Yashasvi Jaiswal fail : దులీప్ ట్రోఫీ సెమీస్‌.. య‌శ‌స్వి జైస్వాల్‌ విఫ‌లం.. తొలి ఓవ‌ర్‌లోనే..

సెంట్ర‌ల్ జోన్‌, సౌత్ జోన్ జ‌ట్ల మ‌ధ్య సెమీస్ మ్యాచ్ ప్రారంభ‌మైంది. ఓపెన‌ర్‌గా బ‌రిలోకి దిగిన య‌శ‌స్వి జైస్వాల్ (Yashasvi Jaiswal fail)..

Yashasvi Jaiswal just 4 runs in Duleep Trophy 2025 2nd Semi Final

Yashasvi Jaiswal fail : దులీప్ ట్రోఫీ 2025లో భాగంగా గురువారం సెంట్ర‌ల్ జోన్‌, సౌత్ జోన్ జ‌ట్ల మ‌ధ్య సెమీస్ మ్యాచ్ ప్రారంభ‌మైంది. శార్దూల్ ఠాకూర్ సార‌థ్యంలో వెస్ట్ జోన్ బ‌రిలోకి దిగ‌గా.. ర‌జ‌త్ పాటిదార్ నాయ‌క‌త్వంలో సౌత్ జోన్ ఆడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన వెస్ట్ జోన్ కెప్టెన్ శార్దూల్ ఠాకూర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

ఓపెన‌ర్‌గా బ‌రిలోకి దిగిన య‌శ‌స్వి జైస్వాల్ (4) తొలి ఇన్నింగ్స్‌లో ఘోరంగా విఫ‌లం (Yashasvi Jaiswal fail) అయ్యాడు. తొలి ఓవ‌ర్‌లోనే అత‌డు పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు. మూడు బంతులు ఆడిన జైస్వాల్ ఓ ఫోర్ కొట్టాడు. ఖ‌లీల్ అహ్మ‌ద్ బౌలింగ్‌లో ఎల్బీడ‌బ్బ్యూగా ఔట్ అయ్యాడు. మ‌రో ఓపెన‌ర్ హార్విక్ దేశాయ్ (1) కూడా విఫ‌లం కావ‌డంతో వెస్ట్ జోన్ 10 ప‌రుగుల‌కే రెండు వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది.

Don Bradman : క్రికెట్ చ‌రిత్ర‌లోనే ఈ బ్యాట‌ర్‌ను మించినోడు లేడు.. ఈ బ్యాట‌ర్ నెల‌కొల్పిన ఈ 8 రికార్డులు బ్రేక్ చేయ‌డం దాదాపుగా అసాధ్యం..!

6 ఓవ‌ర్లు ముగిసే సరికి వెస్ట్ జోన్ రెండు వికెట్ల న‌ష్టానికి 21 ప‌రుగులు చేసింది. ఆర్య దేశాయ్ (13), రుతురాజ్ గైక్వాడ్ (2)లు జ‌ట్టును ఆదుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.

స్టాండ్ బై ప్లేయ‌ర్‌..

సెప్టెంబ‌ర్ 9 నుంచి ఆసియా క‌ప్ 2025 ప్రారంభం కానుంది. ఈ మెగాటోర్నీ కోసం భార‌త జ‌ట్టు నేడు దుబాయ్ కు బ‌య‌లుదేరనుంది. ఈ మెగాటోర్నీలో పాల్గొనే జ‌ట్టులో య‌శ‌స్వి జైస్వాల్‌కు చోటు ద‌క్క‌లేదు. అత‌డు స్టాండ్ బై ప్లేయ‌ర్‌గా ఎంపిక అయ్యాడు.

Haris Rauf world Record : పాక్ 10వ నంబ‌ర్ బ్యాట‌ర్ వ‌ర‌ల్డ్ రికార్డు.. ఏమా కొట్టుడు సామీ..

అయితే.. అత‌డు జ‌ట్టుతో పాటు వెళ్ల‌డం లేదు. దులీప్ ట్రోఫీ సెమీస్ మ్యాచ్ అనంత‌రం అత‌డు జ‌ట్టుతో చేరే అవ‌కాశం ఉంది. ఇలాంటి స‌మ‌యంలో అత‌డు విఫ‌లం కావ‌డంతో అత‌డి అవ‌కాశాల‌ను దెబ్బ‌తీస్తుంది. ఆసియా క‌ప్‌కు ఎంపికైన 15 మంది స‌భ్యులు గ‌ల బృందంలో ఎవ‌రైనా బ్యాట‌ర్ గాయ‌ప‌డితే య‌శ‌స్వి జైస్వాల్‌కు తీసుకునే అవ‌కాశాలు ఉంటాయి.