యాచ్‌లోనూ విజయం సాధించలేదు. ఇక ఈ సైకిల్‌లో న్యూజిలాండ్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికాలు ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ ఆడలేదు.